Paytm FASTags News: మార్చి 15వ తేదీ తరవాత పేటీఎమ్ ఫాస్టాగ్‌ సర్వీస్‌లు పని చేయవని ఇప్పటికే RBI ప్రకటించింది. FASTag సర్వీస్‌లు అందించే 32 బ్యాంకుల జాబితా నుంచి Paytm Payments Bank Ltd ని తొలగించింది. మార్చి 15వ తేదీ తరవాత ప్రస్తుతం పేటీఎమ్ ద్వారా ఉన్న ఫాస్టాగ్‌లను రీఛార్జ్ చేసుకోడానికి వీలుండదు. ఇప్పుడు పేటీఎమ్‌లో ఈ ట్యాగ్‌ని తీసుకున్న వారు త్వరలోనే దాన్ని వేరే బ్యాంక్‌కి మార్చుకోవాలని అధికారులు స్పష్టం చేశారు. జనవరి 31వ తేదీన RBI పేటీఎమ్ బ్యాంక్‌పై ఆంక్షలు విధించింది. అంతర్గతంగా మనీ లాండరింగ్ జరిగిందని, భారీ అవతవకలు జరిగాయని స్పష్టం చేసింది. వీటిని సరి చేసుకోవాలి ఆదేశించింది. అప్పటి వరకూ ఈ ఆంక్షలు కొనసాగుతాయని వెల్లడించింది. దీనిపై ఇప్పటికే ఈడీ దర్యాప్తు మొదలైంది. ఇప్పటి వరకూ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈ ఆంక్షల్ని పొడిగించింది. ఈ క్రమంలోనే ఫాస్టాగ్ సర్వీస్‌లనూ నిలిపివేసింది. అందుకే...ఇకపై వాహనదారులు ప్రత్యామ్నాయం చూసుకోవాల్సిందే. పేటీఎమ్ కాకుండా ఇతర బ్యాంక్‌లు కూడా ఈ సేవలని అందిస్తున్నాయి. 


ICICI బ్యాంక్ ఫాస్టాగ్: 


ఈ లిస్ట్‌లో ICICI బ్యాంక్ ఉంది. ఈ బ్యాంక్ ద్వారా వాహనదారులు ఫాస్టాగ్‌ని జనరేట్ చేసుకోవచ్చు. బ్యాంక్‌ వెబ్‌సైట్‌ ద్వారా దీన్ని తీసుకోవచ్చు. లేదంటే సమీపంలోని బ్రాంచ్‌కి వెళ్లి ఈ ట్యాగ్‌ తీసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. 


NHAI ఫాస్టాగ్:


National Highways Authority of India ద్వారా కూడా ఫాస్టాగ్ తీసుకోవచ్చు. కానీ...ఇందులో బ్యాంక్‌తో సంబంధం ఉండదు. నేరుగా టోల్‌ ప్లాజాలు, పెట్రోల్ బంక్‌లు లేదా My FasTag యాప్‌ ద్వారా వీటిని తీసుకోవచ్చు. దీంతో పాటు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలోనూ అందుబాటులో ఉంటుంది. 


HDFC బ్యాంక్ ఫాస్టాగ్:


HDFC బ్యాంక్ ద్వారా సులువుగానే ఫాస్టాగ్‌ని పొందొచ్చు. వెబ్‌సైట్‌లో తీసుకోవచ్చు. లేదంటే దగ్గర్లోని బ్రాంచ్‌కి వెళ్లి ఫాస్టాగ్‌ని తీసుకునే వెసులుబాటు ఉంటుంది.


Kotak Mahindra బ్యాంక్ ఫాస్టాగ్: 


టోల్‌ పేమెంట్స్‌ కోసం కొటక్ మహీంద్రా ఫాస్టాగ్‌లు అందిస్తోంది. ఆన్‌లైన్‌లోనే కాకుండా నేరుగా బ్రాంచ్‌కి వెళ్లి ఫాస్టాగ్‌ని తీసుకునే అవకాశముంది. 


SBI ఫాస్టాగ్:


SBI ద్వారా తీసుకుని ఫాస్టాగ్‌లు తీసుకునే వెసులుబాటు ఉంది. అన్ని టోల్‌ ప్లాజాల వద్ద ఇది చెల్లుబాటవుతుంది. ఆన్‌లైన్‌లో లేదా బ్రాంచ్‌కి వెళ్లి ఈ ట్యాగ్ తీసుకోవచ్చు. 


ఫాస్టాగ్‌ని పోర్ట్ చేయడం ఎలా? (How to port FASTag?)


పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ నుంచి మీ ఫాస్టాగ్‌ను మార్చుకోవాలంటే, ఆ బ్యాంక్ కస్టమర్ కేర్‌కు కాల్ చేసి మాట్లాడండి. ఆర్‌బీఐ ఆంక్షల నేపథ్యంలో ఫాస్టాగ్‌ను వేరే బ్యాంక్‌కు బదిలీ చేసుకుంటామని రిక్వెస్ట్ చేయండి. కస్టమర్‌ కేర్‌ అధికారి అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి. ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత, నిబంధనల ప్రకారం, కస్టమర్‌ కేర్‌ అధికారి మీ ఫాస్టాగ్‌ను పోర్ట్ చేస్తారు.పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ జారీ చేసిన నేషనల్‌ కామన్‌ మొబిలిటీ కార్డ్‌ను కూడా మార్చి 15 వరకే మీరు రీఛార్జ్‌ చేయగలరు. ఆ తర్వాత, అందులోని బ్యాలెన్స్‌ ఖాళీ అయ్యే వరకు వినియోగించుకోవచ్చు.