Happy New Year 2023:
న్యూ ఇయర్‌కు కౌంట్ డౌన్ మొదలైంది. ఇప్పటికే అందరూ కొత్త ఏడాది మూడ్‌లోకి వెళ్లిపోయారు. సెలబ్రేషన్స్ మొదలు పెట్టారు. 2022కి గుడ్‌బై చెప్పి..2023కి వెల్‌కమ్ చెప్పేందుకు ఫుల్ జోష్‌తో ఎదురు చూస్తున్నాయి ప్రపంచ దేశాలు. ఈ ఏడాది మొట్టమొదటగా కొత్త సంవత్సరం జరుపుకునేది ఎక్కడో తెలుసా..? పసిఫిక్ ద్వీపమైన Tongaలో. పసిఫిక్ ద్వీప దేశాలైన Tonga, Samoa, Kiribati అన్ని దేశాల కన్నా ముందుగా కొత్త ఏడాదికి స్వాగతం చెప్పనున్నాయి. ఆ తరవాత న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, జపాన్, సౌత్ కొరియా 2022కి వీడ్కోలు చెబుతాయి.
ఇక అందరి కన్నా ఆలస్యంగా వేడుకలు చేసునేది...Howland, Baker Islands.సిడ్నీ, సింగపూర్, లండన్, దుబాయ్‌లలోని కీలక ప్రాంతాల్లో బాణసంచా పేల్చి కొత్త ఏడాదికి స్వాగతం పలకనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తైపోయాయి. నెటిజన్లు ఇప్పటికే కొత్త ఏడాది స్వింగ్‌లో ఉన్నారు. సోషల్ మీడియాలో Bye Bye 2022 అంటూ పోస్ట్‌లు పెడుతున్నారు. కొత్త ఏడాది వేడుకలకు సిద్ధమవుతున్నారు.