ASuryanagari Express Derail:
11 కోచ్‌లపై ఎఫెక్ట్..
రాజస్థాన్‌లో సూర్యనగర్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. బంద్రా టర్మినస్ నుంచి జోధ్‌పూర్‌కు వెళ్తున్న సూర్యనగర్ ఎక్స్‌ప్రెస్ పాలి వద్ద అదుపు తప్పింది. 11 కోచ్‌లు ఉన్నట్టుండి విడిపోయినట్టు అధికారులు తెలిపారు. ఉదయం 3.27 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ప్రాణనష్టం ఏమీ జరగలేదు. రైల్లో ఉన్న ప్రయాణికులను గమ్యస్థానానికి చేర్చేందుకు మరో ట్రైన్‌ను ఏర్పాటు చేశారు. జోధ్‌పూర్ నుంచి వచ్చి ఆ రైల్లో ప్రయాణికులను తరలించారు. "మర్వార్ జంక్షన్ దాటిన కాసేపటికే ఒక్కసారిగా వైబ్రేషన్ సౌండ్ వినిపించింది. ఓ రెండు మూడు
నిముషాల తరవాత రైలు ఆగిపోయింది" అని ఓ ప్రయాణికుడు చెప్పాడు. కిందకు దిగి చూస్తే...దాదాపు 8 స్లీపర్ కోచ్‌లు పట్టాలు తప్పాయని వివరించాడు. పావుగంట ఇరవై నిముషాల్లోనే ఆంబులెన్స్‌లు వచ్చి అందరినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చారని వివరించారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం...మొత్తం 11 కోచ్‌లు స్వల్వంగా ధ్వంసమయ్యాయి. ఉన్నతాధికారులంతా ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి కారణాలేంటో ఆరా తీస్తున్నారు. కొందరి ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా బస్‌లు కూడా ఏర్పాటు చేశారు. జైపూర్‌లోని హెడ్‌క్వార్టర్స్ నుంచి మరి కొందరు అధికారులు పరిస్థితులను సమీక్షిస్తున్నారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా వెంటనే సంప్రదించాలని రైల్వే శాఖ హెల్ప్‌లైన్ నంబర్లనూ వెల్లడించింది.