Jio Financial into AMFI Largecap Segment: రిలయన్స్‌ గ్రూప్‌నకు చెందిన జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ స్టాక్‌ లార్జ్‌ క్యాప్స్‌ సెగ్మెంట్‌లోకి అడుగు పెట్టింది. అసోసియేషన్‌ ఆఫ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇన్‌ ఇండియా (AMFI) చేపట్టిన షేర్ల పునర్‌వర్గీకరణతో (Reclassification of shares) జియో ఫిన్‌కు లార్జ్‌ క్యాప్‌ కేటగిరీ దక్కింది. 


స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో ఇటీవలే లిస్ట్‌ అయిన మరో మూడు కంపెనీలు టాటా టెక్నాలజీస్‌ (Tata Technologies), జేఎస్‌డబ్ల్యూ ఇన్‌ఫ్రా ‍‌(JSW Infra), IREDA (Indian Renewable Energy Development Agency) మిడ్‌ క్యాప్‌ విభాగంలోకి వచ్చాయి. 


మరికొన్ని షేర్లకు మిడ్‌ క్యాప్‌ నుంచి లార్జ్‌ క్యాప్‌ ప్రమోషన్‌ లభించింది. అవి... PFC (Power Finance Corp), IRFC ‍‌(Indian Railway Finance Corp), రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ మాక్రోటెక్‌ డెవలపర్స్‌ (Macrotech Developers/ Lodha), ఎలక్ట్రికల్స్‌ బ్రాండ్ పాలీక్యాబ్‌ ఇండియా (Polycab India), REC (Rural Electrification Corporation), నాన్‌ బ్యాంకింగ్‌ కంపెనీ శ్రీరామ్‌ ఫైనాన్స్‌ (Shriram Finance), బ్యాంక్‌ స్టాక్స్‌ యూనియన్‌ బ్యాంక్‌ (Union Bank of India), ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌ (Indian Overseas Bank).


స్మాల్‌ క్యాప్‌ సెగ్మెంట్‌ నుంచి మిడ్‌ క్యాప్‌ సగ్మెంట్‌లోకి మరికొన్ని కంపెనీలు అప్‌గ్రేడ్‌ అయ్యాయి. అవి... మజగావ్‌ డాక్‌ (Majgaon Dock), సుజ్లాన్‌ ఎనర్జీ (Suzlan Energy), లాయిడ్స్‌ మెటల్స్‌ (Lloyds Metals), ఎస్‌జేవీఎన్‌ (SJVN), కల్యాణ్‌ జువెలర్స్‌ (Kalyan Jewellers), కేఈఐ ఇండస్ట్రీస్‌ (KEI Industries), క్రెడిట్‌ యాక్సెస్‌ గ్రామీణ్‌ (Credit Access Grameen), ఎక్సైడ్‌ ఇండస్ట్రీస్‌ (Exide Industries), నిప్పన్‌ లైఫ్‌ (Nippon Life), అజంతా ఫార్మా (Ajanta Pharma), నారాయణ హృదయాలయ (Narayana Hrudayalaya), గ్లెన్‌మార్క్‌ ఫార్మా (Glenmark Pharma).


షేర్లలో ఈ మార్పులు ఎందుకు?
మన దేశంతో పాటు వివిధ దేశాల మ్యూచువల్‌ ఫండ్స్‌, ఇతర ఇన్వెస్టర్లు మన ఈక్విటీల్లో పెట్టుబడులు పెడుతుంటారు. ప్రధానంగా, మ్యూచువల్‌ ఫండ్స్‌ పెట్టుబడులను దృష్టిలో పెట్టుకుని, ఏడాదికి రెండు సార్లు షేర్ల రీక్లాసిఫికేషన్‌ ఉంటుంది. దీనివల్ల, లార్జ్‌ క్యాప్‌ కేటగిరీలోని షేర్లు, మిడ్‌ క్యాప్‌ కేటగిరీలోని షేర్లు, స్మాల్‌ క్యాప్‌ కేటగిరీలో ఉన్న షేర్లు తెలుస్తాయి. ఈ కేటగిరీల ఆధారంగా మ్యూచువల్‌ ఫండ్‌ మేనేజర్లు ఇన్వెస్ట్‌మెంట్‌ డెసిషన్స్‌ తీసుకుంటారు. ఒక షేర్‌ కేటగిరీ మారితే, మ్యూచువల్‌ ఫండ్‌ దానిలో పెట్టే పెట్టుబడి కూడా మారుతుంది. ఉదాహరణకు.. ఒక కంపెనీ స్మాల్‌ క్యాప్స్‌ విభాగంలో ఉన్నప్పుడు స్మాల్‌ క్యాప్‌ ఫండ్స్‌ దానిలో ఇన్వెస్ట్‌ చేస్తుంది. ఆ స్టాక్‌ స్మాల్‌ క్యాప్‌ నుంచి మిడ్‌ క్యాప్‌కు మారితే, ఆ ఫండ్‌ మేనేజర్‌ ఆ షేర్‌ నుంచి పెట్టుబడి వెనక్కు తీసుకుని, వేరొక స్మాల్‌ క్యాప్‌ స్టాక్‌లోకి పంప్‌ చేస్తాడు. ఫండ్‌ మేనేజర్ల సౌలభ్యం కోసం షేర్ల వర్గీకరణ జరుగుతుంది.


2023 జూన్‌ కొలమానం ప్రకారం, లార్జ్‌ క్యాప్‌ విభాగంలో చేరేందుకు ఒక కంపెనీ మార్కెట్‌ విలువ కనీసం రూ.49,700 కోట్లు ఉండాలి. తాజాగా ఆ కనీస పరిమితిని రూ.67,000 కోట్లకు చేర్చారు. అలాగే మిడ్‌ క్యాప్‌ విభాగంలోకి చేరే పరిమితిని  రూ.17,400 కోట్ల నుంచి రూ.22,000 కోట్లకు పెంచారు. 


కొత్త మార్పులు, చేర్పులు 2024 ఫిబ్రవరి నుంచి అమల్లోకి వస్తాయి, జులై వరకు అమల్లో ఉంటాయి.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: మరింత తగ్గిన నగల రేట్లు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి