Morbi Bridge Collapse:
భాజపాపై కాంగ్రెస్ విమర్శలు..
గుజరాత్‌లో మోబ్రి బ్రిడ్జ్ కూలిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనమైంది. 130 మందికిపైగా మృతి చెందినట్టు అధికారులు చెబుతున్నారు. కనీసం 100 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే..ఈ ప్రమాదంపై గుజరాత్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు ఎక్కుపెట్టాయి. ఫిట్‌నెస్ సర్టిఫికేట్ లేని బ్రిడ్జ్‌పై అంత మందిని ఎలా అనుమతించారంటూ మండి పడుతున్నాయి. ముఖ్యంగా
కాంగ్రెస్... ఈ మాటల యుద్ధాన్ని కొనసాగిస్తోంది. కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ గుజరాత్ ప్రభుత్వంపై సీరియస్ అయ్యారు. "ఇది యాక్ట్ ఆఫ్ గాడ్ ఆ, లేదంటే యాక్ట్ ఆఫ్ ఫ్రాడ్ ఆ" అని ప్రశ్నించారు. 2016లో పశ్చిమ బెంగాల్‌లో వివేకానంద రోడ్ ఫ్లైఓవర్ కూలిపోయినప్పుడు మమతా ప్రభుత్వాన్ని ఉద్దేశించి ప్రధాని మోదీ ఇదే విధంగా వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడే కామెంట్స్‌ని మోదీపై రిపీట్ చేశారు దిగ్విజయ్ సింగ్.
అంతేకాదు. మరమ్మతులు చేసిన కాంట్రాక్టర్లపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
మరో కాంగ్రెస్ నేత రణ్‌దీప్ సుర్జేవాలా "Man Made Tragedy" అని విమర్శించారు. "ఫిట్‌నెస్ సర్టిఫికేట్ లేకుండా బ్రిడ్జ్‌ను ఓపెన్ చేయటం నేరం కాదా" అని ప్రశ్నించారు. "మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి రాకముందే కేవలం ఓట్ల కోసం హడావుడిగా ఈ వంతెనను తెరిచారు" అని మండి పడ్డారు. భాజపాకు, ఈ బ్రిడ్జ్‌ను రిపేర్ చేసిన కంపెనీకి సంబంధాలు ఉండి ఉంటాయని అనుమానం వ్యక్తం చేశారు. సీపీఐ ఎంపీ బినోయ్ విశ్వం కూడా దీనిపై స్పందించారు. ఇది పూర్తిగా భాజపా ప్రభుత్వ నిర్లక్ష్యం అని విమర్శించారు. ఐదు రోజుల క్రితమే రిపేర్ అయిన వంతెన
కూలిపోవటమేంటని ప్రశ్నించారు. ఇంత నిర్లక్ష్యంగా ఉండే ధైర్యం ఆ కాంట్రాక్టర్లకు ఎక్కడి నుంచి వచ్చిందని అన్నారు. అటు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే...ఈ ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యల్లోపాల్గొనాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
కారణమిదే..
ప్రమాదం జరిగిన సమయంలో బ్రిడ్జ్‌పై 500-700 మంది ఉన్నారని అంచనా. అసలు ఇంత మంది వంతెనపైకి వెళ్లటాన్ని మేనేజ్‌మెంట్ ఎలా అనుమతించింది అన్నదే ఇక్కడ కీలకంగా చర్చకు వస్తున్న అంశం. నిజానికి..ఆ బ్రిడ్జ్ ఒక్కోసారి పర్యాటకుల సంఖ్య అనూహ్యంగా పెరిగిపోతుంది. ఆదివారం కావటం వల్ల నిన్న ఎక్కువ మంది వచ్చారు. వందల మంది వంతెనపైకి ఎక్కారు. కెపాసిటీకి మించి పోవటం వల్ల ఉన్నట్టుండి అది కూలిపోయింది. వంతెనపై ఉన్న వాళ్లంతా నదిలో పడిపోయారు. కొందరిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చినా...కొందరు మాత్రం గల్లంతయ్యారు. కెపాసిటీ 100 మంది మాత్రమే. అంత మంది ఒకేసారి వెళ్లడం వల్లే వంతెన కుప్ప కూలి ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఈ బ్రిడ్జ్‌ను 1880లో నిర్మించారు. అప్పటి ముంబయి గవర్నర్ రిచర్డ్ టెంపుల్ దీన్ని ప్రారంభించారు. ఈ నిర్మాణానికి అప్పట్లోనే రూ.3.5 లక్షలు ఖర్చు చేశారు. ఇందుకు అవసరమైన సామగ్రి అంతా బ్రిటన్ నుంచి తెప్పించారు. నిర్మాణం పూర్తైనప్పటి
నుంచి ఇప్పుడీ ప్రమాదం జరిగినంత వరకూ ఎన్నో సార్లు ఈ వంతెనకు మరమ్మతులు చేశారు.
Also Read: KCR Speech: ఢిల్లీ బ్రోకర్లు చంచల్ గూడ జైల్లో ఉన్నరు, మనోళ్లు ఎడమకాలు చెప్పుతో కొట్టిన్రు - కేసీఆర్