Husband Hangs from Car Bonnet After Catching Wife with Boyfriend : ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో ఓ కారు బానెట్‌పై ఓ వ్యక్తి వేలాడుతూండగా.. కారు వేగంగా ముందుకు పోతున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి. ఎవరో యాక్సిడెంట్ చేసి పారిపోతున్నారని అనుకున్నారు. కాసేపటికి కారు బానెట్ పై నుంచి కిందపడిన వ్యక్తి నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేస్తే కానీ అసలు విషయం బయటకు రాలేదు. అక్కడ యాక్సిడెంట్ జరగలేదు. అంత కంటే ఘోరమైనది జరిగింది.        

యూపీలోని మొరాబాద్‌లో భార్యభర్తలు నివాసం ఉంటారు. ఇద్దరూ అన్యోన్యంగానే ఉంటారు. భార్య ఎప్పుడూ సోషల్ మీడియాలో మునిగి తేలుతున్న భర్త ఏమీ అనేవాడు కాదు. అలా మూడు రోజుల కిందట భర్త.. ఇంట్లో తలుపులు గట్టిగా వేసుకో అని చెప్పి అలా బయటకు వెళ్లాడు. కాసేపు అలా అలా తిరుగుతూంటే.. ఓ కారులో జంట కనిపించారు. వారు చేసుకుటున్న చిలిపి చేష్టలు చూసి లవర్స్ ఏమో అనుకున్నాడు. కానీ ఆమె ఎవరో ఎక్కడో చూసినట్లుగా ఉందని కళ్లు చికిలించి చూస్తే..తన భార్యలాగే కనిపించింది.         

Also Read: పుప్పాలగూడ జంట హత్యల కేసు - నిందితుల్ని పట్టించిన సెల్ ఫోన్ సిగ్నల్స్ - హత్యలకు కారణాలివే!

తన భార్య గురించి తప్పుగా అనుకోవడం ఎందుకని..తానే గట్టిగా తలుపులు వేసుకోమని చెప్పి వచ్చాను కదా అని సర్దుకుని..కన్ఫర్మ్ చేసుకుందామని తన భార్యకు ఫోన్ చేశాడు. ఆ ఫోన్ కారులోనే మోగింది. కారులో ఉన్న మహిళ ఫోన్ ఎత్తి..తన భర్తతో ఎప్పట్లాగే స్వీట్ గా మాట్లాడింది . ఇంట్లో ఉన్నానని చెప్పింది. దాంతో ఆ భర్త హతాశుడయ్యాడు. వెంటనే కారు దగ్గరకు వెళ్లాడు.సైడ్ విండోల్లోనుంచి ఏమీ కనిపించడం లేదని బానెట్ ఎక్కి.. ఫ్రంట్ మిర్రర్ నుంచి చూశాడు. అయితే దొరికిపోయామని ఆ భార్యామణికి అర్థం కావడంతో తప్పించుకుపోవాలని డిసైడయ్యారు. తర్వాత అక్కడ ఉన్నది తాను కాదని ఎలాగోలా కవర్ చేయవచ్చని అనుకుందేమో కానీ లవర్ ను ఒత్తిడి చేసింది. దాంతో అతను కార్ స్టార్ట్ చేసి ముందుకు తీసుకెళ్లిపోయాడు. ఆ భర్త బానెట్ పై అలా ఉండిపోయాడు.  

కొద్ది దూరం పోయిన తర్వాత ఆ భర్త కిందపడిపోయాడు. కారు ముందుకెళ్లింది. తన భార్య లవర్ తో వెళ్లిపోవడంతో భర్త వెళ్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తన భార్య లవర్ పేరు మిహిర్ అని గుర్తుంచాడు. పోలీసులు మిహిర్ ను అరెస్టు చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

Also Read: ఉదయం కర్ణాటకలో కాల్పులు- రాత్రికి హైదరాబాద్‌లో ఫైరింగ్‌- సినీ ఫక్కీలో చెలరేగిపోయిన బీదర్ గ్యాంగ్