Taliban: తాలిబన్లు అంత రిచ్ ఆ! ఈ షాకింగ్ నిజాలు తెలుసా?

ABP Desam Updated at: 16 Aug 2021 07:00 PM (IST)

తాలిబన్లు.. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఇదే పేరు వినిపిస్తోంది. ఏకంగా దేశాన్నే తమ చేతుల్లోకి తీసుకున్న ఈ తాలిబన్ల పవరెంత? వారి ఆస్తులు ఎంతో తెలుసా?

తాలిబన్ల గురించి షాకింగ్ విషయాలు..

NEXT PREV

తాలిబన్లు.. ఈ పేరు వినగానే గుర్తొచ్చే దేశం అఫ్గానిస్థాన్. అయితే ప్రాణాలకు లెక్క చేయకుండా తమ లక్ష్యం కోసం పోరాడే తాలిబన్లు చాలా ధనవంతులు. ఈ విషయం తెలుసా? మరి ఓ దేశాన్ని ఆక్రమించేశారంటే వారి వెనుక ఆ మాత్రం బలం, బలగం ఉండకుండా ఎలా ఉంటుంది? అసలు తాలిబన్ల దగ్గర ఎంత డబ్బుంది?


ఆగస్టు 15న అఫ్గానిస్థాన్ రాజధాని కాబుల్ ను హస్తగతం చేసుకుని ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు తాలిబన్లు. ఓ దేశ సైన్యాన్నే నిలువరించారంటే తాలిబన్ల నెట్ వర్క్ ఎంత బలమైనదో అర్థం చేసుకోవచ్చు. దేశ ప్రజలతో తాము శాంతినే కోరుకుంటున్నామని ఈ సందర్భంగా ఆ దేశ ఛానల్ అల్ జజీరాతో తాలిబన్ల ప్రతినిధి మహ్మద్ నయీమ్ అన్నారు.



తాలిబన్లు ఐసోలేషన్ లో రహస్యంగా ఉండాలని ఏం కోరుకోవడం లేదు. షెరియా చట్టం హక్కులకు లోబడి మేం మహిళలు, మైనార్టీలను గౌరవిస్తాం. ప్రపంచ దేశాలకు మాతో ఎలాంటి సమస్యలున్నా చర్చించడానికి మేం సిద్ధం.         -           మహ్మద్ నయీమ్, తాలిబన్ల ప్రతినిధి


తాలిబన్ల ఆస్తి ఎంత? వారి ప్రధాన ఆదాయ వనరు ఏంటి?


ప్రపంచంలో ఉన్న 10 రిచెస్ట్ ఉగ్రవాద సంస్థల జాబితాలో తాలిబన్లు ఐదో స్థానంలో ఉన్నట్లు 2016లో ఫోర్బ్స్ ప్రకటించింది. ఈ లిస్ట్ లో మొదటి స్థానంలో ఐసిస్ ఉంది. దీని మొత్తం ఆస్తుల విలువ ఏడాదికి 2 బిలియన్ డాలర్లు. 400 మిలియన్ల డాలర్లతో తాలిబన్లు ఐదో స్థానంలో నిలిచారు.


మాదక ద్రవ్యాల రవాణా, హవాలా, విరాళాలు ఇవే తాలిబన్ల ప్రధాన ఆదాయ వనరులని ఫోర్బ్స్ తెలిపింది. రేడియో ఫ్రీ యూరోప్ అనే సంస్థ సంపాదించిన నాటో రిపోర్ట్ ప్రకారం 2019-20 ఏడాదికి గాను వారి వార్షిక బడ్జెట్ 1.6 బిలియన్ డాలర్లట.



  • మైనింగ్: 464 మిలియన్ డాలర్లు

  • డ్రగ్స్: 416 మిలియన్ డాలర్లు

  • విదేశీ విరాళాలు: 240 మిలియన్ డాలర్లు

  • ఎగుమతులు: 240 మిలియన్ డాలర్లు

  • పన్నులు: 160 మిలియన్ డాలర్లు

  • రియల్ ఎస్టేట్: 80 మిలియన్ డాలర్లు


స్వయం సమృద్ధిగా ఎదిగి స్వంతంత్య్ర రాజకీయ, మిలిటరీ శక్తిగా ఎదగాలని తాలిబన్లు భావిస్తున్నారు.


ALSO READ:


Afghanistan Crisis: అఫ్గాన్ మహిళలు.. టీవీ చూడొద్దట..హై హీల్స్ వేసుకోవద్దట.. ఇవేమి 'తాలిబన్' రూల్స్ రా నాయనా

Published at: 16 Aug 2021 06:57 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.