National Science Day 2023: భారత్ లో ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28వ తేదీన నేషనల్ సైన్స్ డే జరుపుకుంటాం. భారత శాస్త్రవేత్త సర్ సి.వి. రామన్.. తన రామన్ ఎఫెక్ట్ ను 1928 ఫిబ్రవరి 28వ తేదీన కనిపెట్టినందుకు గుర్తుగా 1987 నుండి ప్రతి సంవత్సరం జాతీయ సైన్స్ దినోత్సవం జరుపుకుంటున్నాం. రామన్ ఎఫెక్ట్ గా పిలిచే ఈ ఎఫెక్ట్ ను కనుగొన్నందుకు రామన్ కు 1930లో నోబెల్ బహుమతి కూడా దక్కింది. ఈ రోజున దేశవ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలు, ఇతర విద్యాసంస్థల్లో సైన్స్ డే (National Science Day) నిర్వహిస్తారు. సైన్స్ ఎగ్జిబిషన్లు, క్విజ్ పోటీలు, వ్యాస రచన పోటీలు, ఉపన్యాస పోటీలు, సైన్స్ పోటీలు నిర్వహిస్తారు.
నేషనల్ సైన్స్ డే 2023 థీమ్
గ్లోబల్ సైన్స్ ఫర్ గ్లోబల్ వెల్ బీయింగ్ అనేది ఈ ఏడాది నేషనల్ సైన్స్ డే 2023 థీమ్. దీనర్థం. అంతర్జాతీయంగా అభివృద్ధి చెందుతున్న సైన్స్ తో.. ప్రపంచ క్షేమం కోసం, మానవాళి కోసం, ప్రకృతి కోసం వాడాలని చెప్పడం
రామన్ ఎఫెక్ట్ అంటే ఏంటి?
ఆకాశం నీలి రంగులో ఎందుకుంటుంది, ఆకాశంలోని తారలు పగటి సమయంలో ఎందుకు కనిపించవు, సముద్రంలోని నీరు నీలి రంగులో ఎందుకు కనిపిస్తుంది లాంటి ప్రశ్నలకు రామన్ జవాబులు చెప్పారు. ఒక రంగు కాంతి కిరణం ద్రవంలోకి ప్రవేసించినప్పుడు ఆ ద్వారం ద్వారా వెదజల్లిన కాంతిలో కొంత భాగం వేరే రంగులో ఉంటుందని సి.వి. రామన్ కనుగొన్నారు. ఇలా విడిపోయిన కాంతి స్వభావం ప్రస్తుతమనున్న నమూనాపై ఆధారపడి ఉంటుందని చెప్పాడు. దీనినే రామన్ ఎఫెక్ట్ అంటారు.
సి.వి. రామన్ ఎవరు?
1888 ఏడాది నవంబర్ 7వ తేదీన తమిళనాడులోని తిరుచురాపల్లిలో చంద్రశేఖర్ అయ్యర్, పార్వతి అమ్మాళ్ దంపతులకు సి.వి. రామన్ జన్మించారు. డాక్టర్ సి.వి. రామన్ మద్రాసులోని ప్రెసిడెన్సీ కాలేజీ నుండి ఫిజిక్స్ లో బ్యాచిలర్ డిగ్రీతో పాటు మాస్టర్స్ పట్టా పొందారు. ఆ తర్వాత ప్రముఖ శాస్త్రవేత్తగా ఎదిగారు. ప్రభుత్వం కోసం పని చేయడంతో పాటు ఆయన అనేక సైన్స్ పోటీల్లో పాల్గొని విజయం సాధించారు. అలా భారత ప్రభుత్వం నుండి స్కాలర్ షిప్ పొందాడు. ఆధునిక భారత విజ్ఞాన శాస్త్రవేత్తల ప్రతిభను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. నోబెల్ బహుమతి అందుకున్న మొట్టమొదటి భారత శాస్త్రవేత్త సర్ సి.వి.రామన్
నేషనల్ సైన్స్ డే చరిత్ర గురించి..
ప్రఖ్యాత శాస్త్రవేత్త అయిన సి.వి. రామన్ సైన్స్ రంగంలో చేసిన సేవలను గుర్తించిన కేంద్ర సర్కారు.. 1986 ఏడాదిలో నేషనల్ కౌన్సిల్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ కమ్యూనికేషన్- NCSTC ఫిబ్రవరి 28వ తేదీన నేషనల్ సైన్స్ డేను ప్రకటించింది. భారత ప్రభుత్వం ఆమోదం పొందిన తర్వాత 1987 నుండి జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం. ఈ రోజు సైన్స్ పట్ల పిల్లల్లో ఆసక్తి కలిగేందుకు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తారు. సైన్స పోటీలు, ఎగ్జిబిషన్లు నిర్వహిస్తారు. ఈ రోజు సైన్స్ టూర్లు తీసుకెళ్తారు.