Mohan Babu Issue: మనోజ్‌పై మొదటి నుంచి వివక్షే - మోహన్ బాబే తప్పే ఎక్కువ ?

Manhu Disputeఛ: మంచు మనోజ్‌పై మోహన్ బాబు ఎక్కువ వివక్ష చూపడం వల్లనే సమస్య వచ్చిందన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఆయన సినీ కెరీర్ గాడిన పెట్టకపోగా ఆస్తులు పంచి ఇచ్చేది లేదని అనడంతో గొడవలు ప్రారంభమయ్యాయి.

Continues below advertisement

Mohan Babu discrimination against Manchu Manoj is Main Problem:  మంచు మనోజ్ ను ఉద్దేశించి మోహన్ బాబు రిలీజ్ చేసిన ఆడియోను పరిశీలిస్తే..  అసలు తప్పు మోహన్ బాబు వైపే కనిపిస్తోందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. మంచు మనోజ్ ను గారాబంగా పెంచానని.. చదువు కోసం చాలా ఖర్చు పెట్టానని చెప్పుకొచ్చారు.ఆస్తులు ఇచ్చేది లేదని కూడా చెప్పేశారు. అయితే మనోజ్ కెరీర్ పరిశీలిస్తే..  మొదటి నుంచి విష్ణుకే మోహన్ బాబు ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. భారీ బడ్జెట్ సినిమాలు తీశారు. కానీ మనోజ్ ను నిలబెట్టేందుకు సో సో ప్రయత్నాలు చేశారని అనుకోవచ్చు. 

Continues below advertisement

మంచు విష్ణు ప్రారంభ సినిమాకే రూ. 30 కోట్ల బడ్జెట్

మంచు విష్ణును హీరోగా ఆరంగేట్రం చేయించేందుకు మోహన్ బాబు డబ్బులు ధారళంగా ఖర్చు పెట్టారు. విష్ణు పేరుతో తీసిన మొదటి సినిమాకు బడ్జెట్ 30 కోట్ల వరకూ పెట్టారని చెబుతారు. తర్వాత విష్ణు  హీరోగా ఎన్నో సినిమాలు తీశారు కానీ ఒక్క హిట్ కూడా లేదు. కానీ మనోజ్ విషయంలో మోహన్ బాబు అంత శ్రద్ద చూపించలేదు. ఓ రీమేక్ సినిమాతో ఆయన కెరీర్ ప్రారంభించారు. మధ్యలో తండ్రి పట్టించుకోక పోవడంతో సొంతంగా మిత్రులతో కొన్ని ప్రయోగాత్మక సినిమాలు తీశారు. నేను మీకు తెలుసా.. తో పాటు క్రిష్ తీసిన వేదం సినిమాలోనూ మంచి పాత్ర పోషించారు. అయితే గాడిన పడాల్సిన ఆయన కెరీర్ కుటుంబం నిర్లక్ష్యం కారణంగా వెనుకబడిపోయింది. ఈ కోపం ఆయనలో ఉందని చెబుతున్నారు. 

Also Read: భార్య మాటలు విని గుండెల మీద తన్నావు - నా ఆస్తి నా ఇష్టం - మనోజ్‌కు తేల్చి చెప్పిన మోహన్ బాబు

విష్ణుపైనే ఆసక్తి ..  తనపై నిర్లక్ష్యమని మనోజ్ భావన

మనోజ్ ఇటీవల వ్యక్తం చేసిన అభిప్రాయం ప్రకారం చూసినా .. విష్ణుపైనే కుటుంబ వనరులన్నీ ఖర్చు పెడుతున్నారు కానీ తనకు కనీస సహకారం ఇవ్వలేదన్న అసంతృప్తి ఆయనలో కనిపించింది. అందులో నిజం ఉండి ఉండవచ్చు. ఆస్తులు కూడా మోహన్ బాబు సమానంగా పంచి ఇవ్వలేదని ఆయన మాటల్ని బట్టి అర్థమవుతుంది. ఆస్తి తన స్వార్జితం అని తన ఇష్టం వచ్చినట్లుగా పంచుతానని చెప్పేశారు. దాంతో మనోజ్ తనపై వివక్ష చూపిస్తున్నారన్న అభిప్రాయానికి బలం వచ్చినట్లయింది. సంతానంలో ఆస్తుల విషయంలో  వివక్ష చూపిస్తే.. ఇలాంటి పరిస్థితులే వచ్చాయి. మోహన్ బాబు ఆ విషయాన్ని గుర్తించలేకపోయారు. 

Also Read:  ఎవరీ వినయ్ మహేశ్వరి? మోహన్ బాబు వర్సెస్ మనోజ్ గొడవలో కీలకంగా మారిన బయట వ్యక్తి ఎవరు?

వ్యక్తిగత జీవితంలోనూ మనోజ్ ను సపోర్టు చేయని మోహన్ బాబు

మనోజ్ మొదటి నుంచి భూమా మౌనికతో ప్రేమలో ఉన్నారు. కానీ మోహన్ బాబు  మనోజ్ పెళ్లి విషయంలో బలవంతంగా వేరే అమ్మాయితో ముడి పెట్టేశారని చెబుతారు. తర్వాత వారి మధ్య సరిపడలేదు. డైవోర్స్ అయిన తర్వాత భూమా మౌనికను పెళ్లి చేసుకునేందుకు మోహన్ బాబు అంగీకరించలేదు. మంచు లక్ష్మి పెద్దరికం తీసుకుని పెళ్లి చేయించారు. ఇలా వ్యక్తిగత జీవితంలోనూ సపోర్టు చేయలేదన్న అసంతృప్తి మనోజ్ లో ఉందని.. దీని కనిపెట్టి .. దానికి తగ్గట్లుగా వ్యవహరించడంలో మోహన్ బాబు విఫలమయ్యారని అందుకే కుటుంబం రోడ్డున పడిందన్న వాదన వినిపిస్తోంది. 

 

Continues below advertisement
Sponsored Links by Taboola