NIACL Assistant Admitcard: న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్( NIACL) అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నిర్వహించనున్న ప్రిలిమినరీ పరీక్ష (Prelims Exam) అడ్మిట్‌‌కార్డులు విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో అడ్మిట్‌కార్డులను అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు/రూల్ నెంబరు, పాస్‌వర్డ్/పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మార్చి 2న అసిస్టెంట్ పోస్టులకు ఆన్‌లైన్ విధానంలో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నారు.


ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించివారికి తర్వాతి దశలో మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు. ప్రిలిమ్స్‌లో కనీసం కట్ ఆఫ్ మార్కులు సాధించిన వారిని మాత్రమే మెయిన్స్‌ పరీక్షకు ఎంపికచేస్తారు. పరీక్ష రోజువరకు అడ్మిట్‌కార్డులు అందుబాటులో ఉంటాయి. అభ్యర్థులకు ఏప్రిల్ 13న మెయిన్ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్షల ద్వారా న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్‌లో 300 అసిస్టెంట్ పోస్టుల భర్తీకి చేయనున్నారు. మొత్తం ఖాళీల్లో తెలుగురాష్ట్రాలకు 12 పోస్టులు కేటాయించారు. వీటిలో తెలంగాణకు 6, ఏపీకి 6 పోస్టులు కేటాయించారు. ఉద్యోగాలకు ఎంపికైనవారికి నెలకు రూ.37,000 జీతంగా చెల్లిస్తారు.


అసిస్టెంట్ ప్రిలిమ్స్ పరీక్ష హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..


ప్రిలిమ్స్ పరీక్ష విధానం:


➥  మొత్తం 100 మార్కులకు ఆన్‌లైన్‌ విధానంలో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 100 ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు అడుగుతారు. పరీక్షలో మొత్తం 3 విభాగాలు ఉంటాయి.


➥ ఇందులో ఇంగ్లిష్ లాంగ్వేజ్-30 ప్రశ్నలు-30 మార్కులు, రీజనింగ్-35 ప్రశ్నలు-35 మార్కులు, న్యూమరికల్ ఎబిలిటీ-35 ప్రశ్నలు-35 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం 60 నిమిషాలు. ఒక్కో విభాగానికి 20 నిమిషాల సమయం కేటాయించారు.


➥  ప్రతి సరైన సమాధానానికి 1 మార్కు ఉంటుంది. ఇక ప్రతి తప్పు సమాధానానికి ¼ (0.25) చొప్పున మార్కుల్లో కోత విధిస్తారు. అంటే ప్రతి నాలుగు తప్పు సమాధానాలకు ఒకమార్కు కోత విధిస్తారు.


తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: ఏపీలో గుంటూరు, కాకినాడ, కర్నూలు, రాజమహేంద్రవరం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, ఒంగోలు; తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్‌లో పరీక్ష నిర్వహిస్తారు.


మెయిన్ పరీక్ష విధానం..


➥  ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించివారికి మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 250 మార్కులకు మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో 5 విభాగాల నుంచి మొత్తం 200 ఆబ్జెక్టివ్ తరమా ప్రశ్నలు అడుగుతారు. ఇందులో.. 


➥ ఇంగ్లిష్ లాంగ్వేజ్: 40 ప్రశ్నలు-50 మార్కులు-30 నిమిషాలు.


➥ రీజనింగ్: 40 ప్రశ్నలు-50 మార్కులు-30 నిమిషాలు.


➥ న్యూమరికల్ ఎబిలిటీ: 40 ప్రశ్నలు-50 మార్కులు-30 నిమిషాలు 


➥ కంప్యూటర్ నాలెడ్జ్: 40 ప్రశ్నలు-50 మార్కులు-15 నిమిషాలు.


➥ జనరల్ అవేర్‌నెస్: 40 ప్రశ్నలు-50 మార్కులు-15 నిమిషాలు కేటాయించారు.


➥ ప్రతి సరైన సమాధానానికి 1 మార్కు ఉంటుంది. ఇక ప్రతి తప్పు సమాధానానికి ¼ (0.25) చొప్పున మార్కుల్లో కోత విధిస్తారు. అంటే ప్రతి నాలుగు తప్పు సమాధానాలకు ఒకమార్కు కోత విధిస్తారు.


మెయిన్ ఎగ్జామ్ పరీక్ష కేంద్రాలు: ఏపీలో విజయవాడ, విశాఖపట్నం; తెలంగాణలో హైదరాబాద్‌లో మాత్రమే మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు.


ముఖ్యమైన తేదీలు..


➥ ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 01.02.2024.


➥ ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేదీ: 15.02.2024.


➥ ప్రిలిమినరీ పరీక్ష తేది: 02.03.2024.


➥ ప్రిలిమినరీ పరీక్ష తేది: 13.04.2024.


నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


Website