జేఎన్‌టీయూ హైదరాబాద్‌ యూనివర్సిటీకి నేషనల్ అసెస్‌మెంట్ & అక్రిడిటేషన్ కౌన్సిల్ (న్యాక్) పెద్ద షాకిచ్చింది. యూనివర్సిటీ గ్రేడింగ్‌ను 'ఏ ప్లస్' గ్రేడ్ నుంచి 'ఏ' గ్రేడ్‌కు తగ్గించింది. జాతీయస్థాయిలో నిలిచేందుకు న్యాక్ గుర్తింపు, గ్రేడింగ్ కోసం ప్రయత్నించిన జేఎన్‌టీయూకు ప్రస్తుతం 'ఏ ప్లస్' గ్రేడ్ ఉండగా.. తాజాగా 'ఏ గ్రేడ్‌'తో సరిపెట్టారు. 


ఇతర యూనివర్సిటీలతో పోల్చితే నాణ్యమైన బోధన, ఉన్నతస్థాయి మౌలిక సదుపాయాలు ఉన్నప్పటికీ.. వర్సిటీకి తక్కువ గ్రేడ్ రావడంపై  జేఎన్‌టీయూ వీసీ కట్టా నరసింహారెడ్డి, రిజిస్ట్రార్ డాక్టర్ మంజూర్ హుస్సేన్ స్పందించారు. ఈ విషయమై ఉన్నతాధికారులతో జులై 20న చర్చించారు. 


న్యాక్ తీసుకున్న ఈ నిర్ణయ ప్రభావం 90 వేల మంది ఇంజినీరింగ్ విద్యార్థుల భవిష్యత్‌పై చూపనుందని, ఏ ప్లస్ ప్లస్ గ్రేడింగ్ కోసం తాము అప్పీలు చేయనున్నామని రిజిస్ట్రార్ తెలిపారు. వర్సిటీలోని ప్రముఖ విభాగాల విభజన, కొత్త విభాగాల ఏర్పాటు.. తదితరాలు న్యాక్ గుర్తింపుపై ప్రభావం చూపాయని కొందరు ఆచార్యులు అభిప్రాయపడ్డారు.


ALSO READ:


ఓయూ ఇంజినీరింగ్‌ కళాశాల అరుదైన ఘనత, ఏకంగా పదేళ్లపాటు అటానమస్‌ హోదా!
ఉస్మానియా యూనివర్సిటీలోని ఇంజినీరింగ్‌ కళాశాల మరోసారి యూజీసీ పది సంవత్సరాల పాటు స్వయంప్రతిపత్తి (అటానమస్‌) హోదాను సాధించింది. గతంలో రెండుసార్లు ఆరేళ్ల చొప్పున స్వయంప్రతిపత్తి ప్రకటించిన యూజీసీ ఈసారి ఏకంగా పదేళ్లపాటు అటానమస్‌ హోదాను దక్కించుకుని.. ఓయూ చరిత్రలోనే మరో మైలురాయిని అధిగమించింది. ఓయూకు న్యాక్‌ ఏ గుర్తింపు ఉండడం, ఇంజినీరింగ్‌ కళాశాలలోని అన్ని విభాగాలకు నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ అక్రిడిటేషన్‌ ఎన్‌బీఏ గుర్తింపు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకున్న యూజీసీ అధికారులు కళాశాలను సందర్శించకుండానే 2022-23 నుంచి 2031-32 వరకు స్వయంప్రతిపత్తిని ప్రకటించినట్లు ఓయూ అధికారులు తెలిపారు.


ఓయూ చరిత్రలోనే మరో మైలురాయిని అధిగమించింది. 1929లో స్థాపించిన ఈ కళాశాలకు గతంలో రెండు సార్లు ఆరేళ్ల చొప్పున అటానమస్‌ హోదా దక్కగా, తాజాగా మూడోసారి పదేళ్ల పాటు అటానమస్‌ గుర్తింపునిస్తూ యూజీసీ ఉత్తర్వులను జారీ చేసింది. ఈ హోదాతో కోర్సులు, సిలబస్‌ రూపకల్పన అంశాల్లో కళాశాలకు స్వేచ్ఛ ఉంటుందని, పరిశోధనా ప్రాజెక్టుల్లోనూ ప్రాధాన్యం ఉంటుందని ఓయూ ఇంజినీరింగ్‌ కళాశాల ప్రిన్సిపల్‌ ప్రొఫెసర్‌ శ్రీరాం వెంకటేశ్‌ అభిప్రాయపడ్డారు.


ఇంటర్‌ ప్రవేశాల దరఖాస్తు గడువు పొడిగింపు, ఇదే చివరి అవకాశం!
ఏపీలోని జూనియర్ కళాశాలల్లో మూడో విడత ప్రవేశాల గడువును అధికారులు పొడిగించారు. 2023-24 ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాల గడువు ఆగస్టు 17తో ముగియనుందని ఇంటర్‌ బోర్డు కార్యదర్శి సౌరబ్‌ గౌర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రవేశాలు పొందడానికి ఇదే చివరి విడత అని.. మరోసారి గడువు పొడిగింపు ఉండదని ఆయన స్పష్టం చేశారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జూనియర్ కాలేజీల్లో ఇంటర్మీడియట్ కోర్సుల్లో అడ్మిషన్లు కల్పిస్తున్న సంగతి తెలిసిందే. మే 15 నుంచి జూన్‌ 14 వరకు మొదటి విడత ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ జరిగింది. జూన్‌ 14తో మొదటి విడత ప్రవేశాలు, జులై 15 వరకు రెండో విడత ప్రవేశాలు జరిగాయి. ప్రస్తుతం చివరి విడత ప్రవేశాలు నిర్వహిస్తున్నారు. ఎలాంటి రాత పరీక్షలు నిర్వహించకుండా కేవలం పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా మాత్రమే ఇంటర్ కోర్సుల్లో అడ్మిషన్లు కల్పిస్తున్న సంగతి తెలిసిందే.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి.. 


Join Us on Telegram: https://t.me/abpdesamofficial