Telugu CMs in Delhi:  తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ,  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు పలు కార్యక్రమాలలో పాల్గొనేందుకు ఒకే సారి ఢిల్లీ వెళ్లనున్నారు.  మంగళవారం మధ్యాహ్నం రేవంత్ ఢిల్లీ వెళతారు.  16, 17 తేదీల్లోనూ అక్కడే ఉంటారు.  సమాచారం.  15న సాయంత్రం ఢిల్లీలో జరిగే మాజీ ప్రధాని పీవీ నరసింహారావు సంస్మరణ సభలో సీఎం పాల్గొనే అవకాశం ఉంది.  ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.  తెలుగు రాష్ట్రాల సీఎంలు ఒకే వేదికను పంచుకునే అవకాశం ఉంది. 

ఢిల్లీకి చంద్రబాబు,  రేవంత్ 

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు రోజుల పర్యటన నిమిత్తం 15, 16 తేదీల్లో ఢిల్లీ వెళుతు న్నారు. ఈ పర్యటనలో భాగంగా  కేంద్రమంత్రులతో ఏపీకి సంబంధించిన అంశాలపై చర్చలు నిర్వహిస్తారు.  రాష్ట్రంలో చేపడుతున్న వివిధ ప్రాజెక్టులు, కేంద్ర గ్రాంట్లు, గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులకు సంబంధించిన అంశాలను ఆయా మంత్రిత్వ శాఖలతో సీఎం చర్చించనున్నారు. 15వ తేదీ ఉదయం అమరావతి నుంచి ఢిల్లీ వెళ్లనున్న చంద్రబాబు అదే రోజు మధ్యాహ్నం కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో భేటీ కానున్నారు. అదే రోజు కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌, నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకే సారస్వత్‌, ఢిల్లీ మెట్రో రైల్‌ ఎండీ డాక్టర్‌ వికాస్‌ కుమార్‌తో ముఖ్యమంత్రి సమావేశం అవుతారు. విశాఖ, విజయవాడ మెట్రోలపై చర్చిస్తారు.           

కేంద్రజలశక్తి మంత్రితో ఇరువురు సీఎంల సమావేశం

జల వివాదాలపై చర్చ కోసం కేంద్ర జలశక్తి మంత్రితో జరిగే సమావేశంలో పాల్గొననున్నారు.   ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి నేతృత్వంలో జరిగే సమావేశంలో రేవంత్ రెడ్డి,  చంద్రబాబు నాయుడు ఇద్దరూ తెలంగాణ ,  ఆంధ్రప్రదేశ్ మధ్య జల వివాదాలపై చర్చించే అవవకాశం ఉంది.  ఈ సమావేశానికి ఇద్దరు ముఖ్యమంత్రులను కేంద్రం ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది.  తెలంగాణ,  ఆంధ్రప్రదేశ్ మధ్య కృష్ణా ,  గోదావరి నదుల జలాల విభజనపై దీర్ఘకాలంగా వివాదం ఉంది. ఈ సమస్యను పరిష్కరించడానికి కేంద్ర జలశక్తి మంత్రితో జరిగే సమావేశం కీలకమైనది.   బనకచర్ల పైన వివాదం కొనసాగుతున్న సమయంలో.. ఇద్దరు సీఎంలు కలిసి సమస్య పరిష్కారం దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు.           

బనకచర్ల సమస్యకు పరిష్కారం అంత తేలిక కాదు !        

బనకచర్ల విషయం రాజకీయం కావడంతో సమస్యను రెండు రాష్ట్రాలకు ఆమోదయోగ్యంగా పరిష్కరించడం అంత తేలిక కాదన్న అభిప్రాయం ఉంది. అయితే ముఖ్యమంత్రులు ఈ అంశంపై కేంద్ర జలశక్తి మంత్రి సమక్షంలో చర్చిస్తే.. తాత్కాలికంగా అయినా ప్రస్తుత వివాదానికి ముగింపు లభించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.  బనకచర్ల అంశంపై ఏపీలోనూ ఇప్పుడిప్పుడే అది అంత లాభదాయకమైన ప్రాజెక్టు కాదన్న చర్చ జరుగుతోంది. ప్రజాభిప్రాయం మేరుకు  చంద్రబాబు ప్రస్తుతం పూర్తిగా పోలవరంపైనే దృష్టి పెట్టి ఆ తర్వాత..   బనకచర్ల అంశాన్ని  అందుకోవచ్చని.. ఇప్పటికి అంత దూకుడు చూపించకపోవచ్చని అంచనా వేస్తున్నారు.