Munavar Vs Raja Singh :   మునావర్ ఫారుఖీ స్టాండప్ కామెడీషోను రద్దు చేయకపోతే ప్రదర్శన జరిగే హాల్‌ను తగలబెడతామని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హెచ్చరించారు.  మునావర్ ఫారుఖీ షోకు పోలీసులు అనుమతి మంజూరు చేశారు. ఆగస్టు 20 శనివారం   హైటెక్ సిటీలోని శిల్పకళా వేదికలో మునావర్ ఫారూఖీ  స్టాండప్ కమెడియన్ షో జరగనుంది. షో కోసం ఇప్పటికే టికెట్ల బుకింగ్ అయిపోయింది.  అయితే మునావర్ ఫారుఖీ గతంలో హిందూ దేవుళ్లను అవమానించేలా స్టాండప్ కామెడీ చేశారని ఆయన షోను అంగీకరించే ప్రశ్నే లేదని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఇప్పటికే  మునావర్ ఫారూఖీ షోకు అనుమతి ఇవ్వొద్దని డీజీపీకి బీజేవైఎం ఫిర్యాదు చేసింది. 


మునావర్ షో ఇచ్చే హాల్‌ను తగలబెడతామన్న రాజాసింగ్ 


మునావర్ ఫరూఖీ షో జరిగే హాల్ ను తగలబెడతామని రాజాసింగ్ వార్నింగ్ ఇచ్చారు. మునావర్  హైద్రాబాద్ కు వస్తే కొట్టి పంపిస్తామంటూ ప్రకటించారు. అంతేకాదు మునావర్ కు ఎవరూ సహకరించినా తీవ్ర పరిణామాలు ఉంటాయని బీజేపీ ఎమ్మెల్యే హెచ్చరికలు జారీ చేశారు.  అయితే పోలీసులు మాత్రం ఇవేమీ పట్టించుకోలేదు. మునావర్  షోకు అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకున్నాకుయ  మునావర్ షోకు అనుమతి ఇవ్వడమే కాదు.. ఆ షోను అడ్డుకుంటామని హెచ్చరించిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ను పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. మునావర్ షో ముగిసేవరకు రాజాసింగ్ బయటికి రాకుండా పోలీసులు అతని ఇంటిదగ్గర పోలీసులను మోహరించారు.


తన అనుచరులు టిక్కెట్లు కొన్నారన్న రాజాసింగ్ !


అయితేమునావర్‌ ఫారుఖి షోను అడ్డుకుంటాం.. ఇప్పటికే మా కార్యకర్తలు ఆన్‌లైన్‌లో షో టికెట్లు తీసుకున్నారని రాజాసింగ్ చెబుతున్నారు.  వేదిక దగ్గరే మునావర్‌పై దాడి చేస్తామని హెచ్చరించారు. శాంతిభద్రతల సమస్య తలెత్తితే డీజీపీ, ప్రభుత్వం బాధ్యత వహించాలి, బీజేపీ నేతలు వద్దన్నా నేను షో అడ్డుకుని తీరుతాను.. ధర్మం కన్నా నాకు పార్టీ ముఖ్యం కాదని ఆయన చెబుతున్నారు. 


గతంలో బెంగళూరులో షో రద్దు చేయడంతో హైదరాబాద్‌కు ఆహ్వానించిన కేటీఆర్ 


గతంలో బెంగళూరులో మునావర్ ఫారుఖీ స్టాండర్ కామెడీ షో చేయాల్సింది. చివరి క్షణంలో అక్కడి ప్రభుత్వం అనుమతి రద్దు చేసింది. దాంతో  షో జరగలేదు. ఆ సమయంలో ఈ అంశంపై స్పందించిన తెలంగాణ మంత్రి కేటీఆర్.. మునావర్‌ను హైదరాబాద్‌లో షో చేసుకోవచ్చని ఆహ్వానించారు. తాము చివరి క్షణంలో అనుమతులు రద్దు చేయబోమన్నారు. స్టాండప్ కామెడీని కామెడీగానే చూస్తామని సీరియస్‌గా చూడబోమన్నారు. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఉండటంతో ఇలా స్పందించారు. .ఈ ఏడాది జనవరిలో మునావర్ ఫరూఖీ హైదరాబాద్ లో షో జరపాలని ప్లాన్ చేశారు. అయితే కొవిడ్ కారణంగా వాయిదా పడింది.  ఇప్పుడు మునావర్ షో ను ఏర్పాటు చేశారు. మాటకు తగ్గట్లుగానే బీజేపీ ఎమ్మెల్యే.. హిందూ సంస్థల నుంచి  వ్యతిరేకత వచ్చినా షోలకు అనుమతి ఇచ్చారు. 


సీతపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు


స్టాండప్ కమెడియన్ గా ఫేమస్ అయిన మునావర్ ఫరూఖీ.. డోంగ్రీ పేరుతో షోలు నిర్వహిస్తుంటారు. ఈ ఏడాది ఏక్తా కపూర్ నిర్వహించిన క్యాఫ్టివ్ రియాలిటీ షో లాక్ అప్ లో మునావర్ విజేతగా నిలిచారు.  అయితే తన షోలో హిందూ దేవతలను అవమానిస్తున్నారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. సీతాదేవిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ గతంలో తీవ్ర దుమారం రేగింది.