PM Modi Wayanad Visit: ప్రధాని నరేంద్ర మోదీ వయనాడ్ చేరుకున్నారు. వాయుసేన హెలికాప్టర్‌లో కన్నూర్ ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లిన ఆయన వయనాడ్‌లోని ప్రభావిత ప్రాంతాలను ఏరియల్ సర్వే చేశారు. ప్రత్యేక హెలికాప్టర్‌లో ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో కలిసి ఏరియల్ సర్వే నిర్వహించారు. చూరల్‌మల, మందక్కై, పుంచిరిమట్టొం ప్రాంతాలను పర్యవేక్షించారు. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ హెలికాప్టర్‌లో ఈ సర్వే చేశారు. ఉదయం 11.15 గంటలకు కన్నూర్ ఎయిర్‌పోర్ట్‌కి చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్వాగతం పలికారు. ఆ తరవాత ఇద్దరూ కలిసి ప్రభావిత ప్రాంతాలపై ఏరియల్ సర్వే చేశారు. విజయన్‌తో పాటు కేంద్రమంత్రి సురేశ్ గోపీ కూడా మోదీ వెంట ఉన్నారు.
ఈ సర్వే పూర్తైన తరవాత కాల్పెట్టాలోని ఓ స్కూల్ వద్ద ల్యాండ్ కానున్నారు. అక్కడి నుంచి ప్రభావిత ప్రాంతాలను రోడ్డు మార్గంలో పరిశీలిస్తారు. ఇప్పటికే కేరళ ప్రభుత్వం రూ.2 వేల కోట్ల ఆర్థిక సాయం చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఈ క్రమంలోనే మోదీ ఇక్కడ పర్యటిస్తున్నారు. సహాయక చర్యలపైనా ఆయన ఆరా తీస్తారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. వరదల కారణంగా దెబ్బ తిన్న ప్రాంతాలను సందర్శిస్తారు. హాస్పిటల్స్‌లోని బాధితులనూ పరామర్శిస్తారు. ఈ పర్యటన పూర్తయ్యాక ఉన్నతాధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించనున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న చర్యలపై సమీక్షించనున్నారు. ఏరియల్ సర్వే తరవాత వయనాడ్‌లో ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు ప్రధాని మోదీ. సహాయక చర్యలపై ఆరా తీశారు. ఉన్నతాధికారులు ఆయనకు రెస్క్కూ ఆపరేషన్ గురించి వివరించారు. గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్‌తో పాటు కేంద్రమంత్రి సురేశో గోపీ ఆయనతో ఉన్నారు. (Also Read: Bangladesh: బంగ్లాదేశ్ సుప్రీంకోర్టుని చుట్టుముట్టిన ఆందోళనకారులు, గంటలో రాజీనామా చేయాలని చీఫ్ జస్టిస్‌కి అల్టిమేటం)
ఇటీవల వయనాడ్‌లో కొండచరియలు విరిగి పడి 400 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికీ గల్లంతైన వారి కోసం గాలింపు కొనసాగుతోంది. దాదాపు 150 మందికిపైగా వరదల్లో పడి కొట్టుకుపోయినట్టు అంచనా వేస్తున్నారు. చూరల్‌మల్, మందక్కై ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఇళ్లన్నీ ధ్వంసమై చాలా మంది నిరాశ్రయులయ్యారు. ప్రస్తుతానికి వీళ్లంతా రిలీఫ్ క్యాంప్‌లలో తల దాచుకుంటున్నారు. ఇండియన్ ఆర్మీతో పాటు NDRF,SDRF సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. పలు చోట్ల రోడ్లు, వంతెనలు ధ్వంసమయ్యాయి. తాత్కాలికంగా బ్రిడ్జ్‌లు నిర్మించి రెస్క్యూ కొనసాగిస్తున్నారు.
Also Read: Viral News: ట్రైనీ డాక్టర్‌పై దారుణంగా అత్యాచారం, ఆపై హత్య - శరీరమంతా లోతైన గాయాలు