అక్టోబర్ నెలాఖరున తెలుగులో ముఖ్యంగా రెండు సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి 'బాహుబలి: ది ఎపిక్', మాస్ మహారాజా రవితేజ 75వ సినిమా 'మాస్ జాతర' థియేటర్లలోకి వచ్చాయి. రెండు సినిమాల్లో ఏ సినిమాకు ఎక్కువ కేజ్ ఉంది? బుకింగ్స్ పరంగా ఎవరిది పైచేయి? అనేది చూస్తే...
'మాస్ జాతర' మీద 'బాహుబలి' దెబ్బ!బుకింగ్స్ చూస్తే రవితేజ సినిమాపై రాజమౌళి సినిమా పైచేయి సాధించింది. 'మాస్ జాతర' మీద 'బాహుబలి: ది ఎపిక్' ఎఫెక్ట్ గట్టిగా పడింది. అక్టోబర్ 30న 'బాహుబలి: ది ఎపిక్' ప్రీమియర్స్ హౌస్ ఫుల్స్ అయ్యాయి. హైదరాబాద్ మాత్రమే కాదు... ఏయే ఏరియాల్లో ప్రీమియర్స్ పడ్డాయో? అవన్నీ హౌస్ ఫుల్స్ అయ్యాయి.
హైదరాబాద్ సిటీలో అక్టోబర్ 31న సాయంత్రం ఐదున్నర గంటలకు 'మాస్ జాతర' ఫస్ట్ ప్రీమియర్ షో షెడ్యూల్ చేశారు. ప్రసాద్ ఐమ్యాక్స్‌లో ఆ షో పడుతోంది. షో మొదలు కావడానికి ఆరు గంటల ముందు వరకు థియేటర్ హౌస్ ఫుల్ కాలేదు. టోటల్ హైదరాబాద్ సిటీలో ఐదు థియేటర్స్ లోపే హౌస్ ఫుల్స్ అయ్యాయి. బుక్ మై షో వంటి యాప్స్ చూస్తే చాలా థియేటర్లలో టికెట్స్ ఎవైలబుల్ ఉన్నాయి.
రవితేజ క్రేజ్ మీద వరుస ఫ్లాప్స్ ఎఫెక్ట్!మాస్ మహారాజా రవితేజ లాస్ట్ సినిమాలు ఫ్లాప్స్ అయ్యాయి. ఆ విషయాన్ని 'మాస్ జాతర' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన కూడా యాక్సెప్ట్ చేశారు. అందువల్ల ఆయన క్రేజ్ మీద గట్టి దెబ్బ పడింది. హిట్ టాక్ వస్తే వెళదామని చూసే ఆడియన్స్ ఎక్కువ మంది ఉన్నారు. అందువల్ల, బుకింగ్స్ డల్‌గా ఉన్నాయి. హౌస్ ఫుల్స్ కావడం లేదు.
'బాహుబలి: ది ఎపిక్'తో కంపేర్ చేస్తే... 'మాస్ జాతర' బుకింగ్స్ చాలా తక్కువగా ఉన్నాయ్. రవితేజ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినప్పుడు సోలో రిలీజ్ వస్తుందని ఫ్యాన్స్ సంబరపడ్డారు. అప్పటికి బాక్స్ ఆఫీస్ పోటీలో మరొకటి లేదు. అనూహ్యంగా 'బాహుబలి: ది ఎపిక్' వచ్చింది. అక్కడికీ ఒక్క రోజు ఆలస్యంగా రావాలని డిసైడ్ అయ్యారు. అక్టోబర్ 31న ఉదయం 'బాహుబలి: ది ఎపిక్'కి వెళ్లే ఆడియన్స్ ఎక్కువ ఉంటారు కనుక సాయంత్రం నుంచి ప్రీమియర్స్ ద్వారా రిలీజ్ చేస్తున్నారు. అయినా సరే ఉపయోగం లేకుండా పోయింది.
ఫ్లాపుల్లో ప్రీ రిలీజ్ బిజినెస్ బావుంది గానీ...రవితేజకు వరుస ఫ్లాపులు వచ్చినా సరే 'మాస్ జాతర' బిజినెస్ మీద పెద్దగా ఎఫెక్ట్ పడలేదు. థియేట్రికల్ బిజినెస్ 30 కోట్ల వరకు జరిగింది. ప్రజెంట్ బుకింగ్స్ ట్రెండ్ చూస్తుంటే అంత వచ్చేలా కనిపించడం లేదు. హిట్ టాక్ వస్తే అంత రాబట్టడం కష్టం ఏమీ కాదు. హ్యాపీగా కలెక్షన్స్ వస్తాయి.
Also Read: 'బాహుబలి ది ఎపిక్' రివ్యూ: రెండు కాదు... ఒక్క సినిమాగా ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ ఇచ్చిందంటే?