Microsoft Layoffs: 


వెయ్యి మంది తొలగింపు..


మైక్రోసాఫ్ట్‌ కంపెనీ ఉద్యోగులకు మరోసారి షాక్ ఇచ్చింది. ఇప్పటికే విడతల వారీగా లేఆఫ్‌లు కొనసాగిస్తున్న సంస్థ...ఇప్పుడు మరో వెయ్యి మందిని తొలగించింది. గత వారం రోజుల్లో 1000 మందిని ఇంటికి పంపింది. గతేడాది పదివేల మందిని తొలగిస్తున్నట్టు సంచలన ప్రకటన చేసింది. ఈ సారి సేల్స్ అండ్ కస్టమర్ సర్వీసెస్ డిపార్ట్‌మెంట్‌లోని ఉద్యోగులను తొలగించింది. వీటితో పాటు ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ మేనేజర్‌లు, మార్కెటింగ్ డిపార్ట్‌మెంట్‌కి చెందిన ఉద్యోగులనూ తొలగించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మైక్రోసాఫ్ట్ కంపెనీ Digital Sales and Success గ్రూప్‌ని మూసేసింది. సేల్స్ అండ్ కస్టమర్ సర్వీస్ టీమ్‌ని కూడా తొలగించింది. కస్టమర్ సొల్యూషన్ మేనేజర్ రోల్‌నీ తీసేసింది. కొంత మంది ఉద్యోగులను కస్టమర్ సక్సెస్ అకౌంట్ మేనేజ్‌మెంట్ విభాగాని తరలించింది. కస్టమర్ సర్వీస్‌పైనే ఎక్కువగా దృష్టి పెట్టినట్టు సంస్థ వెల్లడించింది. అయితే...మేనేజర్ స్థాయి వ్యక్తులకు కూడా ఈ లేఆఫ్‌ల గురించి సరైన సమాచారం ఇవ్వడం లేదు కంపెనీ. ఫైర్ చేసిన రోజు మాత్రమే లేఆఫ్‌లు కొనసాగుతున్నాయని వాళ్లకు అర్థమవుతోంది. వర్క్‌ఫోర్స్ అడ్జస్ట్‌మెంట్‌లో భాగంగా ఉద్యోగులను తొలగించక తప్పడంలేదని గతంలో కంపెనీ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. 


"వర్క్‌ఫోర్స్‌ అడ్జస్ట్‌మెంట్‌లు చేసుకోక తప్పదు. బిజినెస్‌ని మేనేజ్ చేసుకోవాలంటే ఇలాంటి అవసరం కూడా. ఇకపైనా ఇది కొనసాగుతుంది. బిజినెస్‌ని పెంచుకోవాలంటే ఇలా వ్యూహాత్మకంగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. గ్రోత్ ఏ ఏరియాలో ఎక్కువగా ఉందో చూసుకుని దానిపై ఎక్కువ శ్రద్ధ పెడుతున్నాం"


- మైక్రోసాఫ్ట్ ప్రతినిధి 


అయితే...కంపెనీ ఇస్తున్న వివరణపై ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వాళ్ల వాదనలో నిజం ఉన్నప్పటికీ అసలు ఏ సమాచారం లేకుండా ఎలా లేఆఫ్‌లు చేస్తారని ప్రశ్నిస్తున్నారు. AI టూల్స్‌తో డిజిటల్ డిపార్ట్‌మెంట్‌ని నడిపిస్తారేమో అన్న ఆందోళన కూడా మొదలైంది. 


హైక్‌లూ కట్..


కంపెనీ నష్టాల్లో ఉండి జీతాలు పెంచకపోతే ఓకే. కానీ ప్రాఫిట్స్ వచ్చినా హైక్ ఇవ్వకపోతే...ఎంప్లాయీస్‌ ఊరుకుంటారా..? మైక్రోసాఫ్ట్‌ ఉద్యోగులు ఇప్పుడిదే అసహనంతో ఉన్నారు. గతేడాది కంపెనీ యాజమాన్యంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సీఈవో సత్య నాదెళ్లపైనా మండి పడుతున్నారు. ఇప్పటి వరకూ 10 వేల మంది ఉద్యోగులను తొలగించింది మైక్రోసాఫ్ట్. అది చాలదన్నట్టు హైక్‌లు కూడా ఆపేసింది. ఒడుదొడుకులు ఎదుర్కొన్నప్పటికీ ఆల్‌టైమ్ రెవెన్యూ సాధించింది. దీన్ని ప్రస్తావిస్తూ సీఈవో సత్య నాదెళ్ల ఇంటర్నల్ మెసెంజర్‌లో అందరికీ మెసేజ్ పంపారు. ఈ రికార్డు సాధించడానికి కారణం ఉద్యోగులే అంటూ పొగిడారు. అందరికీ థాంక్స్ చెప్పారు. వచ్చే ఏడాది కూడా ఇదే జోష్‌తో పని చేయాలని కోరారు. దాదాపు 2 లక్షల మందికి ఈ మెసేజ్ పంపారు. ఈ మెసేజ్‌కి కొంత మంది పాజిటివ్‌గానే రెస్పాండ్ అయినా...చాలా మంది నెగటివ్‌గా స్పందించారు. ఇంత గ్రాటిట్యూడ్ చూపిస్తున్నారు సరే...ఇంతకీ మాకు హైక్‌లు ఉన్నట్టా లేనట్టా..? అని ప్రశ్నిస్తున్నారు. అక్కడితో ఆగకుండా మేనేజర్‌లపైనా మండి పడ్డారు. శాలరీల విషయంలో మేనేజ్‌మెంట్‌తో మాట్లాడటంలో ఫెయిల్ అయ్యారని, వాళ్ల వల్లే తమకు జీతాలు పెరగలేదని ఫైర్ అవుతున్నారు. రికార్డు స్థాయిలో ప్రాఫిట్స్ వస్తుంటే...జీతాలు పెంచడానికి ప్రాబ్లమ్ ఏంటి..? అని వాదిస్తున్నారు. 


Also Read: AI-for-India 2.0: ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కోర్సును ప్రారంభించిన కేంద్రం, 9 బాషల్లో ఉచిత ఆన్‌లైన్ శిక్షణ!