Kotha Lokah Vs Kantara Chapter 1 OTT Streaming : బాక్సాఫీస్ సంచలన విజయాలు సాధించిన మూవీస్, ఓటీటీ లవర్స్ ఎప్పుడెప్పుడు చూద్దామా అంటూ ఎదురుచూసిన రెండు బ్లాక్ బస్టర్ మూవీస్ ఓటీటీల్లోకి వచ్చేశాయి. కన్నడ స్టార్ రిషబ్ శెట్టి రీసెంట్ బ్లాక్ బస్టర్ 'కాంతార చాప్టర్ 1'తో పాటు మలయాళ బ్యూటీ కల్యాణి ప్రియదర్శన్ ప్రధాన పాత్రలో నటించిన సూపర్ హీరో అడ్వెంచర్ థ్రిల్లర్ 'కొత్త లోక' ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి.

Continues below advertisement


ఆ ఓటీటీల్లో...


కాంతార చాప్టర్ 1 - కన్నడ స్టార్ రిషబ్ శెట్టి హీరోగా స్వీయ దర్శకత్వం వహించిన 'కాంతార చాప్టర్ 1' శుక్రవారం నుంచి ప్రముఖ ఓటీటీ 'అమెజాన్ ప్రైమ్ వీడియో'లో అందుబాటులోకి వచ్చింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. హిందీ వెర్షన్ మాత్రం కొన్ని రోజుల తర్వాత అందుబాటులోకి రానుంది.


మూవీలో రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటించగా... గుల్షన్ దేవయ్య, జయరాం, ప్రమోద్ శెట్టి తదితరులు కీలక పాత్రలు పోషించారు. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిరంగదూర్ ప్రొడ్యూస్ చేశారు. అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ వరల్డ్ వైడ్‌గా రూ.800 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. 2022లో వచ్చిన 'కాంతార'కు ప్రీక్వెల్‌గా ఈ మూవీని తెరకెక్కించారు.






స్టోరీ ఏంటంటే?


కదంబుల రాజ్య పాలనలోని అటవీ ప్రాంతంలో ఉండే దైవ భూమి కాంతార. అందులో ఈశ్వరుని పూదోట, మహిమ గల బావికి కాంతార తెగ  వారు కాపలా కాస్తుంటారు. బావిలో దొరికిన బిడ్డకు బెర్మె (రిషబ్ శెట్టి) అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటారు. ఈశ్వరుని పూదోటపై కన్నేసిన బాంగ్రా రాజు చనిపోగా అతని వారసుడు కులశేఖరుడు (గుల్షన్ దేవయ్య) దానిపై కన్నేస్తాడు. తన తెగ వారిని బెర్మె ఎలా కాపాడుకున్నాడు? కనకవతి (రుక్మిణి వసంత్) కాంతార తెగకు కలిగిన ఇబ్బందులేంటి? కాంతార దైవిక భూమిలో ఉన్న దైవ గణాల రహస్యమేంటి? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.


Also Read : ఘనంగా నారా రోహిత్, శిరీషల వివాహం - హాజరైన ఏపీ సీఎం చంద్రబాబు దంపతులు


కొత్త లోక - మలయాళ బ్యూటీ కల్యాణి ప్రియదర్శన్ రీసెంట్ సూపర్ ఫాంటసీ బ్లాక్ బస్టర్ 'కొత్త లోక చంద్ర' ప్రముఖ ఓటీటీ జియో హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ అందుబాటులోకి వచ్చింది. ఈ మూవీకి డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించగా... కల్యాణితో పాటు నస్లెన్, దుల్కర్ సల్మాన్, షాబిన్ షౌహిర్, టొవినో థామస్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. రూ.30 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన మూవీ దాదాపు రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దుల్కర్ సొంత నిర్మాణ సంస్థ 'వేఫేరర్ ఫిల్మ్స్' బ్యానర్‌పై నిర్మించారు. 


స్టోరీ ఏంటంటే?


హీరోయిన్‌కు సూపర్ పవర్స్ వస్తే ఏం జరుగుతుంది అనేదే మూవీ స్టోరీ. చంద్ర (కల్యాణి ప్రియదర్శన్)కు ఉన్న సూపర్ పవర్స్‌తో మంచి పనులు చేస్తుంటుంది. ఈ విషయం అతి కొద్దిమందికే తెలుసు. పెద్దల సూచనలతో బెంగుళూరులో రాత్రి పూట ఓ రెస్టారెంట్‌లో పని చేస్తుంది. చంద్ర అద్దెకు దిగిన ఇంటి ఎదురు అపార్ట్‌మెంట్‌లో సన్నీ (నస్లెన్) ఉంటాడు. తొలిచూపులోనే చంద్రతో ప్రేమలో పడ్డ అతను ఆమె గురించి తెలుసుకుని షాక్ అవుతాడు. అసలు చంద్ర ఎవరు? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.