Balakrishna's Akhanda 2 First Single Release Date Fixed : గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి కాంబోలో అవెయిటెడ్ డివోషనల్ టచ్ హై యాక్షన్ థ్రిల్లర్ 'అఖండ 2'. ఈ మూవీ కోసం బాలయ్య ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రిలీజ్ అయిన రెండు స్పెషల్ గ్లింప్స్ వీడియోస్ గూస్ బంప్స్ తెప్పించాయి. ఇక మ్యూజిక్ లెజెండ్ తమన్ బీజీఎం హైలెట్‌గా నిలవనుండగా ఫస్ట్ సింగిల్ ఎప్పుడు వస్తుందా? అని అందరూ వెయిట్ చేస్తున్నారు. దీనిపై ఓ లేటెస్ట్ బజ్ వైరల్ అవుతోంది.

Continues below advertisement


ఫస్ట్ సింగిల్ అప్పుడే?


'అఖండ 2' నుంచి ఫస్ట్ సింగిల్‌ను నవంబర్ 5న రిలీజ్ చేసేందుకు మూవీ టీం ప్లాన్ చేస్తోందని తెలుస్తోంది. అయితే, దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది. ఈ బజ్‌తో బాలయ్య ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. బాలయ్య జోష్, గ్రేస్‌కు తగ్గట్లుగా తమన్ ఫుల్ మాస్ ట్రీట్ అందిస్తారని... థియేటర్స్ దద్దరిల్లడం ఖాయమని అంటున్నారు.


అందుకు తగినట్లుగానే తమన్ సోషల్ మీడియా వేదికగా మ్యూజిక్ అప్డేట్స్ ఇస్తూ వస్తున్నారు. మూవీలో బాలయ్య డ్యూయెల్ రోల్ చేస్తుండగా మాస్ రో‌ల్‌కు తగినట్లుగా రీసౌండ్ అదిరిపోయింది. ఇక అఘోరి పాత్రలో 'అఖండ' రుద్ర తాండవం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మాస్ అంశాలతో పాటు డివోషనల్ టచ్‌కు తగ్గట్లుగా ఆధ్యాత్మిక, దైవత్వాన్ని పాటలు, శ్లోకాల రూపంలో ఎక్కువగా ఉండేలా తమన్ ప్లాన్ చేస్తున్నారట. సినిమాలో సాంస్కృతిక, పురాణ సాహిత్యం వేరే లెవల్‌లో ఉండబోతోందని అర్థమవుతోంది. సంస్కృత శ్లోకాలు చెప్పడంలో ఫేమస్ పండిట్ అతుల్ మిశ్రా సోదరులతో పాటు ఫేమస్ క్లాసికల్ సింగర్స్ సర్వేపల్లి సిస్టర్స్‌ను తమన్ రంగంలోకి దించారు. మిశ్రా సోదరులు చెప్పిన శ్లోకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. 


Also Read : 'బాహుబలి' vs 'మాస్ జాతర'... రవితేజపై రాజమౌళి దెబ్బ - బుకింగ్స్, క్రేజ్ కంపేర్ చేస్తే?


మూవీలో బాలకృష్ణ సరసన సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఆది పినిశెట్టి నెగిటివ్ రోల్ చేస్తున్నారు. హర్షాలి మెహతా కీలక పాత్ర పోషిస్తున్నారు. బాలకృష్ణ కుమార్తె తేజస్విని సమర్పణలో 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ అచంట, గోపీచంద్ అచంట మూవీని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. 2021లో వచ్చిన అఖండ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీనికి సీక్వెల్‌గా వస్తోన్న ఈ మూవీ కూడా బిగ్గెస్ట్ హిట్ కావడం ఖాయమని ఫ్యాన్స్ అంటున్నారు. బాలయ్య, బోయపాటి కాంబోలో వచ్చిన సింహా, లెజెండ్ కూడా బిగ్ సక్సెస్ అందుకున్నాయి.