MLA Sudarshan Reddy as advisor: తెలంగాణ మంత్రివర్గాన్ని  విస్తరించారు. అయితే ఒక్క అజహరుద్దీన్ కు మాత్రమే అవకాశం కల్పించారు. అవకాశం కోసం చూస్తున్న ఇతర నేతలకు  నామినేటెడ్ పోస్టులు కేటాయించారు.   తెలంగాణ కాంగ్రెస్ హైకమాండ్, రాష్ట్ర క్యాబినెట్ విస్తరణ ముందు మంత్రి పదవి కోసం ఆశలు  పెట్టుకున్న సీనియర్ నేత, బోధన్ ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డిని సలహాదారుగా పదవి ప్రకటించారు.  హైకమాండ్ ఆదేశాల మేరకు సుదర్శన్ రెడ్డిని ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా నియమించారు.  ఆరు గ్యారంటీల అమలు విషయాలను ఆయన చూసుకుంటారు.  

Continues below advertisement


ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం  జీవో   నంబర్ 142 జారీ చేసింది.  సుదర్శన్ రెడ్డి ఆరు గ్యారంటీలు – మహాలక్ష్మి, రైతు భరోసా, గృహ జ్యోతి, ఇందిరమ్మ ఇల్లు, యువ వికాసం, చేయూత వంటి పథకాల అమలులో కీలక పాత్ర పోషించనున్నారు. ఈ గ్యారంటీల అమలు, దాదాపు 1.05 కోట్ల ప్రజా పాలన దరఖాస్తులపై ఆధారపడి ఉంది.  సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పని చేశారు.  2023 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుతో పాటు మంత్రి పదవి ఆశలు పెట్టుకున్నారు. మొదటి దశ విస్తరణలో అవకాశం రాలేదు.  జూన్   క్యాబినెట్ విస్తరణలో బీసీ, ఎస్సీలకే అవకాశం కల్పించాలని అనుకోవడంతో ఆయన పేరు పరిగణనలోకి రాలేదు.  
 
 డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఐటీ మంత్రి డి. శ్రీధర్ బాబు నేతృత్వంలో ఏర్పడిన ఆరు గ్యారంటీల సబ్-కమిటీలో సుదర్శన్ రెడ్డిని సలహాదారుగా నియమించడం ద్వారా హైకమాండ్ ఆయకు కేబినెట్ హోదా కల్పించినట్లయింది.  ఈ పదవి ద్వారా మంత్రి స్థాయి సదుపాయాలు, డెసిషన్ మేకింగ్‌లో పాల్గొనే అవకాశం కల్పిస్తుంది. ఇది తాత్కాలికంగానే   త్వరలో మంత్రి పదవి ఖాయం అని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.


మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కూడా మంత్రి పదవి కోసం ఎదురు చూస్తున్నారు. పార్టీ హైకమాండ్ తనను మోసం చేయదని.. ఆయన అనుకుంటున్నారు.  పార్టీ కష్టకాలంలో అందరూ పార్టీ మారిపోయినా తాను మాత్రం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పార్టీని కాపాడుకున్నానని చెబుతూ వస్తున్నారు. అయితే సామాజిక సమీకరణాలతో ఆయనకు పదవులు ఇవ్వలేకపోయారు. ఈ కారణంగా ఆయనకు సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చారు.  ఇటీవల అనారోగ్యానికి గురైన ఆయన ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిద్దరూ మంత్రి పదవి రేసులో కీలకంగా ఉన్నారు.   


మరో నేత రాజగోపాల్ రెడ్డి కూడా మంత్రి పదవి కోసం పోటీ పడుతున్నారు. అయితే ఆయన కు మాత్రం ఎలాంటి నామినేటెడ్ పోస్టు ప్రకటించలేదు. మంత్రి పదవి ఇవ్వకపోవడంతో .. ఆయన ఇటీవలి కాలంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. పార్టీ మారుతారన్న ప్రచారమూ జరుగుతోంది. ఆయన క్రమశిక్షణ ఉల్లంఘిస్తూండటంతో నామినేటెడ్ పోస్టులు కూడా ఇవ్వడం లేదని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.