Bihar brick kiln blast:


బిహార్‌లో  ప్రమాదం..


బిహార్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఇటుకల బట్టీలోని చిమ్నీ పేలడు కారణంగా 9 మంది కూలీలు మృతి చెందారు. మరి కొందరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రెస్క్యూ టీమ్స్‌ సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. "రామ్‌గర్వా పోలీస్ స్టేషన్‌ పరిధిలోని మోతిహరిలోని ఇటుకల బట్టీలో ఈ ప్రమాదం సంభవించింది. 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మరి కొందరు తీవ్రంగా గాయపడ్డారు. వారికి మెరుగైన చికిత్స అందిస్తున్నాం. పోలీసులతో పాటు SDRF బృందాలు కూడా సహాయక చర్యలు చేపడుతున్నాయి" అని అధికారులు వెల్లడించారు. గాయపడిన వారు ప్రమాదం నుంచి ఎలాగోలా బయటపడినప్పటికీ...శ్వాస తీసుకోడాని
ఇబ్బంది పడుతున్నట్టు వెద్యులు చెబుతున్నారు. పెద్ద మొత్తంలో పొగ లోపలకి వెళ్లడం వల్ల శ్వాస తీసుకోలేకపోతున్నారని అంటున్నారు. దాదాపు 8 మంది తీవ్రంగా గాయపడగా..వారందరికీ వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. చనిపోయయిన వారిలో ఇటుకల బట్టీ యజమాని కూడా ఉన్నాడని పోలీసులు తెలిపారు.  "జిల్లా మెజిస్ట్రేట్, ఎస్‌పీ సంఘటనా స్థలానికి వచ్చారు. రెస్క్యూ ఆపరేషన్ కూడా కొనసాగుతోంది" అని బిహార్ పోలీసులు వెల్లడించారు. ఈ ప్రమాదంపై...ప్రధాని నరేంద్ర మోడీ విచారం వ్యక్తం చేశారు. చనిపోయిన వారి కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. పీఎం రిలీఫ్ ఫండ్ కింద ఈ ఆర్థిక సహకారం అందించనున్నట్టు చెప్పారు. గాయపడిన వారికి రూ.50,000 చొప్పున అందిస్తామని హామీ ఇచ్చారు. బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఈ ప్రమాగంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారందరికీ మెరుగైన చికిత్స అందించేలా చూస్తామని హామీ ఇచ్చారు.