Parliament Monsoon Session LIVE Updates: ఓబీసీ బిల్లుకు ప్రతిపక్షాలు ఓకే.. చర్చలో పాల్గొనేందుకు అంగీకారం

Advertisement

ఓబీసీ బిల్లుకు పూర్తిగా సహకరిస్తామని ప్రతిపక్షాలు స్పష్టం చేశాయి. ఈ రోజు ఓబీసీ బిల్లును కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది.

ABP Desam Last Updated: 09 Aug 2021 12:24 PM
ఆ బిల్లుకు ఆమోదం..

షెడ్యూల్డ్ ట్రైబ్స్ రాజ్యాంగ సవరణ బిల్లు 2021కి లోక్ సభ ఆమోదం తెలిపింది. 1950లో వచ్చిన ఈ చట్టంలో నేడు సవరణలు చేశారు. తమ రాష్ట్రాల్లోని వెనుకబడిన వర్గాలను గుర్తించి నోటిఫై చేసే అధికారం రాష్ట్రాలకు తిరిగి ఇవ్వడం ఈ బిల్లు లక్ష్యం.

Continues below advertisement
రాజ్యసభ వాయిదా..

పెగాసస్ వ్యవహారంపై చర్చ జరపాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష పార్టీలు రాజ్యసభలో నిరసన చేశాయి. దీంతో రాజ్యసభను 2 గంటల వరకు వాయిదా వేశారు.

Background

పెగాసస్‌ సహా పలు అంశాలపై ఆందోళనలు చేస్తూ పార్లమెంట్‌ను స్తంభింపజేస్తున్న ప్రతిపక్షాలు.. ఒక్క బిల్లుకు మాత్రం ప్రభుత్వానికి మద్దతు ప్రకటించాయి. నేడు ప్రవేశపెట్టే 127వ రాజ్యాంగ సవరణ బిల్లుకు మద్దతు ఇస్తున్నట్లు విపక్షాలు ఏకగ్రీవంగా ప్రకటించాయి. ఈ బిల్లు వచ్చినప్పుడు ఎలాంటి ఆందోళనలు చేపట్టకుండా చర్చలో పాల్గొంటామని వెల్లడించాయి. ఇది చాలా ముఖ్యమైన అంశమని, అందుకే కేంద్రానికి మద్దతివ్వాలని నిర్ణయించినట్లు విపక్ష నేతలు చెప్పారు. 


రాష్ట్రాల్లో ఓబీసీ జాబితాని నిర్వహించే అధికారాన్ని ఈ బిల్లు ద్వారా కేంద్రం.. రాష్ట్రాలకే కట్టబెట్టనుంది. జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్‌కు ప్రతిపాదించకుండానే తమ రాష్ట్రాల్లోని ఓబీసీ, సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాలను గుర్తించి నోటిఫై చేసే అధికారం రాష్ట్రాలకు దక్కనుంది. ఈ బిల్లు ఆమోదం పొందాలంటే పార్లమెంట్‌లో మూడింట రెండొంతుల మెజార్టీ అవసరం. అయితే వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఓబీసీల మద్దతు సంపాదించుకోవడం కోసమే భాజపా కేంద్ర నాయకత్వం వ్యూహాత్మకంగా ఈ బిల్లును తీసుకొస్తుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.