Nitin Gadkari: లోక్‌సభ ఎన్నికల ఫలితాల తరవాత బీజేపీ సీనియర్ నేత నితిన్ గడ్కరీ సేద తీరుతున్నారు. కుటుంబంతో హాయిగా గడుపుతున్నారు. ఈ సరదా క్షణాల్ని అందరితో పంచుకున్నారు. సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేశారు. మనవలు, మనవరాళ్లతో ఆనందంగా గడిపారు. "ఊహించని ఆనందం" అని ఈ వీడియోకి క్యాప్షన్ ఇచ్చారు గడ్కరీ. 55 సెకన్ల ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. నితిన్ గడ్కరీ సతీమణి కాంచన్ గడ్కరీ మనవరాళ్లను వెంటబెట్టుకుని కార్‌లో వచ్చారు. ఇంటి ముందు దిగీ దిగగానే ఆ చిన్నారులు పరుగులు పెట్టుకుంటూ లోపలికి వెళ్లారు. తాతయ్యను గట్టిగా హత్తుకున్నారు. వాళ్ల రాకతో గడ్కరీ కూడా ఉప్పొంగిపోయారు. వెంటనే వాళ్లని దగ్గరకు తీసుకున్నారు. "మనవరాళ్ల రాకతో నా రోజు సంతోషంతో వెలిగిపోతోంది" అని వెల్లడించారు గడ్కరీ. 






మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి వరసగా మూడోసారి విజయం సాధించారు నితిన్ గడ్కరీ. కాంగ్రెస్ అభ్యర్థిపై లక్షా 37 వేల మెజార్టీతో గెలిచారు. తన విజయాన్ని ఇలా కుటుంబ సభ్యులతో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఆ తరవాత మీడియాతో మాట్లాడారు. తనను గెలిపించిన నాగ్‌పూర్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజల కోసమే కష్టపడతానని వెల్లడించారు. కాలుష్య రహిత నగరంగా నాగ్‌పూర్‌ని తీర్చి దిద్దుతానని హామీ ఇచ్చారు. యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలు కల్పిస్తానని స్పష్టం చేశారు. 






Also Read: Denmark: డెన్మార్క్ ప్రధానిపై ఆగంతకుడి దాడి, మోదీ తీవ్ర దిగ్భ్రాంతి - త్వరగా కోలుకోవాలని ట్వీట్