మంచి సినిమా తీయడంతో పాటు ప్రేక్షకుల్లోకి తీసుకు వెళ్ళడం, థియేటర్లకు వాళ్ళను రప్పించడం, నిర్మాతలు & డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు తీసుకు రావడం పెద్ద టాస్క్ కింద మారింది. 'వినరో భాగ్యము విష్ణు కథ'ను ప్రేక్షకుల్లోకి తీసుకు వెళ్ళడంలో యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం & నిర్మాత బన్నీ వాస్ (Bunny Vasu) నేతృత్వంలోని జీఏ 2 పిక్చర్స్ సక్సెస్ అయ్యారు. 


'వాసవ సుహాస...'తో పాజిటివ్ వైబ్స్!'వినరో భాగ్యము విష్ణు కథ' నుంచి మొదట 'వాసవ సుహాస...' పాటను విడుదల చేశారు. ఆ బాణీ, అందులో సాహిత్యం, గానం ఎంత శ్రావ్యంగా ఉన్నాయో ప్రేక్షకులు అందరూ విన్నారు. కళా తపస్వి కె. విశ్వనాథ్ 'వాసవ సుహాస'ను విడుదల చేశారు. అప్పటి నుంచి పాజిటివ్ వైబ్స్ నెలకొన్నాయి. సినిమాకు ఆ సాంగ్ మంచి బజ్ తీసుకు వచ్చింది. ఆ తర్వాత విడుదల చేసిన 'దర్శనా...' సాంగ్ కూడా ఆకట్టుకుంది. ఇప్పుడది యువతకు లవ్ యాంథమ్ కింద మారింది. సినిమా టీజర్ సైతం పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. దాంతో విడుదలకు ముందు సినిమా లాభాల్లోకి వెళ్ళిందని సమాచారం. 


లాభాల్లో 'వినరో...'
జీఏ 2 పిక్చర్స్ సంస్థ నుంచి వస్తున్న సినిమా కావడం... ప్రచార చిత్రాలు, పాటలు ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంతో 'వినరో భాగ్యము విష్ణుకథ' విడుదలకు కొన్ని రోజుల ముందే లాభాల్లోకి వెళ్ళిందని తెలిసింది. బిజినెస్ మొత్తం క్లోజ్ అయ్యిందట. జీఏ 2 పిక్చర్స్ సంస్థకు కొంత మంది రెగ్యులర్ బయ్యర్స్ ఉన్నారు. కొన్ని ఏరియాల్లో సొంతంగా విడుదల చేస్తారు. ఆల్రెడీ సినిమా డిస్ట్రిబ్యూషన్ రేట్స్ & రైట్స్ ఫైనల్ చేశారు. డిజిటల్ & శాటిలైట్ స్ట్రీమింగ్ రైట్స్ కూడా అమ్మేశారు. వాటితో బడ్జెట్ మొత్తం రికవరీ కావడమే కాదు, లాభాలు వచ్చాయని తెలిసింది. 


కిరణ్ అబ్బవరం ఈజ్ బ్యాక్!?
'రాజా వారు రాణీ గారు' సినిమాతో కథానాయకుడిగా పరిచయం అయిన కిరణ్ అబ్బవరం, తర్వాత 'ఎస్ఆర్ కళ్యాణ మండపం' సినిమాతో భారీ విజయాలు అందుకున్నారు. ఆ తర్వాత వచ్చిన మూడు సినిమాలు ఆశించిన విజయాలు తీసుకు రాలేదు. కిరణ్ అబ్బవరం మీద సోషల్ మీడియాలో సెటైర్లు కూడా పడ్డాయి. వరుసపెట్టి సినిమాలు చేస్తున్నా అతడికి విజయాలు రావడం లేదని! 'వినరో భాగ్యము విష్ణు కథ'కు వస్తున్న బజ్, జరుగుతున్న బిజినెస్ చూస్తుంటే కిరణ్ అబ్బవరం ఈజ్ బ్యాక్ అనిపించుకునేలా కనిపిస్తున్నారు. ఏమవుతోంది చూడాలి. 


ఫిబ్రవరి 7న ట్రైలర్!
vinaro bhagyamu vishnu katha trailer : ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో జీఏ 2 పిక్చర్స్ పతాకంపై 'బన్నీ' వాస్ నిర్మించిన ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం సరసన క‌శ్మీర ప‌ర్ధేశీ కథానాయికగా నటించారు. ఈ చిత్రానికి చైత‌న్ భరద్వాజ్ సంగీతం అందించారు. 


Also Read : 'పోకిరి', 'బాహుబలి' మేజిక్ రిపీట్ అవుతుందా? - ఇండస్ట్రీ హిట్ మీద కన్నేసిన అఖిల్


ఈ నెల 7న (మంగళవారం) 'వినరో భాగ్యము విష్ణు కథ' ట్రైలర్ విడుదల కానుంది. ఈ నెల 17న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఫిబ్రవరిలో వస్తున్న సినిమాల్లో మంచి బజ్ సొంతం చేసుకున్న సినిమాల్లో ఇదొకటి.


Also Read : రక్తపు మడుగులో వాణీ జయరామ్ - మిస్టరీగా లెజండరీ సింగర్ మృతి