Kim Jong Un:
మిలిటరీ డ్రిల్స్..
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ మిలిటరీకి సంచలన ఆదేశాలు ఇచ్చారు. యుద్ధానికి సిద్ధం కావాలంటూ పిలుపునిచ్చారు. ఇప్పటికే మిలిటరీ డ్రిల్ కొనసాగుతుండగా...ఇక నిజమైన వార్‌కు రెడీ అవ్వాలంటూ ఆదేశాలు జారీ చేశారు. తన కూతురితో పాటు ఈ డ్రిల్స్‌ను పరిశీలించిన కిమ్...వెంటనే ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే ఉత్తర కొరియా నుంచి ఓ బాలిస్టిక్ మిజైల్ లాంఛ్ అయినట్టు గుర్తించామని దక్షిణ కొరియా వెల్లడించింది. ప్రస్తుత పరిస్థితులను గమనిస్తున్నామని తెలిపింది. మరి కొన్ని మిజైల్స్‌నీ లాంఛ్ చేసే ప్రమాదముందని అంచనా వేస్తోంది. కూతురితో పాటు మిలిటరీ డ్రిల్స్ చూస్తున్న కిమ్ జాంగ్ ఫోటోలను విడుదల చేసింది Korean Central News Agency (KCNA). హ్వాసంగ్ యూనిట్ నుంచి ఒకేసారి ఆరు మిజైల్స్‌ను లాంఛ్ చేసినట్టు తెలిపింది. దాడులు చేసేందుకు వినియోగించే క్షిపణులను టెస్ట్ చేయడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. కొరియాలోని పశ్చిమ సముద్రాన్ని టార్గెట్‌గా చేసుకుని దాడులకు పాల్పడే అవకాశాలున్నట్టు సమాచారం.
కేవలం వార్నింగేనా..?
డ్రిల్స్ పూర్తైన వెంటనే కిమ్...సైన్యంతో కీలక సంప్రదింపులు జరిపారని కొరియన్ మీడియా స్పష్టం చేసింది. యుద్ధాన్ని కట్టడి చేసేందుకే కాదు, యుద్ధం చేసేందుకూ రెడీగా ఉండాలని మిలిటరీతో చెప్పారు. కీలకమై యూనిట్‌లలో డ్రిల్స్ చేయడానికి ఓ కారణముందన్న వాదన వినిపిస్తోంది. అమెరికా, దక్షిణ కొరియా సైన్యాలు కలిసి జాయింట్ మిలిటరీ విన్యాసాలు చేపడుతున్నాయి. ఈ రెండు దేశాలకూ వార్నింగ్ ఇచ్చేందుకు కిమ్ యుద్ధానికి రెడీ అవ్వాలన్న పిలుపునిచ్చి ఉంటారని కొన్ని మీడియా కథనాలు వెలువడుతున్నాయి. కొన్ని దశాబ్దాలుగా ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య దూరం, వైరం పెరుగుతూ వస్తున్నాయి. అయితే మరి కొందరు మాత్రం ఇదంతా కవ్వింపు చర్యలేనని, దక్షిణ కొరియాను అలెర్ట్ చేసేందుకు కిమ్ అలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటారని అంటున్నారు.
కూతురుని పరిచయం చేసిన కిమ్..
కిమ్ జోంగ్..తన జీవితాన్ని అత్యంత రహస్యంగా గడిపేస్తుంటారు. ఆయన కుటుంబ సభ్యుల గురించి కూడా ప్రపంచానికి తెలిసింది తక్కువే. కిమ్ జోంగ్ తరవాత ఎక్కువగా కనిపించేది...ఆమె చెల్లెలు మాత్రమే. అయితే...ఇటీవలే ఆయన కుటుంబంలోని ఓ ముఖ్యమైన వ్యక్తిని ప్రపంచానికి పరిచయం చేశాడు కిమ్. ఆయన కూతురు చేయి పట్టుకుని కిమ్ నడుస్తూ వస్తున్న ఫోటో వైరల్ అయింది. సౌత్ కొరియా న్యూస్ ఛానల్స్ అన్నీ ఈ ఫోటోని బాగా సర్క్యులేట్ చేశాయి. మిలిటరీ ఆయుధాలను తన కూతురుకి చూపించేందుకు కిమ్ ఇలా బయటకు తీసుకొచ్చారని ప్రచారం జరిగింది. అయితే...కిమ్ కూతురు పేరుని మాత్రం ఏ ఛానల్ వెల్లడించలేదు. దాన్ని మాత్రం రహస్యంగానే ఉంచేశారు. అక్కడి మీడియా చెబుతున్న సమాచారం ప్రకారం...కిమ్ తన కూతురుకి బాలిస్టిక్ మిసైల్ లాంచింగ్‌ను దగ్గరుండి మరీ చూపించారట.
Also Read: Xi Jinping: రికార్డు సృష్టించిన జిన్‌పింగ్, ముచ్చటగా మూడోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు