Gudivada Amarnath comments: దాడి వీరభద్రరావుకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అనేక అవకాశాలు ఇచ్చారని, ఆయనే వాటిని తిరస్కరించారని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పారు. మాజీ మంత్రి దాడి వీరభద్రరావు రాజీనామాకు సంబంధించి మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు మంత్రి అమర్నాథ్ సమాధానం చెబుతూ.. 2024 ఎన్నికలలో విజయం కోసం పనిచేసే వారు మాత్రమే పార్టీలో ఉండాలని, పార్టీలో ఉంటూ ఎవరు వెన్నుపోటు పొడవద్దని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పదేపదే చెబుతూ వస్తున్నారని అన్నారు. స్వార్థం కోసం పని చేసేవారు పార్టీలో ఉండనవసరం లేదని చెప్పారు. దాడి వీరభద్రరావు పోటీ చేయాలన్న తపనతో ఉన్నారని, ఈ విషయాన్ని తెలుసుకున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, ఆయనకు ఎమ్మెల్యే పదవి ఇవ్వకలేకపోయినా, భవిష్యత్తులో మంచి పదవులు ఇస్తామని చెప్పారని అన్నారు. అయినా ఆయన వాటిని పరిగణలోకి తీసుకోలేదని మంత్రి గుడివాడ్ అమర్నాథ్ చెప్పారు.
Gudivada Amarnath: దాడికి సీఎం ఎన్నో ఛాన్సులిచ్చారు, ఆయనే వదులుకున్నారు - మంత్రి గుడివాడ
ABP Desam
Updated at:
02 Jan 2024 08:29 PM (IST)
Dadi Veerabhadra Rao News: 2024 ఎన్నికలలో విజయం కోసం పనిచేసే వారు మాత్రమే పార్టీలో ఉండాలని, పార్టీలో ఉంటూ ఎవరు వెన్నుపోటు పొడవద్దని ముఖ్యమంత్రి చెబుతూ వస్తున్నారని
మంత్రి గుడివాడ గుర్తు చేశారు.
మీడియాతో మాట్లాడుతున్న గుడివాడ అమర్ నాథ్