Hyundai Casper Trademarked In India: ప్ర‌స్తుతం కార్ ల‌వర్స్.. బ‌డ్జెట్ లో స్పేషియస్‌గా వ‌చ్చే ఎస్ యూవీ మోడ‌ల్స్‌కు మొగ్గు చూపిస్తున్నారు. దాంట్లో భాగంగానే టాటా కంపెనీకి చెందిన టాటా పంచ్ లాంటి కార్లు ఎక్కువ‌గా ఆద‌ర‌ణ పొందిన విష‌యం తెలిసిందే. మార్కెట్‌లో ప్ర‌స్తుతం టాటా కార్ల‌కి మంచి క్రేజ్ ఉంది. ఈ నేప‌థ్యంలోనే దానికి చెక్ పెట్టేందుకు, క‌స్ట‌మ‌ర్ల‌ను త‌మ‌వైపు తిప్పుకునేందుకు హుందాయ్ స‌రికొత్త కారును భార‌త్ లో లాంచ్ చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. దాని కోసం ట్రేడ్ మార్క్ ను కూడా ఫైల్ చేసిందట హుందాయ్. 


హుందాయ్ కాస్పర్.. 


భార‌త్ రోడ్ల‌పైకి మ‌రో స‌రికొత్త ఎస్ యూవీ మోడ‌ల్ తెచ్చేందుకు ట్రై చేస్తుంద‌ట హుండాయ్. అదే హుందాయ్ కాస్పర్. ఇప్ప‌టికే ఆ ట్రేడ్ మార్క్ ని ఫైల్ చేసింద‌ట‌. అయితే, దానికి సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న మాత్రం ఇంకా రాలేదు. ప్ర‌స్తుతం ఈ కారు కొరియాలో సూప‌ర్ స‌క్సెస్ అయిన‌ట్లు తెలుస్తోంది. భ‌విష్య‌త్తులో ట్రేడ్ మార్క్‌కు సంబంధించిన స‌మ‌స్య‌లు రాకుండా చాలా కంపెనీలు ముందుగా పేర్లు న‌మోదు చేయించుకుంటాయ‌ని, దాంట్లో భాగంగా హుందాయ్ ఈ ట్రేడ్ మార్క్ న‌మోదు చేయించుకుని ఉంటుంద‌ని కూడా అంచ‌నా వేస్తున్నారు. 


శాంత్రోకి రీ ప్లేప్ మెంట్ గా.. 


హ్యుందాయ్ కాస్పర్ చాలా ప్ర‌త్యేక‌మైన బాడీతో వ‌స్తోంది. ఎస్ యూవీ స్టైలింగ్ తో ఉంటుంది. మంచి బాడీ, ఎస్ యూవీ స్టైలింగ్ రెండింటినీ కోరుకునే వాళ్ల‌నే టార్గెట్ గా ఈ కారును రిలీజ్ చేయ‌నుంది హుందాయ్. అంతేకాకుండా భారీ ట్రాఫిక్ జామ్ లో న‌డిపేందుకు, త‌క్కువ ప్లేస్ లో పార్క్ చేసేందుకు ఇది వీలైన‌దని ఆటో ఎక్స్ ప‌ర్ట్స్ చెప్తున్నారు. కాస్పర్ ను ప్ర‌స్తుతం సౌత్ కొరియాలో రిలీజ్ చేయ‌గా..  అక్క‌డ దాని పొడ‌వు.. 3,595 mm కాగా.. 1,595 mm వెడల్పు, 1,575 mm పొడవు ఉంది. వీల్ బేస్ 2,400 మి.మీ. ఉంది. శాంత్రోకి రీ ప్లేస్ మెంట్ గా హుందాయ్ దీన్ని మార్కెట్ లోకి రిలీజ్ చేయ‌నున్న‌ట్లు స‌మాచారం. శాంత్రోతో పోలిస్తే కాస్ప‌ర్ కొంచెం త‌క్కువ వెడ‌ల్పు. 


కాస్ప‌ర్ లో హైలైట్స్.. 


కాస్ప‌ర్ లో స‌ర్కుల‌ర్ హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. టాప్ మౌంటెడ్ ఎల్ ఈడీ డిఆర్ ఎల్స్, మెష్ గ్రిల్స్, బంప‌ర్ అన్ని అట్రాక్టీవ్ గా ఉన్నాయి. ఇక సైడ్ ప్రొఫైల్ విష‌యానికొస్తే.. వీల్ ఆర్క్స్ స్క్వేర్ గా ఉంటాయి. గ‌ట్టి బాడీ, స్పోర్టీ అలై వీల్స్ తో వ‌స్తోంది. డోర్ హ్యాండిల్స్ కూడా వెరైటీగా ఉన్నాయి. ఇక కాస్ప‌ర్ కి సింగిల్ పేన్ స‌న్ రూఫ్ కూడా ఉంది.  వెనుకవైపు లైటింగ్ సెటప్ ముందువైపులా ఉంటుంది.


కాస్ప‌ర్ లో ఇంటీరియర్ కూడా అద్భుతంగా ఉంది. ఇందులో టూ-స్పోక్ స్టీరింగ్ వీల్, డ్యాష్‌బోర్డ్ మౌంటెడ్ సెంటర్ కన్సోల్, గేర్ లివర్ ఉన్నాయి. పూర్తిగా డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ స్క్రీన్, ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉన్నాయి. అంతర్జాతీయ మోడల్ ADAS ఫీచర్లతో ఉంది. కానీ ఇండియాలో దీని కాస్ట్ వ‌ల్ల భారతీయ వెర్షన్ ఈ ఫీచర్లను పొందకపోవ‌చ్చ‌ని ఆటో ఎక్స్ ప‌ర్ట్స్ అంచ‌నా వేస్తున్నారు. 


సౌత్ కొరియాలో ఉన్న కారు ప్ర‌కారం.. కాస్పర్ 1.0-లీటర్ NA పెట్రోల్, 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌లను క‌లిగి ఉంది. పవర్ అవుట్‌పుట్ వరుసగా 85 bhp, 99 bhpగా ఉంది. ఇక ఇండియాలో అయితే.. కాస్పర్ NA పెట్రోల్ ఇంజిన్‌ను పొందుతుందని భావిస్తున్నారు. మాన్యువల్, AMT గేర్‌బాక్స్ రెండు అందుబాటులో ఉంటాయి. ఇక దీని ధ‌ర దాదాపు రూ.5 ల‌క్ష‌లు ఉండే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. టాటా టియాగో, మ‌రుతి ఆల్తో, వేగ‌నార్, టాటాపంచ్ లాంటి కార్ల‌కు టార్గెట్ దీన్ని రిలీజ్ చేస్తున్న‌ట్లు అంచ‌నా వేస్తున్నారు.


Also Read: కొత్త పల్సర్ విడుదల చేసిన బజాజ్ - లేటెస్ట్ ఫీచర్లు, రేటు ఎంతో తెలుసా?