ముంబయి డ్రగ్స్ కేసు సాక్షుల్లో ఒకరుగా పేర్కొంటున్న కిరణ్ గోసవీ కీలక వ్యాఖ్యలు చేశారు. తనపై వస్తోన్న ఆరోపణలన్నీ అవాస్తవమని ఈరోజు రాత్రే ఎన్‌సీబీ అధికారుల ముందు సరెండర్ అవుతానని ఏఎన్‌ఐ వార్తా సంస్థకు వెల్లడించారు.
డ్రగ్స్ కేసులో మరో సాక్షిగా ఉన్న ప్రభాకర్ సెయిల్ అనే వ్యక్తి దర్యాప్తు సంస్థ ఎన్‌సీబీపై ఇటీవల సంచలన ఆరోపణలు చేశారు. ఈ కేసులో పరారీలో ఉన్న గోసవీ- దర్యాప్తు సంస్థ మధ్య రహస్య ఒప్పందం, ముడుపుల వ్యవహారం నడుస్తోందనే అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ కేసులో ఎన్‌సీబీ తనతో బ్లాంక్ పంచనామాపై బలవంతంగా సంతకం చేయించుకుందాని ఆరోపించాడు.
ముంబయి క్రూజ్ డ్రగ్స్ కేసులో మొత్తం తొమ్మిది మందిని ఎన్‌సీబీ సాక్షులుగా పేర్కొంది. వారిలో ప్రైవేట్ డిటెక్టివ్ గోసవీ కూడా ఒకరు. ఆయన బాడీగార్డుగా చెప్పుకుంటున్న ప్రభాకర్ సెయిల్‌ను కూడా ఎన్‌సీబీ విచారించింది.
ఇదీ కేసు..
ముంబయి కోర్డేలియా క్రూయీజ్ ఎంప్రెస్ షిప్‌లో జరిగిన రేవ్ పార్టీలో భారీ ఎత్తున డ్రగ్స్ రాకెట్ బయటపడింది. ఆ ప్రయాణికుల ఓడలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు శనివారం అర్ధరాత్రి దాడులు జరిపారు. ఈ రేవ్ పార్టీలో పెద్ద ఎత్తున డ్రగ్స్ చెలామణి అవుతుందని విశ్వసనీయ సమాచారం రావడంతో ఎన్సీబీ అధికారులు తనిఖీలు చేశారు. పార్టీలో మత్తు పదార్థాలను వినియోగిస్తున్నట్లు గుర్తించారు. అక్కడే ఎన్సీబీ అధికారులకు అధిక మొత్తంలో కొకైన్ సహా ఇతర మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. అందులోనే ఉన్న యువతీ యువకులను అదుపులోకి తీసుకున్నారు.
ఎన్సీబీ టీమ్ అదుపులోకి తీసుకున్న వారిలో బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కూడా ఉన్నాడు. ఆదివారం ఉదయం వారందరినీ ముంబయికి తీసుకొని వచ్చారు. అదుపులోకి తీసుకున్న వారిలో 8 నుంచి 10 మందిని విచారణ జరిపారు. ఆర్యన్ ఖాన్‌తో పాటు మరో ఇద్దరికి వైద్య పరీక్షలు కూడా జరిపించారు.
విచారణలో ఉన్న ఆర్యన్ ఖాన్‌కు త్వరగానే బెయిల్ లభిస్తుందని అంతా భావించారు. కానీ ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్‌ను పలుమార్లు కోర్టు కొట్టివేసింది.
Also Read: Mumbai News: ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో మరో ట్విస్ట్.. వాంఖడేపై విజిలెన్స్ విచారణ!
Also Read: UP Polls 2022: ఉత్తర్‌ప్రదేశ్ ప్రజలకు ప్రియాంక వాగ్దానం.. ఈసారి ఉచిత వైద్యంపై హామీ
Also Read: Study: కరోనా వ్యాక్సిన్ ఇతర వ్యాధుల మరణాల రేటును కూడా ప్రభావితం చేస్తుందా?
Also Read: Corona virus: కరోనా కారణంగా భారతీయుల ఆయుర్ధాయం తగ్గిపోయిందా? కొత్త అధ్యయనంలో కలవరపెట్టే నిజాలు