Telugu Desam Party MP Kesineni Nani: టీడీపీ(TDP) విజయవాడ ఎంపీ(Vijayawada MP) అభ్యర్థిగా తనను తప్పించారని సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చిన సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని(Kesineni Nani) నెక్ట్స్ స్టెప్‌ ఏంటన్న చర్చ మొదలైపోయింది. ఎప్పుడూ కేశినేని రాజకీయమే చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. పార్టీ ఏదైనా ఆయన రూటే సెపరేట్‌. అందుకే జిల్లా పార్టీలో ఆయన మిత్రుల కంటే ప్రత్యర్థులే ఎక్కువ ఉంటారు. 


ప్రజారాజ్యంలో సంచలనం


ప్రజారాజ్యంతో రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు కేశినేని నాని. అక్కడ మూడంటే మూడు నెలలు మాత్రమే ఉన్నారు. ప్రజారాజ్యం పార్టీలోనే మీటింగ్‌ పెట్టి అధినాయకత్వాన్ని తిట్టి పార్టీకి రాజీనామా చేశారు. తర్వాత 2009లో టీడీపీలో చేరారు. 2014, 2019లో విజయవాడ ఎంపీగా రెండుసార్లు టీడీపీ తరఫున విజయం సాధించారు. ఆయన ముక్కుసూటిగా మాట్లాడటంతోపాటు దూకుడు రాజకీయాలు ప్రత్యర్థులకు ఇబ్బందిగా మారుతుంటాయి. 


హ్యాట్రిక్‌ కొడతానన్న టైంలో షాక్


మూడోసారి ఎంపీగా పోటీకి సిద్ధమవుతున్న టైంలో టీడీపీ కేశినేని నానికి షాక్ ఇచ్చింది. ఆ స్థానంలో వేరే వ్యక్తికి చోటు ఇస్తామని మీరు జోక్యం చేసుకోవద్దని తేల్చి చెప్పేసింది. ప్రస్తుతానికి ఈ విషయంలో అధినేత ఆదేశాలను పాటిస్తానని సోషల్ మీడియాలో ప్రకటించిన నాని ఎంత వరకు సైలెంట్‌గా ఉండగలరు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. 


నోటికి ఫిల్టర్‌ లేక సమస్యలు


పార్టీ పదవిలో ఉన్నప్పుడే నాని నోటికి ఫిల్టర్ పడేది కాదు. ఇప్పుడు అసలు వచ్చే ఎన్నికల్లో మీరు అభ్యర్థివి కావంటే ఆయన ప్రవర్తన ఎలా ఉంటుందో చెప్పుకోవడం కష్టమే అంటున్నారు నాని సన్నిహితులు. తనకు ఎదురు చెప్పే వాళ్లను అక్కడికక్కడే ఇచ్చే పడేసే రకం నాని. ఒకానొక  సందర్భంలో ఢిల్లీలో చంద్రబాబు ఎదురుగానే తోటి ఎంపీపై దురుసుగా ప్రవర్తించారు. అప్పట్లో అదో సంచలనంగా మారింది. 


సోదరిడితో విభేదాలు 


సొంత సోదరుడు కేశినేని చిన్నిని పార్టీ నేతలు ప్రోత్సహిస్తున్నారని తరచూ వారిపై తీవ్ర విమర్శలు చేస్తూ వచ్చారు. ముఖ్యంగా బొండా ఉమ, దేవినేని ఉమను టార్గెట్ చేస్తూ ఆరోపణలు గుప్పించేవారు. పార్టీకి ఇబ్బంది అని తెలిసినా అధినాయకత్వం ఏమీ అనలేని స్థితిలో ఉండేది. 
ట్రావెల్స్ విషయంలో 2017 అప్పటి రవాణా శాఖ కమిషనర్‌ బాలసుబ్రమణ్యంపై దాడి కేసులో కూడా నానిదే ప్రధాన పాత్ర. ఈ విషయంలో అప్పటి సీఎం చంద్రాబబు నానితోపాటు విజయవాడ లీడర్లను పిలిచి క్లాస్ పీకారు. తర్వాత కమిషనర్‌ వద్దకు వెళ్లి సారీ చెప్పి వచ్చారు. తర్వాత తన దశాబ్ధాల చరిత్ర ఉన్న ట్రావెల్స్ బిజినెస్‌నెస్‌ క్లోజ్ చేస్తున్నట్టు సంచలన నిర్ణయం తీసుకున్నారు. 


బీజేపీలోకి వెళ్తారని టాక్


అప్పటి నుంచి నాని ప్రవర్తనలో మార్పు వచ్చిందని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. సమయం వచ్చినప్పుడుల్లా అధినాయకత్వంతోపాటు, స్థానిక లీడర్లపై చిందులు తొక్కుతుంటారు.  ఒకానొక సమయంలో ఆయన బీజేపీలోకి వెళ్తారనే ప్రచారం నడిచింది. అప్పటికే బీజేపీలోకి వెళ్లిన టీడీపీ ఎంపీలతోపాటు ఈయన కూడా వెళ్తున్నారని అంతా అనుకున్నారు. ఏమైందో కానీ మళ్లీ వెనక్కి తగ్గారు. 
తాజాగా రెండు రోజుల క్రితం తాను కానీ తన కుటుంబ సభ్యులు కానీ విజయవాడ పశ్చిమ నుంచి పోటీ చేయడం లేదని క్లారిటీ ఇచ్చారు. ఎంపీ స్థానాన్ని బీసీలకు ఇస్తే స్వాగతిస్తానని చెప్పిన ఆయన నీతిపరులకు మాత్రమే సపోర్ట్ చేస్తానన్నారు. లేకుంటే ఎవర్నీ గెలవనివ్వనంటూ మాట్లాడారు. 


వైసీపీతో చాలా క్లోజ్


టీడీపీ ఎంపీ అయినప్పటికీ నాని వైసీపీ లీడర్లకు చాలా క్లోజ్‌. తరచూ వారితో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనే వాళ్లు. తన నియోజకవర్గంలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటే తప్పు ఏంటని ప్రశ్నించే వాళ్లు. తనకు అందరూ మిత్రులేనని రాజకీయాలు వేరు అభివృద్ధి పనులు వేరు అంటూ వెల్లడించే వాళ్లు. 


బంపర్ ఆఫర్ వస్తే ఆగుతారా!


వైసీపీ వాళ్లతో క్లోజ్‌గా ఉండటంతో కేశినేని నాని ఎప్పటికైనా ఆ గూటికి చేరుతారని చాలా మంది అనుకునే వాళ్లు. వెంటనే మళ్లీ చంద్రబాబు కార్యక్రమాల్లో కానీ, టీడీపీ ప్రోగ్రామ్స్‌లో ప్రత్యక్షమై యాక్టివ్‌ రోల్‌ పోషించే వాళ్లు. ఇలా అందర్నీ ఆయన కన్ఫూజ్ చేస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు దీనికి పుల్‌స్టాప్ పడే టైం వచ్చిందని విశ్లేషకులు అంటున్నారు. కేశినేని నాని కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. 


విజయవాడ ఎంపీ అభ్యర్థిగా నానికి ఛాన్స్ ఇవ్వడం లేదని క్లారిటీ వచ్చేసింది. సోషల్ మీడియాలో ఆయన పెట్టిన పోస్టు కూడా చాలా వ్యంగ్యంగా ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు పక్క పార్టీల నుంచి బంపర్ ఆఫర్‌ ఏమైనా వస్తే ఆయన పరిశీలంచే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. మొత్తానికి విజయవాడ రాజకీయాల్లో భవిష్యత్‌లో ఊహించని ట్విస్టులు ఉండబోతున్నాయని ఈ పరిణామంతో అర్థమవుతుంది.  



విజయవాడ ఎంపీ అభ్యర్థిగా కేశినేని నాని ఔట్‌




    విజయవాడ ఎంపీ స్థానం నుంచి కేశినేని టీడీపీ తప్పించినట్టు సిట్టింగ్ ఎంపీ నాని తెలియజేశారు. తన స్థానంలో కొత్త వ్యక్తికి ఛాన్స్ ఇవ్వబోతున్నట్టు క్లారిటీ ఇచ్చారు.


 



షర్మిల కాంగ్రెస్ ఎంట్రీ వల్ల వైసీపీ, టీడీపీల్లో ఎవరికి లాభం ? ఎవరికి నష్టం ?




    వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ(YSRTP) అధినాయకురాలు వై.ఎస్‌.షర్మిల(YS Sharmila) ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నేతగా కొత్త భూమికను పోషించబోతున్నారు. పార్టీలో విలీనం తర్వాత ఎక్కడైనా పని చేస్తానని ప్రకటించారు.అది ఏపీ అయినా అండమాన్ అయినా సరే అని స్పష్టం చేశారు. ఆమె చేరిక కార్యక్రమానికి తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎవరూ రాకపోవడంతో ఆమె నీడ తెలంగాణ కాంగ్రెస్ పై పడేందుకు కూడా ఆసక్తి చూపించడం లేదని అర్థమవుతుంది.