Pakistan Issues Second NOTAM Amid India Trishul  Exercise:  భారత్ తన సైనిక సన్నద్థతా విన్యాసాలు  ‘త్రిశూల్ 2025’ చేస్తూండటంతో పాకిస్తాన్ కు వణుకు పుడుతోంది. యుద్ధం చేయడానికి సన్నాహాలు చేసుకుంటోందని భయపడుతోంది. అందుకే  పాకిస్తాన్ ‘పానిక్ & ప్రీకాషన్’ స్థితికి వెళ్లిపోయింది.  రెండో  సారి NOTAM (Notice to Airmen) సంకేతాలు జారీ చేసింది. ఐదు రోజుల్లో రెండోసారి విమానాల ప్రయాణాలపై నిషేధాలు విధించిన ఈ NOTAM, నవంబర్ 1 నుంచి 30 వరకు అమలులో ఉంటుంది. దక్షిణ, తీర ప్రాంతాల్లో పెద్ద భాగం విమానాల ప్రయాణాలకు మూసివేసింది.  

Continues below advertisement

త్రిశూల్ 2025 భారత్ త్రివిధ దళాల బలోపేతం కోసం చేపట్టే ఎక్సర్ సైజ్.   20,000 మంది సైనికులు, రాఫెల్‌లు, ట్యాంకులు ఇందులో పాలు పంచుకుంటున్నాయి. భారత్‌లో ‘త్రిశూల్ 2025’ వ్యాయామం అక్టోబర్ 30 నుంచి నవంబర్ 11 వరకు 12 రోజులు జరుగుతోంది. గుజరాత్  లోని సర్ క్రీక్ ప్రాంతం, రాజస్థాన్, గుజరాత్‌లో ఈ   విన్యాసాలు జరుగుతున్నాయి.  భారత సైన్యం, నావికాదళం, వాయుసేన మూడు విభాగాలు కలిసి పాల్గొంటున్న ఈ ఎక్సర్ సైజ్‌ ను దక్షిణ కమాండ్ సైనికులు లీడ్ చేస్తున్నారు.  20,000కి పైగా సైనికులు, T-90S, అర్జున్ ట్యాంకులు, హౌఇట్జర్‌లు, మిస్సైల్ సిస్టమ్‌లు, ఆక్రమణ హెలికాప్టర్లు, రాఫెల్, సుఖోయ్-30MKI ఫైటర్‌లు, AWACS (ఎయిర్‌బోర్న్ అర్లీ వార్నింగ్), మిడ్-ఎయిర్ రిఫ్యూయలర్లు, RPAలు, ఫ్రిగేట్లు, డిస్ట్రాయర్లు పాల్గొంటున్నాయి. 

ఇవన్నీ చూస్తున్న పాకిస్తాన్.. భారత్ యుద్ధ సన్నాహాలు చేసుకుంటోందని కంగారు పడుతోంది.  దక్షిణ, తీర ప్రాంతాల్లో విమానాల నిషేధం విధిచింది.  పాకిస్తాన్ మొదటి NOTAM అక్టోబర్ 28, 29న జారీ చేసింది. కరాచీ, లాహోర్  విమాన రూట్లను ఓ రోజు మూసివేసింది.  . ఇప్పుడు రెండో NOTAM, నవంబర్ 1 నుంచి 30 వరకు అమలులోకి వచ్చింది. దీనిలో దక్షిణ, తీర ప్రాంతాల్లో పెద్ద భాగం విమానాల ప్రయాణాలను నిలిపివేశారు.  

Continues below advertisement

ఇంటెలిజెన్స్ వర్గాల ప్రకారం, ఈ NOTAM భారత్‌కు ‘డిటరెన్స్ సిగ్నల్’గా పంపించారు. భారత్ విన్యాసాలు చేస్తున్నట్లుగా చేసి.. దక్షిణ ఎయిర్‌బేస్‌లు, నావల్ ఫ్లీట్లపై దాడుల అవకాశం ఉందని పాకిస్తాన్ భావిస్తోంది.   ఇస్లామాబాద్ తన విమాన, సముద్ర సరిహద్దులను రక్షించాలని నిర్ణయించుకుంది.  పాకిస్తాన్ అన్ని సైనిక విభాగాలను నవంబర్ 30 వరకు రెడ్ అలర్ట్‌పై ఉంచింది. తీర ప్రాంతాల్లో సర్వైలెన్స్ పెంచారు, ఉత్తర అరేబియన్ సీలో నావల్, వాయు ఆస్తులను రీపొజిషన్ చేశారు.     

మే 2025లో పహాల్గాం టెర్రర్ అటాక్‌కు ప్రతిస్పందనగా భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టడం, టెర్రర్ హబ్‌లు, ఎయిర్‌బేస్‌లపై దాడులు చేశారు. ఈ కారణంగా  త్రిశూల్ వ్యాయామం పాకిస్తాన్‌లో ఆందోళన కలిగించింది. దసరా సందర్భంగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సర్ క్రీక్‌లో సైనిక శిబిరంలో పాక్‌ను హెచ్చరించడం కూడా దీనికి కారణం. భారత్ ఈ ఎక్సర్ సైజ్‌ను భార త్‘రొటీన్’గా చెబుతున్నప్పటికీ, పాకిస్తాన్ మాత్రం భయపడిపోతోంది.