Pervez Musharraf Death:


పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ (79) మృతి చెందారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన UAEలోని అమెరికన్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ కన్ను మూశారు. ఆయన కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని ధ్రువీకరించారు. కొద్ది వారాలుగా  ఆయన ఆరోగ్యం విషమించిందని వివరించారు. గతంలోనూ ఓ సారి ఆయన చనిపోయినట్టు వార్తలొచ్చాయి. అయితే ఆ తరవాత అవన్నీ పుకార్లేనని తేలింది. ఇప్పుడు పాకిస్థాన్ మీడియా అధికారికంగా ఆయన చనిపోయినట్టు ప్రకటించింది. పాకిస్థాన్‌కు పదో అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు ముషారఫ్. 1998 నుంచి 2001 వరకూ ఈ పదవిలో కొనసాగారు. 1998 నుంచి 2007 వరకూ టాప్ జనరల్‌గానూ బాధ్యతలు చేపట్టారు. 1943 ఆగస్టు 11న ఢిల్లీలో జన్మించిన ముషారఫ్...కరాచీలో చదువుకున్నారు. లాహోర్‌లోని ఫర్మాన్ క్రిస్టియన్ కాలేజ్‌లో ఉన్నత విద్యనభ్యసించారు.