ఈ ఏడాది ఆర్థికశాస్త్రంలో నోబెల్​ బహుమతి డేవిడ్​ కార్డ్​, జాషువా డీ యాంగ్రిస్ట్, గైడో డబ్ల్యూ ఇంబెన్స్​ను వరించింది. అయితే ఇందులో సగం పురస్కారాన్ని డేవిడ్‌ కార్డ్‌కు ఇవ్వనుండగా మిగతా సగాన్ని జాషువా, గైడో పంచుకోనున్నారు. ఈ మేరకు రాయల్ స్వీడిష్ అకాడమీ ప్రకటించింది.










ఆర్థిక శాస్త్రానికి సంబంధించి విశ్లేషణాత్మకమైన పరిశోధనలపై సహకారం అందించినందుకు జాషువా, గైడోలకు పురస్కారం ఇస్తున్నట్లు అకాడమీ తెలిపింది. కార్మిక ఆర్థిక అంశాలకు సంబంధించి పరిశోధనాత్మక సహకారం అందించినందుకు గానూ డేవిడ్‌ కార్డ్‌కు నోబెల్ అందిస్తున్నట్లు వెల్లడించింది. 


ఈ ఏడాది విజేతలు వీరే..



  • వైద్య శాస్త్రంలో అమెరికన్‌ శాస్త్రవేత్తలు డేవిడ్‌ జూలియస్‌, ఆర్డెమ్‌ పటపౌటియన్‌లకు సంయుక్తంగా నోబెల్ ఈ పురస్కారం దక్కింది.

  • భౌతిక శాస్త్రంలో సుకురో మనాబే, క్లాస్ ​హాసిల్​మేన్​, జార్జియో పారిసీలు నోబెల్ బహుమతి దక్కించుకున్నారు.

  • రసాయన శాస్త్రంలో బెంజమిన్​ లిస్ట్​, డేవిడ్​ డబ్ల్యూసీ మెక్​మిలన్‌లకు నోబెల్ పురస్కారం దక్కింది.​

  • సాహిత్యంలో టాంజానియా నవలా రచయిత అబ్దుల్‌ రజాక్‌ గుర్నాను ఈ ఏడాది నోబెల్ వరించింది. శరణార్థుల వ్యథను కళ్లకు కట్టినందుకు గానూ రజాక్‌కు ఈ పురస్కారాన్ని అందిస్తున్నట్లు రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ వెల్లడించింది.

  • 2021 నోబెల్ శాంతి బహుమతి.. మరియా రెసా, దిమిత్రి మురాటోవ్‌లను వరించింది. 


Also Read: మంచు Vs మోనార్క్.. వీరి ప్యానళ్లలో ఎవరు గెలిచారు? ఎవరు ఓడారు?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి