Mumbai Man Suicide: ముంబయిలోని అటల్ సేతు బ్రిడ్జ్ ఆత్మహత్యలకు అడ్డాగా మారుతోంది. గతంలో ఓ మహిళ ఈ వంతెనపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకోగా ఇప్పుడు మరో వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. 38 ఏళ్ల కరుటూరి శ్రీనివాస్ కార్‌లో బ్రిడ్జ్‌పైకి వచ్చాడు. ఓ చోట కార్ నిలిపాడు. వెంటనే దిగి బ్రిడ్జ్ రెయిలింగ్ ఎక్కాడు. అక్కడి నుంచి నీళ్లలో దూకాడు. ఈ సూసైడ్ విజువల్స్ అక్కడి సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. మధ్యాహ్నం 12.30 గంటలకు ఆత్మహత్యకు పాల్పడినట్టు అధికారులు వెల్లడించారు. బాధితుడు చాలా రోజులు ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్టు కుటంబ సభ్యులు చెప్పారు. ఆ ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గతేడాది కువైట్‌లో ఉన్నప్పుడూ ఇదే విధంగా ఆత్మహత్యకు యత్నించాడు. ఫ్లోర్ క్లీనర్‌ని తాగాడు. అప్పుడు ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఈ సారి నీళ్లలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
కుటుంబ సభ్యులు వెల్లడించిన వివరాల ప్రకారం ఆత్మహత్య చేసుకునే ముందు రోజు రాత్రి 11.30 గంటలకు శ్రీనివాస్ ఇంట్లో నుంచి బయటకు వచ్చాడు. మరుసటి రోజు 12.30 గంటలకు సూసైడ్ చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకునే ముందు భార్య, కూతురితో మాట్లాడాడు. సమాచారం అందుకున్న వెంటనే ముంబయి పోలీసులతో పాటు అటల్ సేతు రెస్క్యూ టీమ్, మత్య్సకారులు రంగంలోకి దిగారు. మృతదేహం కోసం గాలిస్తున్నారు.
Also Read: Viral Video: పాకిస్థానీపై విచక్షణా రహితంగా దాడి చేసిన పోలీస్, కింద పడేసి తలపై కాళ్లతో తన్ని - వీడియో