Kim Warns South Korea US: ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ మరోసారి అణు హెచ్చరికలు చేశారు. అణు యుద్ధానికి తాము సిద్ధంగా ఉన్నట్లు కిమ్ ప్రకటించారు. అమెరికాకు పరోక్ష హెచ్చరికలు చేశారు. కొరియా యుద్ధ వార్షికోత్సవంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఢీ అంటే ఢీ
అమెరికాతో సైనిక చర్యకు పూర్తి స్థాయిలో తాము సిద్ధంగా ఉన్నట్లు కిమ్ వెల్లడించారు. అవసరం అయితే అణ్వాయుధాలను రంగంలోకి దింపుతామని హెచ్చరించారు. ఉత్తర కొరియా ఏడవ సారి అణ్వాయుధాన్ని పరీక్షించనున్నట్లు వార్తల వస్తున్న వేళ కిమ్ ఈ వార్నింగ్ ఇచ్చారు. 2017లో చివరిసారి ఉత్తర కొరియా న్యూక్లియర్ టెస్ట్ నిర్వహించింది.
ఈ ఏడాది ఉత్తర కొరియా ఇప్పటికే అత్యధిక స్థాయిలో మిస్సైళ్లను పరీక్షించింది. ఆ దేశంలో ఈ ఏడాది ఇప్పటి వరకు 31 మిస్సైళ్లను పరీక్షించినట్లు అమెరికా ప్రతినిధి తెలిపారు.
Also Read: Rashtrapatni Row: పార్లమెంటులో స్మతి ఇరానీ X సోనియా గాంధీ- ముదిరిన వివాదం!
Also Read: Rashtrapatni Remark: నేను బెంగాలీ, నాకు హిందీ రాదు- క్షమాపణలు మీకు చెప్పను: అధీర్