Note Bandi SC Decision:


పెద్ద నోట్ల రద్దుకు వ్యతిరేకంగా 58 పిటిషన్లు దాఖలు కాగా...వీటిపై సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. 2016లో కేంద్రం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయానికి సంబంధించి RBI చట్టంలోని సెక్షన్లను కోట్ చేసింది. Section 26(2) ప్రకారం...కేంద్ర ప్రభుత్వానికి మొత్తం బ్యాంక్‌నోట్‌ సిరీస్‌లను రద్దు చేసే అధికారముందని తేల్చి చెప్పింది. మోడీ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్నిసమర్థించిన సుప్రీం కోర్టు...ఇందులో తప్పులు వెతకాల్సిన పని లేదని వెల్లడించింది. సాధారణంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు RBI సెంట్రల్ బోర్డ్‌తో సంప్రదింపులు జరపాలని...కేంద్రం దాదాపు ఆర్నెల్ల పాటు చర్చించాకే నిర్ణయం తీసుకుందని స్పష్టం చేసింది. పెద్ద నోట్ల రద్దుకు వ్యతిరేకంగా దాఖలైన 58 పిటిషన్లపై సుప్రీంకోర్టు ఈ తీర్పునిచ్చింది. దీనిపై కేంద్రం గతంలోనే ఘాటైన వ్యాఖ్యలు చేసింది. "ఈ విషయంలో సుప్రీం కోర్టు చేసేది కూడా ఏముంటుంది. ఇప్పటికే అంతా గడిచిపోయింది. గడియారాన్ని వెనక్కి తిప్పలేం కదా" అని వ్యాఖ్యానించింది. 






కొంత కాలంగా విచారణ..


ఈ పిటిషన్లపై జస్టిస్‌ ఎస్‌ఏ నజీర్‌ నేతృత్వంలోని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం కొంతకాలంగా విచారణ జరిపింది. అయితే నోట్ల రద్దు నిర్ణయంపై న్యాయ సమీక్ష అవసరం లేదని గత విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం వాదించింది. 
" కేవలం నల్లధనం కోణంలోనే కాకుండా, విస్తృత కోణంలో నాటి నిర్ణయాన్ని చూడాలి. ఏదైనా పనిలో ఒక వ్యక్తి విఫలమైనంత మాత్రాన.. ఆయన ఉద్దేశం లోపభూయిష్టమైనదని చెప్పడం సరికాదు.               "
- అటార్నీ జనరల్
అంతకుముందు ప్రభుత్వ విధానాలపై విచారణ చేయొచ్చా లేదా అనే అంశంపై తమకు అవగాహన ఉందని సుప్రీం పేర్కొంది.


" ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలపై న్యాయసమీక్ష విషయంలో ఉన్న లక్ష్మణ రేఖ గురించి మాకు అవగాహన ఉంది. అయితే నోట్ల రద్దు సమస్య 'అప్రస్తుతం'గా మారిందా లేదా అన్న అంశంపై తుది నిర్ణయానికి రావాల్సిన అవసరం ఉంది. 'నోట్ల రద్దు' నిర్ణయానికి ఎలా వచ్చారు, ఇందుకోసం ఎలాంటి కసరత్తు చేశారనే విషయాన్ని పరిశీలించాలి. న్యాయవాదుల వాదనలు వినాలి. - గతంలో సుప్రీం కోర్టు


కాంగ్రెస్ విమర్శలు
 
2016 నవంబర్ 8న తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయంపై కాంగ్రెస్ ఇప్పటికీ విమర్శలు చేస్తోంది. దీని వల్ల జీడీపీ క్షీణతతో పాటు, దేశంలోని అసంఘటిత ఆర్థిక వ్యవస్థ కుదేలైందని ఆరోపిస్తోంది.
 
" రూ.500, రూ.1,000 నోట్లను నిరుపయోగం చేశారు. డబ్బులు జమ చేసేందుకు దేశమంతా బ్యాంకుల ముందు నిలబడింది. కానీ, ఈ నిర్ణయం నల్లధనాన్ని రూపుమాపిందా? పేద ప్రజలకు నోట్ల రద్దుతో చేకూరిన లాభమేంటి? వీటికి సమాధానం.. లేదు. కానీ, ప్రజల సొమ్ముతో 50 మంది పెట్టుబడిదారుల రుణాలను మాఫీ చేశారనీ, ఫలితంగా నోట్ల రద్దుతో సంపన్నులే లాభపడ్డారు. నోట్ల రద్దు అనేది దేశంలో పేదలు, రైతులు, కార్మికులు, చిన్న దుకాణదారులపై దాడి చేసిందని, భారత అసంఘటిత ఆర్థిక వ్యవస్థను విచ్ఛిన్నం చేసింది.   


Also Read: Suryanagari Express Derail: రాజస్థాన్‌లో రైలు ప్రమాదం, అదుపు తప్పిన ఎక్స్‌ప్రెస్ - అంతా సేఫ్