Huia Bird Feather: అరుదైన వస్తువులను వేలం పాట వేస్తే లక్షలు, కోట్లు కుమ్మరించి దక్కించుకున్న వాళ్లని చూశాం. యాంటిక్ పీస్‌లను అలా ఇంట్లో దాచుకోవాలని చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. కానీ...ఓ పక్షి ఈకని వేలం వేస్తే దాన్ని కూడా లక్షలు పోసి కొన్నారని మీకు తెలుసా? మనకి ఇది వేలం వెర్రి అనిపిస్తుండొచ్చు కానీ ఆ కొన్న వాళ్లకి మాత్రం ఇదే గొప్ప. న్యూజిలాండ్‌లో అంతరించిపోయిన huia bird ఈకని వేలానికి పెట్టారు. ఇది 46,521 న్యూజిలాండ్ డాలర్లకు (huia bird feather auction) అమ్ముడుపోయింది. అంటే మన కరెన్సీలో అక్షరాలా రూ.23 లక్షలు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఈకగా రికార్డు సృష్టించింది. Gold Broker వెల్లడించిన వివరాల ప్రకారం...ఈ ఈక బరువు 9 గ్రాములు. అక్కడి వాళ్లకి ఇది బంగారం కన్నా విలువైంది. ఈకకి ఎలాంటి డ్యామేజ్ కాకపోవడం వల్ల ఎక్కువ ధర పలికినట్టు ఆక్షన్ నిర్వాహకులు వెల్లడించారు. 


"ఇప్పటి వరకూ మేం నిర్వహించిన వేలంలో ఇదే చాలా అరుదైనది. ఈ ఈక రికార్డు స్థాయిలో అమ్ముడుపోయింది. అది మంచి కండీషన్‌లో ఉంది. చెక్కుచెదరకపోవడం వల్ల ఎక్కువ ధర పలికింది. ఎన్నేళ్లైనా సరే అది అలాగే ఉంటుందిఠ


- ఆక్షన్ నిర్వాహకులు


ఇదో రికార్డ్..


ఈకకి ఎలాంటి డ్యామేజ్ కాకుండా అత్యంత భద్రంగా యూవీ ప్రొటెక్టివ్ గ్లాస్‌లో ఓ పేపర్‌లో (huia bird feather) చుట్టి పెట్టారు. ఈ ఈక 100 ఏళ్ల కాలం నాటిదని వెల్లడించారు నిర్వాహకులు. ఇన్ని రోజులు ఓ వెండార్ అధీనంలో ఉన్న ఈకని వేరే వ్యక్తిని విక్రయించాలన్న ఉద్దేశంతోనే వేలం పెట్టినట్టు వివరించారు. Webb's Auction House వెల్లడించిన వివరాల ప్రకారం..అంతకు ముందు కూడా ఇలాంటి అరుదన పక్షి ఈకని వేలం పెట్టి విక్రయించారు. అయితే...దాని ధర కన్నా 450% ఎక్కువ ధరతో huia bird ఈక అమ్ముడుపోయింది. ఈ పక్షుల్ని న్యూజిలాండ్‌లో అత్యంత అరుదైన, విలువైనవిగా పరిగణిస్తారు. వాటి కూత కూడా చాలా గమ్మత్తుగా ఉంటుందట. పాట పాడినట్టుగా ఉంటుందని ఎక్స్‌పర్ట్స్‌ చెబుతున్నారు. 


విపరీతమైన వేట..


న్యూజిలాండ్‌లో చివరిసారి 1907లో కనిపించిందీ పక్షి. అయితే...1920ల వరకూ ఈ పక్షులు బతికే ఉన్నాయని చెబుతారు. ఆ తరవాతే అవి పూర్తిగా అంతరించిపోయాయి. అక్కడి లిటరేచర్‌లో కూడా హుయా బర్డ్‌ ప్రస్తావన ఉంటుంది. యురేపియన్స్‌ ఇక్కడికి వచ్చినప్పటికే ఈ పక్షి అంతరించిపోయే దశలో ఉంది. అయితే..ఈ పక్షుల ఈకలను చెఫ్‌లు ధరించే వాళ్లు. వాళ్ల కోసం హుయా బర్డ్‌లను వేటాడడం మొదలైంది. అలా అవి క్రమంగా అంతరించిపోయాయని చెబుతారు. నలుపు, తెలుపు రంగులు కలిసి ఉన్న ఈ ఈకలు చూడడానికి చాలా అందంగా ఉంటాయి. అందుకే అంతగా అందరూ వాటిపై ఆసక్తి చూపిస్తుంటారు. అంత అరుదైన ఈక ఇంట్లో ఉందంటే ఎవరికైనా గొప్పే కదా. అందుకే...ముందు వెనకా ఆలోచించకుండా ఓ వ్యక్తి అలా లక్షలు పోసి కొనుగోలు చేశాడు. 


Also Read: Tinkesh Kaushik: దివ్యాంగుడి సంకల్పానికి వంగి సలాం కొట్టిన ఎవరెస్ట్,బేస్‌ క్యాంప్‌ని అధిరోహించి ప్రపంచ రికార్డ్