NBDA Condemns IT Raids:



NBDA ఫైర్..


ఢిల్లీ,ముంబయిల్లోని BBC కార్యాలయాలపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఇవి దాడులు కావని కేవలం "సర్వే" అని ఐటీ చెబుతున్నా...విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై News Broadcasters and Digital Association (NBDA)
కూడా స్పందించింది. అధికారికంగా ఓ ప్రకటన చేసింది. 


"ఏ సంస్థ అయినా సరే చట్టానికి లోబడే ఉండాలి. మీడియా గొంతు నొక్కాలని ప్రయత్నించడం ముమ్మాటికి తప్పే. జర్నలిస్ట్‌లు, మీడియా సంస్థల స్వేచ్ఛను హరించడం సరి కాదు. ఇలాంటి చర్యలు రాజ్యాంగం కల్పించిన భావప్రకటన స్వేచ్ఛ హక్కుని దెబ్బ తీస్తాయి. ఇవి ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం." 


-ఎన్‌బీడీఏ 


ఇలాంటి "సర్వేలు" చేపట్టడం అంటే మీడియాను వేధించడమే అని తేల్చి చెప్పింది NBDA. ప్రపంచంలోని అతి పెద్ద ప్రజాసామ్య దేశమైన భారత్‌ ప్రతిష్ఠకూ మచ్చతెచ్చి పెడుతుందని అసహనం వ్యక్తం చేసింది. 


"కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సర్వేలు చేపట్టినా అవి న్యాయ వ్యవస్థ పరిధిలోనే ఉండాలి. వాటిని అతిక్రమించకూడదు. ఈ విషయంలో కచ్చితత్వం అత్యవసరం" 


- ఎన్‌బీడీఏ 


ట్యాక్స్ సర్వే పేరిట బీబీసీపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. అయితే..అంతకు ముందు 2002 గుజరాత్ అల్లర్లకు సంబంధించిన BBC డాక్యుమెంటరీపై కేంద్రం నిషేధించడం దుమారం రేపింది. వాస్తవాలు దాచి పెట్టేందుకే ఇలా చేశారంటూ ప్రతిపక్షాలు మండి పడుతున్నాయి. ఈ వివాదం సుప్రీం కోర్టు వరకూ వెళ్లింది. ఈ పరిణామాల మధ్య BBC ఆఫీస్‌లపై ఐటీ దాడులు జరుగుతుండటం వల్ల కేంద్రం ఉద్దేశపూర్వకంగా ఈ సర్వేలు చేయిస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.


భారత్‌లో బీబీసీ ఛానల్ ప్రసారం కాకుండా బ్యాన్ చేయాలని వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టి వేసింది. హిందూ సేన ఈ పిటిషన్ వేయగా దీనిపై విచారణకు సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎమ్ఎమ్ సుంద్రేశ్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ పిటిషన్‌ను బుట్టదాఖలు చేసింది. సుప్రీంకోర్టు ఇలాంటి సెన్సార్‌షిప్‌ను చేయలేదని తేల్చి చెప్పింది. ఇదే 


"ఇది పూర్తిగా తప్పుదోవ పట్టించే పిటిషన్. అసలు ఇలా ఎలా వాదిస్తారు. పూర్తిగా ఆ ఛానల్‌పై సెన్సార్‌ విధించాలా? ఇదేం పిటిషన్"







‘India: The Modi Question’ పేరిట బీబీసీ చేసిన డాక్యుమెంటరీ కొంత కాలంగా వివాదాస్పదమవుతోంది. గుజరాత్ అల్లర్లతో పాటు ప్రధాని మోదీకి సంబంధించిన ఈ డాక్యుమెంటరీ తప్పుదోవ పట్టిస్తోందంటూ కేంద్రం బ్యాన్ విధించింది. సోషల్ మీడియాలోనూ ఎక్కడా ఈ వీడియో క్లిప్‌లు కనిపించకుండా సెన్సార్ విధించింది. ఈ క్రమంలోనే హిందూ సేన అసలు బీబీసీ ఛానల్‌నే సెన్సార్ చేయాలంటూ సుప్రీం కోర్టుని ఆశ్రయించింది. దీనిపై అసహనం వ్యక్తం చేసిన సుప్రీం కోర్టు చివరకు ఆ పిటిషన్‌ను తిరస్కరించింది. జాతి వ్యతిరేక ప్రచారాలు చేస్తున్నా రంటూ హిందూసేన తన పిటిషన్‌లో పేర్కొంది. కేవలం ప్రధాని చరిష్మాకు మచ్చ తెచ్చేందుకే ఈ కుట్ర చేస్తున్నారని ఆరోపించింది. భారత్‌కు స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచే BBC దేశానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తోందని పిటిషన్‌లో ప్రస్తావించింది హిందూ సేన. ఇప్పటికే కేంద్రహోం మంత్రిత్వ శాఖకు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని హిందూసేన తెలిపింది. 


Also Read: BBC Advice To Employees: ఐటీ అధికారులకు సహకరించండి, ఉద్యోగులకు BBC యాజమాన్యం మెయిల్స్