North Korea - South Korea:


కాల్స్‌కి నో ఆన్సర్..


దక్షిణ, ఉత్తర కొరియాల మధ్య రోజురోజుకీ ఘర్షణలు పెరుగుతున్నాయి. ఉత్తర కొరియా పదేపదే మిజైల్ టెస్టింగ్‌ చేస్తూ కవ్విస్తోంది. రెండు దేశాల మధ్య యుద్ధం తప్పదంటూ ఇప్పటికే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఉత్తర కొరియా...దక్షిణ కొరియాను ఇంకా టెన్షన్ పెడుతోంది. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌తో మాట్లాడేందుకు ప్రయత్నిస్తోంది. ఫోన్ కాల్ ద్వారా సంప్రదించాలని చూస్తోంది. ఇటు నార్త్ కొరియా మాత్రం అక్కడి నుంచి ఏ కాల్‌ను కూడా రిసీవ్ చేసుకోవడం లేదు. మిలిటరీ కాన్‌ఫ్లిక్ట్‌పై చర్చించేందుకు ఎన్ని సార్లు డయల్ చేసినా ఒక్కసారి కూడా ఆన్సర్ చేయడం లేదని దక్షిణ కొరియా అధికారికంగా ప్రకటించింది. ఈ కారణంగా...ఆందోళనలు మరింత పెరిగాయి. కావాలనే ఉత్తర కొరియా ఇలా చేస్తోందా..? అన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. Yonhap న్యూస్ ఏజెన్సీ వెల్లడించిన వివరాల ప్రకారం...దక్షిణ కొరియా రెండు మూడు సార్లు కాల్ చేసినా...అటు నుంచి స్పందన రాలేదు. ఇదే విషయాన్ని సౌత్ కొరియా మంత్రి వెల్లడించారు. 


"నార్త్ కొరియా మా ఫోన్ కాల్స్‌ని రిసీవ్ చేయడం లేదు. ఓ సారి సాయంత్రం 5 గంటలకు కాల్ చేశాం. ఆ మరుసటి రోజు ఉదయం 9 గంటలకు మరోసారి కాల్ చేశాం. అయినా ఆన్సర్ లేదు. సాధారణంగా ఈ ఫోన్‌ కాల్స్‌తో దౌత్య సమస్యలు పరిష్కరించుకోవచ్చు. లాజిస్టిక్స్ పరమైన సమస్యలకూ పరిష్కారం దొరుకుతుంది. ఇదెప్పుడూ జరిగేదే. కానీ ఈ సారి మాత్రం కిమ్ కాల్ లిఫ్ట్ చేయం లేదు"


- సౌత్ కొరియా మంత్రి 


సాధారణంగా రోజుకు రెండు సార్లు కాల్ చేయడం ప్రోటోకాల్. కానీ నార్త్ కొరియా ఈ ప్రోటోకాల్‌ను పట్టించుకోవడం లేదు. తమ వైపు నుంచి ఎలాంటి తప్పు లేదని స్పష్టం చేస్తోంది దక్షిణ కొరియా. అయితే...కిమ్ ఫోన్ ఆన్సర్ చేయకపోవడానికి బలమైన కారణమే ఉంది. ఈ మధ్యే అమెరికా మిలిటరీతో కలిసి దక్షిణ కొరియా మిలిటరీ ఎక్సర్‌సైజ్‌లు చేసింది. దీనిపై ఉత్తర కొరియా ఆగ్రహం వ్యక్తం చేసింది. వెనువెంటనే మిజైల్‌ టెస్ట్‌లు నిర్వహించింది. 


ఇటీవలే ఉత్తర కొరియా మరో సంచలనానికి తెర తీసింది. ఉన్నట్టుండి బాలిస్టిక్ మిజైల్‌ను ప్రయోగించి అందరినీ ఆందోళనకు గురి చేసింది. ఇది "అమెరికాకు వార్నింగ్‌" అంటూ ప్రకటించింది. ఎదురు దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చూపించేందుకే ఈ సర్‌ప్రైజ్ ఇచ్చామని చెప్పింది. అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆదేశాల మేరకు అప్పటికప్పుడు ఈ డ్రిల్ నిర్వహించారు. ఇదే విషయాన్ని సౌత్ కొరియా ధ్రువీకరించింది. ఉత్తర కొరియాకు చెందిన మిజైల్ గగనతలంలో దాదాపు 66 నిముషాల పాటు చక్కర్లు కొట్టినట్టు జపాన్‌ కూడా వెల్లడించింది. అమెరికాను టార్గెట్ చేసుకునే ఈ ప్రయోగం చేసినట్టు వివరించింది. ఈ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసిన నార్త్ కొరియా...ఇది తమ దేశ యుద్ధ సామర్థ్యానికి నిదర్శనం అని తేల్చి చెప్పింది. ఎదురు దాడికి దిగాల్సిన అవసరం వస్తే అందుకు సిద్ధమేనని హెచ్చరించింది. 


Also Read: Kailash Vijayvargiya: అమ్మాయిలందరూ శూర్పణకల్లా తయారవుతున్నారు, మంచి దుస్తులు వేసుకోలేరా? - బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు