How BJP won in Haryana : హర్యానాలో భారతీయ జనతా పార్టీ విజయం అసాధారణంగా కనిపిస్తోంది ఎందుకంటే కౌంటింగ్ ప్రారంభమైన తొలి గంటలో కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని ఆధిక్యం ఉంది. కానీ రౌండ్లు ముందుకు వెళ్లే కొద్దీ బీజేపీ పుంజుకుంది. గత ఎన్నికల్లో కూడా సాధ్యం కాని మెజార్టీ మార్క్ ను సాదించింది. ఓ రకంగా ఇది అసాధారణ విజయం ఎందుకంటే బీజేపీ విజయాన్ని ఒక్కరంటే ఒక్కరు కూడా అంచనా వేయలేదు. ప్రసిద్ధి చెందిన మీడియా సంస్థలన్నీ హర్యానాలో కాంగ్రెస్ గెలుపు ఖాయమని చెప్పాయి.
ఎగ్జిట్ పోల్స్‌లో కాంగ్రెస్ గెలుపు - ఎగ్జాట్ పోల్స్‌లో బీజేపీ గెలుపు
హర్యానాలో అన్ని ప్రసిద్ది చెందిన ఎగ్జిట్ పోల్స్ సంస్థల అంచనాల్లో కాంగ్రెస్ పార్టీ కనీసం యాభై స్థానాలను గెలుస్తుందని లెక్కలేశాయి.ఆ తర్వాత కొన్ని సంస్థలు 70 వరకూ తీసుకెళ్లాయి. కానీ ఎగ్జాట్ పోల్స్‌లో మాత్రం బీజేపీ దాదాపుగా యాభై సీట్లను సాధించిది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి నలబై సీట్లు మాత్రమే వచ్చాయి. ఈ సారి మాత్రం అంత కంటే భారీ విజయం సాధించారు. దీంతో ఎగ్జిట్ పోల్స్ మాత్రం తప్పుగా తేలాయి.
నాడు అయోధ్యలో నేడు కశ్మీర్‌లో మోదీనే పడగొట్టిన రాహుల్ గాంధీ
జేజేపీ బలహీనపడటమే బీజేపీకి ప్లస్
జన నాయక్ జనతా పార్టీ. 2019లో జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో జేజేపీ పార్టీ సంచలనం సృష్టించింది.దుష్యంత్ చౌతాలా ఇండియన్ నేషనల్ లోక్ దళ్ నుంచి విడిపోయి పెట్టుకున్న పార్టీ అది. ఓంప్రకాష్ చౌతాలా మనవడు అయిన దుష్యంత్ చౌతాలా నేతృత్వంలోని పార్టీ పది సీట్లు సాధించింది. 14 శాతం ఓట్లను సాధించింది. ఆ పార్టీ ఇప్పుడు పూర్తిగా బలహీనపడటంతోపాటు సీట్లు, ఓట్లను కూడా భారీగా కోల్పోయింది. ఈ ఓట్లు అన్నీ బీజేపీ కి ట్రాన్స్ ఫర్ అయ్యాయి. ఇది హర్యానా ఎన్నికల్లో గేమ్ ఛేంజర్ గా మారింది. అలాగే అభ్యర్థుల ఎంపిక విషయంలోనూ బీజేపీ హైకమాండ్ మొహమాటానికి పోలేదు. సాధారణంగా హర్యనాలో ప్రభావం చూపే ప్రాంతీయ పార్టీ ఇండియన్ నే,నల్ లోక్ దళ్ కూడా పరిమిత స్థానాలకే పరిమితమయింది. ఫలితంగా బీజేపీ అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుంది.
Also Read: పడిలేచిన కెరటంలా బీజేపీ- హర్యానాలో హ్యాట్రిక్ దిశగా కమలం - అనూహ్యంగా పడిపోయిన కాంగ్రెస్!
హర్యానాలో బీజేపీ గత పదేళ్లలోఅధకారంలో ఉంది. బోలెడంత అధికార వ్యతిరేకత ఉంది. కానీ దాన్ని క్యాష్ చేసుకవడంలో కాంగ్రెస్ పార్టీ విజయవంతమైంది. అధికారవ్యతిరేకత ఉన్నప్పటికీ ఇతరులకు ఓట్లు వేయడం వృధా అన్న భావనను కల్పించడంలో బీజేపీ విజయం సాధించింది. ఎలా చూసినా ఎలక్షనీరింగ్ చేయడంలో తమను మించిన పార్టీ లేదని బీజేపీ నిరూపించినట్లయింది. బీజేపీ విజయంలో.. ఆ పార్టీ వ్యూహాలదే కీలక పాత్ర. మరోసారి కాంగ్రెస్ వైఫల్యం స్పష్టంగా బయటపడింది.