Birds Can't Fly:


ఎగరని పక్షులు..


పక్షులంటే రెక్కలుంటాయ్. స్వేచ్ఛగా ఎక్కడికంటే అక్కడికి ఎగిరిపోతాయ్. కానీ...రెక్కలున్నా ఎగరలేని పక్షులున్నాయి. ఇవి ఎగరలేకపోవడం వల్ల వాటిని వేటాడే జంతువులకు (Birds that can't fly) చాలా సులభంగా ఆహారం అయిపోతాయి. అందుకే క్రమంగా వీటి సంఖ్య తగ్గిపోతోంది. కొన్ని పెద్ద పక్షులు (National Birds Day 2024) మాత్రమే ఎగరకపోయినా భారీ పరిమాణంలో ఉండడం వల్ల కొంత వరకూ తప్పించుకోగలుగుతున్నాయి. ఉదాహరణకు పెంగ్విన్‌లు, ఆస్ట్రిచ్‌లు. అయితే..ఈ ఎగరలేని పక్షులన్నీ (flightless birds)  మారుమూల ప్రాంతాల్లోనే ఉంటాయి. అంటే జనావాసాలతో సంబంధం లేకుండా ఎక్కడో రిమోట్ ఏరియాల్లోనే (List of flightless birds) కనిపిస్తాయివి. 


ఎగరలేని పక్షుల లిస్ట్ ఇదే..


ఈ లిస్ట్‌లో ముందుగా చెప్పుకోవాల్సింది పెంగ్విన్స్ (Penguins) గురించే. పెంగ్విన్స్‌కి రెక్కలుంటాయ్ కానీ అవి ఎగరలేవు. కానీ ఈదడంలో మాత్రం ఎక్స్‌పర్ట్‌లు. నీళ్లలో దాదాపు అరగంట పాటు ఉండగలవు. 4-22 Mph వేగంతో ఈదుతాయి. ఇవి ఎగరలేకపోవడానికి ప్రధాన కారణం వాటి శరీర బరువు ఎక్కువగా ఉండడం. వీటి శరీరంలో కొవ్వు బాగా ఉంటుంది. రెక్కల బరువూ ఎక్కువే. అందుకే అవి చాలా మెల్లగా నడుస్తాయి. చిలుక జాతికి చెందిన kakapo కూడా ఎగరలేదు. న్యూజిలాండ్‌లో కనిపించే కకాపో చిలుక జాతిలోనే ఎక్కువ బరువున్న పక్షి. ఈ బరువు కారణంగానే అది ఎగరలేదు. అయితే...ఇవి చాలా వరకూ కనిపించడం లేదు. వీటిని మళ్లీ ఇకోసిస్టమ్‌లోకి తీసుకొచ్చేందుకు ప్రత్యేకంగా బ్రీడింగ్ ప్రోగ్రామ్‌ని చేపడుతున్నారు. గతేడాది నాటికి ప్రపంచవ్యాప్తంగా 252 కపాకో పక్షులున్నట్టు అంచనా. ఎగరలేని పక్షుల జాబితాలో Steamer Ducks కూడా ఉన్నాయి. ఇందులో మొత్తం నాలుగు జాతులున్నాయి. వీటిలో ఏ పక్షీ ఎగరలేదు. ఎగరలేకపోయినా సరే వీటిని వేటాడే జంతువులను మాత్రం తప్పించుకునే తెలివి ఉంటుంది. 


మరి కొన్ని పక్షులివే..


ఉష్ట్రపక్షి (Ostrich). ప్రపంచంలోనే ఎగరలేని అతి పెద్ద పక్షి ఇదే. దీని బరువు 290 పౌండ్‌లు. ఈ బరువుతో ఎగరడం సాధ్యం కాదు. వీటి కాళ్లు చాలా పొడవుగా ఉంటాయి. 43mphతో పరిగెత్తగలవు. పెరూ, బొలీవియాలో మాత్రమే కనిపించే పక్షి Grebes. Titicaca సరస్సుకి సమీపంలో ఉండడం వల్ల వీటికి Titicaca Grebe అనే పేరొచ్చింది. ఎగరలేకపోయినా చాలా వేగంగా ఈదుతాయి. చిన్న చిన్న చేపల్ని చాలా చాకచక్యంగా పట్టుకుని తినేస్తాయి. ఈ జాబితాలో Kiwi పక్షులూ ఉన్నాయి. న్యూజిలాండ్‌ జాతీయ పక్షి ఇదే. న్యూజిలాండ్ ప్రజల్ని కివీస్‌ అని అందుకే పిలుస్తారు. వీటిలో ఐదు రకాల జాతులున్నాయి. ఇవేవీ ఎగరలేవు. పిల్లులు వీటిని చాలా వేగంగా వేటాడి తినేస్తాయి. Cassowary పక్షులూ ఎగరలేవు. చూడడానికి చిన్న సైజ్‌ డైనోసార్‌లా కనిపిస్తాయి. ఆస్ట్రేలియా, న్యూ గెనియాలో ఎక్కువగా ఉంటాయి. ఆస్ట్రిచ్‌ తరవాత అంత బరువున్న పక్షి ఇదే. వీటితో పాటు Weka,Campbell Island Teal, Moorhen, Tasmanian Nativehen కూడా ఎగరలేని పక్షుల జాబితాలో ఉన్నాయి. ఈ లిస్ట్‌లో Greater Rhea, స్టీమర్ డక్, ఐలాండ్ రైల్ కూడా ఉన్నాయి. 


Also Read: National Birds Day 2024: పక్షులు లేకపోతే మన లైఫ్ అంత దారుణంగా ఉండేదా? తిండి కూడా దొరికేది కాదా?