Nitin Gadkari Health: కేంద్ర రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అస్వస్థతకు గురయ్యారు. బంగాల్ సిలిగురిలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన గడ్కరీ.. వేదికపైనే అస్వస్థతకు లోనయ్యారు.
ఇదే కారణం
సిలిగురిలో దాగాపుర్ మైదానంలో ఓ కార్యక్రమానికి నితిన్ గడ్కరీ హాజరయ్యారు. వేదికపై ఉన్నప్పుడే గడ్కరీ షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురయ్యారు. గమనించిన సిబ్బంది వెంటనే ఆయన్ను స్టేజీ నుంచి కిందకు తీసుకువచ్చి చికిత్స అందించారు. గడ్కరీకి సెలైన్ ఎక్కించినట్లు సమాచారం.
గడ్కరీ విషయం తెలిసిన వెంటనే బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోలీసు కమిషనర్‌కు కీలక ఆదేశారు జారీ చేశారు. గడ్కరీని జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. దీంతో పోలీసులు వెంటనే ఆయన్ను సభా వేదిక నుంచి బయటకు తీసుకెళ్లారు. భాజపా నాయకుడు రాజు బిష్త్ నివాసానికి వెళ్లి గడ్కరీ విశ్రాంతి తీసుకున్నట్లు తెలిసింది.