అఫ్గానిస్థాన్ లో ప్రస్తుత పరిస్థితులపై ప్రపంచమంతా ఆందోళన చెందుతుంటే.. పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాత్రం సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిని బానిస సంకెళ్లను తెంచుకోవడంగా అభివర్ణించారు. ఇతరుల సంస్కృతిని ఆకళింపు చేసుకోవడంపై ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఇమ్రాన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
20 ఏళ్ల తర్వాత అఫ్గానిస్థాన్ ను పూర్తిగా స్వాధీనం చేసుకున్న తాలిబన్ల వెనుక పాక్ మద్దతు ఉన్నట్లు ఇప్పటికే చాలా ఆరోపణలున్నాయి. అయితే ప్రస్తుతం అఫ్గానిస్థాన్ లో జరుగుతున్న పరిణామాలపై పాక్ వైఖరి ఏంటనేదానిపై ఇమ్రాన్ నేతృత్వంలో కీలక భేటీ జరగనున్నట్లు ఆ దేశ విదేశీ వ్యవహారాల మంత్రి షా మహ్మూద్ ఖురేషీ తెలిపారు. జాతీయ భద్రతా సమావేశంలో ఈ మేరకు సరైన నిర్ణయం తీసుకుంటామని ఆయన అన్నారు.
ALSO READ:
Taliban: తాలిబన్లు అంత రిచ్ ఆ! ఈ షాకింగ్ నిజాలు తెలుసా?
సీనియర్ రాజకీయ, సైనిక నాయకులు సహా ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ బాజ్వా, విదేశాంగ మంత్రి ఖురేషి కూడా ఈ సమావేశంలో పాల్గొననున్నారు. పక్క దేశం అఫ్గానిస్థాన్ లోని నేతలతో టచ్ లో ఉండాలని ఇమ్రాన్ ఖాన్ సూచించినట్లు సమాచారం.
భయంకరం..
తాలిబన్లు ఆక్రమించికున్న తర్వాత అఫ్గానిస్థాన్ లో పరిస్థితులు భయంకరంగా మారాయి. ఎటు చూసినా ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. తమ సొంత దేశాలకు వెళ్లేందుకు చాలా మంది ప్రయత్నిస్తున్నారు. తుపాకీ మోతలతో అఫ్గానిస్థాన్ దద్దరిల్లుతుంది. భారత్ సహా పలు దేశాలు తమ పౌరులను సురక్షితంగా తీసుకువచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి.