తెలంగాణలో పోలీసు ఉద్యోగాల భర్తీకి సంబంధించి తాజాగా అర్హత సాధించిన అభ్యర్థులకు ఫిబ్రవరి 15 నుంచి ఫిజికల్ ఈవెంట్లు నిర్వహించనున్నారు. ప్రాథమిక రాత పరీక్షల ఫలితాల్లో ఉత్తీర్ణులు కాలేకపోయినా న్యాయస్థానం ఉత్తర్వులతో పలువురు ఎస్సై, కానిస్టేబుల్ స్థాయి అభ్యర్థులకు ఫిబ్రవరి 15 నుంచి పీఈటీ, పీఎంటీ నిర్వహించనున్నారు. ఏకంగా 52 వేల మందికి పైగా అభ్యర్థులకు ఫిజికల్ ఈవెంట్లకు అర్హత సాధించారు. వీరంతా తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు మరోసారి సిద్ధమయ్యారు.


పోలీసు ప్రిలిమినరీ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు మొదట డిసెంబరు 8 నుంచి 31 వరకు ఫిజికల్ ఈవెంట్లు నిర్వహించారు. కనిష్ఠంగా 9 రోజులు, గరిష్ఠంగా 24 రోజులపాటు వీటిని నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్‌తో పాటు సిద్దిపేటలో ఇవి జరిగాయి. అప్పటికే ప్రాథమిక రాతపరీక్షలో అర్హత సాధించిన దాదాపు 2.07లక్షల మందికి అప్పట్లో ఈ శారీరక సామర్థ్య పరీక్షలు నిర్వహించారు. ఇప్పుడు మాత్రం కొన్ని కేంద్రాల్ని తగ్గించారు. రాచకొండ, ఖమ్మం, సంగారెడ్డి, నిజామాబాద్, సిద్దిపేట మినహా మిగిలిన 7 కేంద్రాల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు పరీక్ష కేంద్రాల్లో తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి(టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) ఏర్పాట్లు పూర్తి చేసింది.


అప్పుడు తొలగించారు - ఇప్పుడు కలిపారు..
టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ గతేడాది ఆగస్టులో 16,875 పోస్టుల కోసం నిర్వహించిన ప్రాథమిక రాతపరీక్షలకు సుమారు 8.5 లక్షల మంది హాజరయ్యారు. ఈ పరీక్షలో అర్హత సాధించాలంటే 60 మార్కులు రావాలని నిర్ణయించారు. కాగా ఈ పరీక్షలో 8 తప్పులు దొర్లాయి. వాటిని తొలగిస్తున్నట్లు ప్రకటించి అందుకు అనుగుణంగానే టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ ఫలితాల్ని విడుదల చేసింది. అప్పట్లో 2.07లక్షల మంది అర్హులుగా తేలడంతో వారికి శారీరక సామర్థ్య పరీక్షల్ని నిర్వహించి తుది రాతపరీక్షలకు ఎంపిక చేసింది. మార్చిలో ఆ పరీక్షలను జరిపేందుకు సన్నాహాలు చేస్తోంది. అయితే ప్రాథమిక రాతపరీక్షలో తప్పులుగా దొర్లిన ప్రశ్నలను తొలగించకుండా వాటికీ మార్కుల్ని కలపాలనే డిమాండ్ మొదలైంది. ఇదే విషయమై పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వాటిని విచారించిన న్యాయస్థానం మార్కుల్ని కలపాలంటూ తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో 8 మార్కుల్ని కలపడంతో తాజాగా 52 వేల మంది అదనంగా అర్హత సాధించారు.


అభ్యర్థులకు ముఖ్య సూచనలు.. 


➥ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి వారు జారీ చేసిన అనుమతి / సమాచార పత్రం (అడ్మిట్ కార్డ్) ఇంటిమేషన్ లేటర్ తమ వెంట తీసుకురావాలి. 


➥ అభ్యర్థి స్వీయ సంతకముతో కూడిన పార్టు 2 ధరఖాస్తు ఫారం, ప్రింట్, కలిగిన మాజీ సైనిక దృవీకరణ పత్రం( పి.పి.టి / డిస్ఛార్జ్ బుక్ ), నో అబ్జక్షన్ సర్టిఫికేట్ ( ఇంకా సర్వీసు నుండి డిస్చార్జ్ కానివారికి), తేది 12-06-2018 ప్రకారం ప్రభుత్వ ఉత్తర్వు నంబర్ 24, ట్రైబల్ వెల్ఫేర్ ( ఎల్.టి.ఆర్ -1) జారీచేసిన ఏజెన్సీ ఏరియా: సర్టిఫికేటును అభ్యర్థులు తమ వెంట తీసుకరావల్సి ఉంటుంది.


➥ పురుష అభ్యర్థులకు 1600 మీటర్ల వరుగు, మహిళలు 800 మీటర్ల పరుగు పందెం నిర్వహిస్తారు


➥ ఈ పరుగులో అర్హత సాధిస్తేనే ఎత్తు కొలతలు, లాంగ్ జంప్ పరీక్షలకు అభ్యర్థులు అర్హత సాధిస్తారు.


➥ అభ్యర్థులు నిర్ధేశించిన తేదీల్లో ఉదయం ఐదు గంటలోపు శారీరక మరియు దేహాదారుఢ్య పరీక్షలకు హజరాల్సి వుంటుంది. అభ్యర్థులు సమయానికి రానిచో అభ్యర్థిత్వం రద్దు అవుతుంది. అభ్యర్థులు


➥ ధరింపజేసిన రిస్ట్ బ్యాండును తొగించడంగాని, డ్యామేజ్ చేయడం చేస్తే వారిని అనర్హులుగా ప్రకటించడం.. జరుగుతుంది.


➥  అభ్యర్థులు పరీక్ష నిర్వహణ కేంద్రంలోకి ప్రవేశించిన అనంతరం అన్ని రకాల పరీక్షలు ముగిసిన తరువాతనే మైదానం నుండి బయటకు వెళ్ళేందుకు అనుమతినిస్తారు.


➥ అభ్యర్థులు మైదానంలో తమ సామన్లు భద్రపర్చుకోనేందుకుగాను ఎలాంటి క్లాక్రీములు అందుబాటులో ఉండవు. కావున అభ్యర్థులు తమ వెంట దుస్తులు, ఆహార పానీయాలు వంటి అత్యవసరమైనవి మినహాయించి ఎటువంటి విలువైన వస్తువులు, బంగారు అభరణాలు లేదా నిషేధిత వస్తువులు, మొబైల్ ఫోన్ లాంటి ఎటువంటి ఎలక్ట్రానిక్స్ పరికరాలు, వస్తువులను పరీక్షలు జరిగే మైదానంలోకి అనుమతించరు.


➥ ద్విచక్ర వాహనాల ద్వారా వచ్చే అభ్యర్థులు కాకతీయ విశ్వవిధ్యాలము మొదటి ద్వారం వద్ద పార్కింగ్ చేసుకోని కాలినడకన దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించబడే మైదానికి చేరుకోవాల్సి వుంటుంది. 


➥ బయోమెట్రిక్ వద్దతిలో అభ్యర్థుల పరిశీలన ఉన్నందున అభ్యర్థులు చేతి వేళ్లకు గోరింటాకు లేదా ఇతర రంగువేసుకొని రావద్దు.


➥ అభ్యర్థులు ప్రతి ఈవెంట్ వద్ద మరియు ధృవ పత్రాల పరిశీలన కేంద్రాల వద్ద ఓర్పుతో క్యూ పద్ధతిని పాటించాల్సి ఉంటుంది. పరీక్ష నిర్వహణలో ప్రతి అభ్యర్థి అధికారుల సూచనలను పాటిస్తూ ఆత్మ విశ్వాసంలో ఈ పరీక్షలో పాల్గొని విజయం సాధించాలని ఈ పరీక్షలకు హజరవుతున్న అభ్యర్థులకు పోలీస్ కమిషనర్ బెస్ట్ అఫ్ లక్ తెలిపారు.


Also Read:


తెలంగాణలోని కేంద్రీయ మైనార్టీ పాఠశాలల్లో 1308 టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టులు - అర్హతలివే?
కేంద్ర మైనార్టీ వ్యవహారాలశాఖ ఆధ్వర్యంలోని సీబీఎస్‌ఈ మైనార్టీ పాఠశాలల్లో ఖాళీల భర్తీకి 'మహర్షి వేదవ్యాస్ ఔట్‌సోర్సింగ్ టీచర్స్ రిక్రూట్‌‌మెంట్' నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా తెలంగాణలోని 109 పాఠశాలల్లో 1308  టీచింగ్, నాన్‌టీచింగ్ పోస్టులను భర్తీచేయనున్నారు. ఔట్‌సోర్సింగ్ విధానంలో ఈ ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభంకాగా.. ఫిబ్రవరి 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు దరఖాస్తు ఫీజుగా రూ.500 చెల్లించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


ఏపీలోని కేంద్రీయ మైనార్టీ పాఠశాలల్లో 1428 టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టులు - అర్హతలివే?
కేంద్ర మైనార్టీ వ్యవహారాలశాఖ ఆధ్వర్యంలోని సీబీఎస్‌ఈ మైనార్టీ పాఠశాలల్లో ఖాళీల భర్తీకి 'మహర్షి వేదవ్యాస్ ఔట్‌సోర్సింగ్ టీచర్స్ రిక్రూట్‌‌మెంట్' నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా ఏపీలోని 119 పాఠశాలల్లో 1428  టీచింగ్, నాన్‌టీచింగ్ పోస్టులను భర్తీచేయనున్నారు. ఔట్‌సోర్సింగ్ విధానంలో ఈ ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభంకాగా.. ఫిబ్రవరి 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు దరఖాస్తు ఫీజుగా రూ.500 చెల్లించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...