Monkey Menace At Taj Mahal: 


కోతుల బెడద


ఆగ్రాలో కోతుల బెడద తప్పేలా లేదు. ఇక్కడికి వచ్చే పర్యాటకులు కోతులతో సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఓ ఫారిన్ టూరిస్ట్‌కు ఇలాంటి అనుభవమే ఎదురైంది. స్పానిష్‌కు చెందిన మహిళా టూరిస్ట్‌పై కోతులు దాడి చేసి గాయపరిచాయి. తాజ్‌మహల్‌ ప్రాంగణంలో ఈ ఘటన జరిగింది. తాజ్‌మహల్‌ను ఫోటో తీస్తున్న సమయంలో ఆమెపై కోతులు దాడి చేశాయి. అంతకు ముందు ఇదే విధంగా ఇద్దరు విదేశీ 
పర్యాటకులు గాయపడ్డారు. 10 రోజుల్లోనే ఇలాంటి ఘటనలు బాగా పెరిగాయి. ఫలితంగా...అధికారులు అప్రమత్తమయ్యారు. తాజ్‌మహల్‌లో పని చేసే సిబ్బంది కర్రలు పట్టుకుని కోతులను తరమాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే...ఇలా చేసినా కోతులను నిలువరించటం వారి వల్ల కావటం లేదు. ఇలా పర్యాటకులపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. కొన్నిసార్లు ఈ దాడుల కారణంగా మృతి చెందిన వాళ్లూ ఉన్నారు. ముఖ్యంగా చిన్నారులకు ప్రాణాపాయం తప్పటం లేదు. 










తరచుగా దాడులు 


ఈ ఏడాది ఆగస్టులో ఇద్దరు టూరిస్ట్‌లపై కోతులు దాడి చేశాయి. దగ్గర్లోని ఓ వ్యాపారి దీన్ని వీడియో కూడా తీశాడు. సోషల్ మీడియాలో అప్పట్లో వైరల్ అయింది. కోతి ఓ మహిళను పొత్తి కడుపుపై కరిచింది. మరో వ్యక్తి కాలిని గాయపరిచింది. ఎలాంటి ఫిర్యాదు చేయకుండానే ఆ టూరిస్ట్‌లు అక్కడి నుంచి వెళ్లిపోయారు. స్థానికంగానే కాదు. అంతర్జాతీయ వార్తా పత్రికల్లోనూ తాజ్‌మహల్‌లో కోతుల బెడదపై ఆర్టికల్స్ పబ్లిష్ అయ్యాయి. "తాజ్‌మహల్‌ ఆవరణలో కోతులు గుంపులు గుంపులుగా వచ్చి టూరిస్ట్‌లపై దాడి చేస్తున్నాయి. వాటికి ఎక్కడా తిండి దొరక్క...ఇక్కడికి వచ్చే వాళ్ల నుంచి ఫుడ్ లాక్కుంటున్నాయి. తీవ్రంగా గాయపరుస్తున్నాయి. ఒక్కోసారి అవి చంపేస్తున్నాయి కూడా" అని న్యూయార్క్ టైమ్స్‌ ఓ సారి వార్త రాసింది. ఈ మధ్య కాలంలో కోతుల దాడితో ప్రాణాలు కోల్పోయిన వాళ్లెవరూ లేకపోయినా...సమస్య మాత్రం తీవ్రంగానే ఉంది. 2018లో తల్లి ఒడిలో ఉన్న 12 రోజుల చిన్నారిని కోతులు లాక్కుని వెళ్లి చంపాయి. అప్పట్లో ఈ ఘటన సంచలనమైంది. 


Also Read: Minister KTR : తల్లిదండ్రులను కోల్పోయిన ఆడబిడ్డకు అండగా మంత్రి కేటీఆర్, నాలుగు కంపెనీల్లో ఉద్యోగాలు సాధించిన యువతి!