Hyderabad Gun Firing News: ఒకే రోజు రెండు రాష్ట్రాల్లో రెండు ప్రాంతాల్లో కాల్పులు, ఒకచోట నగదు కోసం, రెండో చోట తప్పించుకునేందుకు. అచ్చం సినీ స్టైల్‌లో రెచ్చిపోయిన బీదర్ గ్యాంగ్‌ హైదరాబాద్ హడలెత్తించింది. అఫ్జల్‌గంజ్‌లో కాల్పులకు తెగబడిన గ్యాంగ్‌ ఒకే రోజు బీభత్సం సృష్టించింది. ఇద్దరి ప్రాణాలు తీసింది. మరో వ్యక్తిని ఆసుపత్రి పాల్చేసింది. ఇప్పుడు ఈ కేసు మూడు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయింది. ఖాకీలను పరుగులు పెట్టిస్తోంది. 

మధ్యాహ్నం బీదర్‌లో తుపాకీతో కలకలం రేపి ఇద్దర్ని హత్య చేసిన దొంగల ముఠా సాయంత్రానికి హైదరాబాద్ వచ్చేసింది. అక్కడి నుంచ వేరే ప్రాంతానికి చెక్కేసే ప్రయత్నాల్లో పోలీసుల కంటపడింది. తప్పించుకునేందుకు చేసిన ప్రయత్నంలోనే ఫైరింగ్ చేసి మరో వ్యక్తిని ఆసుపత్రి పాల్చేశారు. బీదర్ మూఠా చేసిన పనితో హైదరాబాద్ ఉలిక్కిపడింది. ఎప్పుడూ లేని విధంగా నగరం నడిబొడ్డున తుపాకీ కాల్పులు కలకలం రేపుతున్నాయి. 

అఫ్జల్‌గంజ్‌లో పోలీసులపైకి తుపాకీ గురిపెట్టిన ముఠాయే కర్ణాటకలోని బీదర్‌లో పట్టపగలే రెచ్చిపోయింది. శివాజీ చౌక్‌లోని ఓ ఏటీఎంలో డబ్బులు పెట్టేందుకు వచ్చిన వాహనంపై కాల్పులు జరిపింది. టూవీలర్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు తుపాకీతో ఏటీఎం డబ్బులు తీసుకొచ్చే సిబ్బందిని టార్గెట్ చేశారు. ఈ కాల్పుల్లో ఒకరు స్పాట్‌లోనే చనిపోయారు. మరో వ్యక్తి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. 

ఏటీఎంలో డబ్బులు పెట్టే సిబ్బందిపై కాల్పులు జరిగిన దుండగులు... అక్కడ దొరిగిన 93 లక్షల రూపాయలతో ఉడాయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారి కదలికలను సీసీటీవీ ఫుటేజ్ ద్వారా గుర్తించారు. వాళ్లిద్దరు హైదరాబాద్ వచ్చినట్టు తెలుసుకున్నారు. అనంతరం అఫ్జల్ గంజ‌్‌లో ఉన్నట్టు కూడా తేల్చారు.  

Also Read: సినీఫక్కీలో హైదరాబాద్‌ పోలీసుల సెర్చ్ ఆపరేషన్- బీదర్ గ్యాంగ్ కోసం విస్తృతంగా గాలింపు

బీదర్‌లో ఎంటీఎం డబ్బులు కాజేసి హైదరాబాద్‌లో తలదాచుకుంటున్న ముఠాను పట్టుకునేందుకు బీదర్ పోలీసులు చేసిన ప్రయత్నం విఫలమైంది పోలీసులను గమనించిన ముఠా సభ్యులు వారిపై కాల్పులు జరిపారు. సమీపంలో ఉన్న ట్రావెల్స్‌ ఆఫీస్‌లోకి దూరిపోయారు. అక్కడ మేనేజర్‌ను అడ్డం పెట్టుకొని తప్పించుకునే క్రమంలో అతనిపై కూడా కాల్పులు జరిపారు.  

ఉదయం బీదర్‌లో కాల్పులు జరిగిన వ్యక్తులు మధ్యాహ్నమే హైదరాబాద్‌ చేరుకున్నారు. వచ్చిన వెంటనే రాయ్‌పూర్ వెళ్లేందుకు మూడు టికెట్లు బుక్ చేసుకున్నారు. సాయంత్రం వరకు ఎక్కడో తలదాచుకొని బస్‌ టైం ప్రకారం సాయంత్ర 7 గంటలకు ట్రావెల్స్ ఆఫీస్‌కు వచ్చారు. మినీ బస్‌లో అంతా కూర్చున్నారు. ఇంతలో బ్యాగుల తనిఖీల టైంలో జరిగిన డిస్కషన్ కాల్పులకు దారి తీసింది. తీవ్రంగా గాయపడిన మేనేజర్‌ను ఆసుపత్రికి తరలించారు. 

కాల్పులు జరిగిన దుండగులు బ్యాగులతో పరారయ్యారు. వాళ్ల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. అణువణువు తనిఖీలు చేస్తున్నారు. అనుమాస్పదంగా ఉన్న వారిని విచారిస్తున్నారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. చెక్‌పోస్టులు కూడా ఏర్పాటు చేశారు. 

Also Read: హైదరాబాద్ నడిబొడ్డున బీదర్ దొంగల కాల్పులు - ఆఫ్జల్ గంజ్‌లో హైవోల్టేజ్ ఆపరేషన్