Main opposition status in the assembly: మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి ఘన విజయంతో అక్కడ ఇతర పార్టీలకు ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కే అవకాశం లేకుండా పోయింది. మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. అందులో పది శాతం అంటే కనీసం29 అసెంబ్లీ సీట్లు తెచ్చుకున్న వారికి ప్రధాన ప్రతిపక్ష నేత హోదా వస్తుంది. బీజేపీ కూటమిలో ఉన్న బీజేపీ, శివసేన, ఎన్సీపీ పార్టీలు అన్నింటికి అంత కంటే ఎక్కువే వచ్చాయి కానీ ఓడిపోయిన కూటమిలోని కాంగ్రెస్, శ్రరద్ పవార్, ఉద్దవ్ ధాక్రే పార్టీలకు కనీసం ఇరవై సీట్లు కూడా రాలేదు.  


ఉద్దవ్ శివసేనకు అత్యధికంగా 20 సీట్లు 


ఉద్దవ్ శివసేన, శరద్ పవార్ ఎన్సీపీ,  కాంగ్రెస్ పార్టీ కలిసి పోటీ చేశాయి. ఉద్దవ్ శివసేన పార్టీ ఇరవై మంది ఎమ్మెల్యేలను గెల్చుకుంది. మిగతా రెండు పార్టీలు అంత కంటే తక్కువే గెల్చుకున్నాయి. మొత్తంగా మూడు పార్టీలు యాభై కంటే తక్కువ స్థానాలకే పరిమితమయ్యాయి. 
మూడు పార్టీలు కలిసి పోటీ చేశాయి కాబట్టి మూడు పార్టీలు కలిపి ఒకర్నే తమ నేతగా ఎన్నుకుంటే ప్రతిపక్ష నేత హోదాను స్పీకర్ కల్పిస్తారు.  కానీ అది సాధ్యమయ్యే అవకాశం లేదు. ఎ పార్టీకి ఆ పార్టీ పక్ష నేత ఉంటారు. మూడు పార్టీల్లో శివసేన పెద్దపార్టీగా ఉంది. ఉద్దవ్ శివసేన పక్ష నేతగా ఆదిత్యథాక్రే ఎన్నికయ్యారు. మిగిలిన రెండు పార్టీలకు అత్యంత సీనియర్లు ఉన్నారు.


Also Read: పాకిస్థాన్‌లో బంగ్లాదేశ్ తరహా అల్లర్లు - రెచ్చిపోతున్న ఇమ్రాన్ సపోర్టర్లు - అధ్యక్షుడు పారిపోవాల్సిందేనా ?


ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకపోయిన ప్రతిపక్షం కాస్త బలంగా ఉన్నట్లే 


కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో రెండు సార్లు పది శాతం ఓట్లు తెచ్చుకోకపోవడంతో ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదు. ఈ సారి దాదాపుగా వంద సీట్లు రావడంతో ప్రతిపక్షనేత హోదా ఇచ్చారు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పక్ష నేత హోదాలో ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తున్నారు. అంతకు ముందు రెండేళ్లు కాంగ్రెస్ పక్ష నేతలుగా మల్లిఖార్జున్ ఖర్గే, అధిర్ రంజన్ చౌదరి వంటి వారు వ్యవహరించారు. ఆ కోణంలోనే ఇప్పుడుడ మహారాష్ట్ర అసెంబ్లీలో ఏ పార్టీకి ఆ పార్టీ పక్ష నేతలు ఉంటారు కానీ ప్రధాన ప్రతిపక్ష నేత ఉండరు. 


Alos Read: అమెరికాలో భారత విద్యార్థులకు పార్ట్‌టైమ్ జాబ్స్ కష్టమే - బేబీ సిట్టర్స్‌గా మారిపోతున్నారు !


గుజరాత్‌లోనూ ప్రతిపక్ష నేత గుర్తింపు లేదు ! 
 
దేశంలో ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష పార్టీ లేని పెద్ద రాష్ట్రాలు మూడు ఉన్నాయి. అందులో  ఒకటి ఏపీ . ఏపీ అసెంబ్లీలో  తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వడం లేదని ఆయన అసెంబ్లీకి వెళ్లడం లేదు. ఆయన ఏకైక ప్రతిపక్ష పార్టీగా ఉన్నప్పటికీ అసెంబ్లీలో గుర్తింపునకు కావాల్సినంత మంది ఎమ్మెల్యేలు లేరు. దాంతో ఆయనకు అధికారికంగా హోదా లేదు.  గుజరాత్‌లోనూ ప్రధాన ప్రతిపక్ష పార్టీ లేదు. అక్కడ  18 మంది ఎమ్మెల్యేలు ఉంటే ప్రతిపక్ష హోదా వస్తుంది కానీ.. కాంగ్రెస్‌కు 13 మందే ఎమ్మెల్యేలు ఉన్నారు.  చిన్న రాష్ట్రాలు అయిన  మణిపూర్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌,  సిక్కిం,  నాగాలాండ్‌ రాష్ట్రాల్లో అధికార కూటమి కాకుండా మరో పార్టీ పదిశాతం సీట్లు దక్కించుకోలేకపోయింది. అక్కడా ప్రధాన ప్రతిపక్ష నేతలు లేరు.