NIA Announces Reward: 


దావూద్‌ ఆచూకీ తెలిపిన వారికి..


మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీం ఆచూకీ తెలిపిన వారికి రూ.25లక్షల క్యాష్ రివార్డ్ ఇస్తామని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) ప్రకటించింది. 1993లో ముంబయి బ్లాస్ట్‌ల్లో కీలక పాత్ర పోషించిన అండర్‌ వరల్డ్ డాన్ దావూద్‌ జాడ కోసం ఎన్నో రోజులుగా జల్లెడ వేస్తున్నారు. ఇప్పటికీ...అతనెక్కడ ఉంటాడన్నది మిస్టరీగానే ఉండిపోయింది. అందుకే...ఇలా క్యాష్ రివార్డ్ ప్రకటించింది. దావూద్‌కు అత్యంత సన్నిహితుడైన షకీల్ షేక్ అలియాస్ చోటా షకీల్‌ ఆచూకీ తెలిపిన వారికీ రూ.20 లక్షల రివార్డు ప్రకటించింది NIA.వీరిద్దరితో పాటు మరి కొందరు గ్యాంగ్‌స్టర్‌ల పైనా రివార్డ్ ప్రకటించారు. హజీ అనీస్ అలియాస్ అనీస్ ఇబ్రహీం షేక్, జావేద్ పటేల్ అలియాస్ జావేద్ చిక్నా, ఇబ్రహీం ముష్తక్ అబ్దుల్ రజాక్ మిమన్ అలియాస్ టైగర్ మిమన్‌ల జాడ తెలిపిన వారికీ రూ.15లక్షలు అందిస్తామని వెల్లడించారు. వీరందరూ 1993లో జరిగిన ముంబయి బ్లాస్ట్‌లో కీలక పాత్రధారులే. ఈ ఏడాది ఫిబ్రవరిలో "D-Company"పై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కేసు నమోదు చేసింది. దావూద్ ఇబ్రహీం కస్కర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐక్యరాజ్య సమితి గుర్తించింది. D-Company పేరుతో అంతర్జాతీయ టెర్రరిస్ట్ నెట్‌వర్క్‌ను నడుపుతున్నాడు. ఇందుకోసం దావూద్‌కు అనీస్ ఇబ్రహీం షేక్, చోటా షకీల్, జావేద్ చిక్నా, టైగర్ మిమన్‌ సహకరిస్తున్నారు. వీరందరి పేర్లూ NIA లిస్ట్‌లో ఉన్నాయి. 


ఆ ఉగ్రవాద సంస్థలతో లింక్‌లు..


"ఆయుధాల స్మగ్లింగ్, నార్కో టెర్రరిజం, అండర్‌వరల్డ్ క్రిమిలన్ సిండికేట్, మనీ లాండరింగ్, ఉగ్రవాదుల కోసం నిధుల సమీకరణ లాంటివన్నీ దావూద్ ఇబ్రహీం కనుసన్నల్లో జరుగుతున్నాయి. లష్కరే తోయిబా సంస్థతోనూ సంబంధాలున్నాయి. అదొక్కటే కాదు. జైష్ ఏ మహమ్మద్, అల్‌ఖైదాతోనూ రిలేషన్స్ ఉన్నాయి" అని NIA వెల్లడించింది. 


Also Read: KCR In Bihar : మాది మెయిన్ ఫ్రంట్ , బీజేపీ ముక్త భారత్‌ కోసం కలిసి పని చేస్తాం - పట్నాలో కేసీఆర్, నితీష్ ప్రకటన !