దేశీయంగా నడిచే విమానాల్లో పూర్తిస్థాయి సీటింగ్​కు విమానయాన మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చింది. కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకన్నట్లు తెలుస్తోంది. గతేడాది లాక్‌డౌన్ సమయంలో దేశీయ విమానాలపై పూర్తి నిషేధం విధించింది కేంద్రం.






లాక్‌డౌన్ అనంతరం 2020 మే 25న కొవిడ్ నిబంధనల మేరకు 33 శాతం సీటింగ్ సామర్థ్యంతో విమానాలు నడిపేందుకు అనుమతి ఇచ్చింది. క్రమంగా పెంచుకుంటూ సెప్టెంబర్​లో 85 శాతం సీటింగ్ సామర్థ్యంతో విమానాలను నడుపుకొనేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.


ఇప్పుడు కొవిడ్​ కేసులు తగ్గుతున్నందున సీటింగ్​ సామర్థ్యంపై పూర్తి ఆంక్షలు ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే కొవిడ్​ నిబంధనలు మాత్రం తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేసింది. అక్టోబర్ 18 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది.


ఐకాల్ ఎన్18 కాలింగ్ ట్యాబ్లెట్ కొనుగోలు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి


ఫ్యూజన్5 4జీ ట్యాబ్లెట్ కొనుగోలు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి