Samajavaragamana OTT Release : హీరో శ్రీవిష్ణు(Srivishnu) నటించిన 'సామజవరగమన' ఇటీవలే విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను కూడా రాబట్టింది. చిన్న సినిమాగా వచ్చినప్పటికీ.. హిట్ కొట్టి అందర్నీ ఆశ్చర్యపర్చింది. అయితే మొన్నటివరకూ థియేటర్లో అలరించిన ఈ సినిమా.. ఇప్పుడు ఓటీటీలోకి రాబోతోంది. కుటుంబ సమేతంగా చూసే ‘సామజవరగమన’ ఓటీటీ విడుదల తేదీని తాజాగా మూవీ టీం అధికారికంగా ప్రకటించింది.
ఆద్యంతం వినోదాత్మకంగా తెరకెక్కిన 'సామజవరగమన'.. ఓటీటీలో ఎప్పుడు విడుదల అవుతుందా అని చాలా మంది ఎదురు చూస్తున్న సినీ ప్రేమికులకు చిత్ర బృందం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రీమియర్ వేదికపై ప్రదర్శించేందుకు సిద్ధంగా ఉందని ప్రకటించింది. 'నవ్వడం ఒక భోగం.. నవ్వించడం ఒక యోగం.. సామజవరగమన దానికి చక్కటి రూపం. ఇక నో ఆలస్యం... ఈ నెల 28న ఆహాలో కలుద్దాం' అంటూ ఆహా ట్వీట్ చేసింది. అంతే కాకుండా జులై 28 నుంచి ఆహాలో 'సామజవరగమన' స్ట్రీమింగ్ కానుందని కూడా ఓటీటీ రిలీజ్ పై క్లారిటీ ఇచ్చింది.
చిన్న బడ్జెట్ గా రూపొందిన 'సామజవరగమన'లో శ్రీవిష్ణు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. జూన్ 29న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ.. టాలీవుడ్‍లో ఇటీవల వచ్చిన బెస్ట్ కామెడీ సినిమా ఇదేనంటూ ప్రేక్షకులతో పాటు పలువురు హీరోలు కూడా 'సామజవరగమన'ను ప్రశంసించారు. అంతే కాదు ఈ మూవీలో శ్రీవిష్ణుతో పాటు సీనియర్ నటుడు నరేష్ నటన, కామెడీ టైమింగ్ కూడా అందర్నీ బాగా ఆకట్టుకుంటుంది.
Read Also : Prabhas: కచ్చితంగా రామ్ చరణ్‌తో కలిసి సినిమా చేస్తా: ప్రభాస్
ఇదిలా ఉండగా 'సామజవరగమన' చిత్రానికి ‘వివాహ భోజనంబు ఫేమ్’ రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించగా.. ఈ మూవీలో శ్రీవిష్ణు సరసన మోనికా రెబ్బా జాన్ హీరోయిన్‍గా నటించింది. హీరోయిన్ తండ్రిగా నరేశ్ నటించగా.. ఈ ముగ్గురి మధ్య సాగే కామెడీ ఈ చిత్రంలో నవ్వులు పూయిస్తుంది. వీరితో పాటు ఈ సినిమాలో శ్రీకాంత్ అయ్యంగార్, వెన్నెల కిశోర్, రాజీవ్ కనకాల కీలక పాత్రలు పోషించారు. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి ఎక్కువ మార్కులు కొట్టేసిన ఈ సినిమా, ఓటీటీ వైపు నుంచి కూడా ఎక్కువ ఓట్లు కొల్లగొట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. 'సామజవరగమన' చిత్రానికి రాజేశ్ దండా నిర్మాతగా ఉండగా.. ఏకే ఎంటర్‌టైన్‍మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర సమర్పించారు. గోపీసుందర్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు.
Read Also : Sunny Leone: సన్నీ లియోన్ పేరు వెనుక అంత కథ ఉందా - ఆ పేరు తన తల్లికి ఎందుకు నచ్చలేదు?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial