Sunny Leone: సన్నీ లియోన్.. ఈ పేరు వినని వాళ్లు ఉండకపోవచ్చు. 2000 ల ప్రారంభంలో అడల్ట్ ఎంటర్టైన్మెంట్ పరిశ్రమలో స్టార్ గా గుర్తింపు తెచ్చుకుందీ బ్యూటీ. తర్వాత కొన్నాళ్లకు సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ యాక్టర్ గా మారిపోయింది. ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. అయితే సన్నీ లియోన్ అసలు పేరే బహుశా చాలా మందికి తెలియకపోవచ్చు. ఆమె అసలు పేరు కరెన్‌జిత్ కౌర్ వోహ్రా. తర్వాత స్టేజీ నేమ్ గా సన్నీ లియోన్ అని మార్చుకుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సన్నీ తన పేరు గురించి చెప్పుకొచ్చింది.


కరెన్‌జిత్ కౌర్ నుంచి సన్నీ లియోన్ గా..


సన్నీ లియోన్ కెనడాలో జన్మించింది. ఆమె అసలు పేరు కరెన్‌జిత్ కౌర్ వోహ్ర. అనుకోకుండా పోర్న్ స్టార్ గా మారిన సన్నీ 2011 లో బిగ్ బాస్ లో పాల్గొన్న తర్వాత విపరీతమైన ప్రజాదరణ పొందింది. అప్పటి నుంచి సన్నీ క్రేజ్ మరింత పెరిగింది. దీంతో ఆమెకు వరుస నినిమా అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం బాలీవుడ్ ఫేవరేట్ నటీమణుల్లో సన్నీ లియోన్ ఒకరిగా మారింది. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీ గా ఉందీ బోల్డ్ బ్యూటీ. ఇటీవల తన పేరు వెనక ఉన్న రహస్యాన్ని చెప్పుకొచ్చింది. ఆమె అమెరికాలో ఉన్నప్పుడు ఒక  మ్యాగజైన్ సంస్థ వారు తనను ఇంటర్వ్యూ చేశారని చెప్పింది. ఇంటర్వ్యూ తర్వాత వాళ్లు ‘‘మీ పేరు ఏమని వేయమంటారు’’ అని అడిగారని, అప్పుడు తనకు వెంటనే ఏమీ ఆలోచన రాలేదని అంది. అప్పుడు తాను వివిధ సంస్థల కోసం పనిచేస్తున్నానని, అప్పుడున్న పరిస్థితుల రీత్యా తన అసలు పేరును బయటపెట్టలేకపోయానని చెప్పింది. అందుకే తన మొదటి పేరుగా సన్నీ అని రాసుకోమని, చివరి పేరును మీకు ఇష్టం వచ్చింది పెట్టుకోమని చెప్పానని తెలిపింది. తర్వాత ఆ మ్యాగజైన్ వాళ్లు తన పేరును సన్నీ లియోన్ గా ప్రచురించారని పేర్కొంది. 


ఆ పేరు మా అమ్మకు నచ్చలేదు: సన్నీ లియోన్


అయితే సన్నీ లియోన్ పేరు తన తల్లికి నచ్చేది కాదని చెప్పింది సన్నీ. అందుకు గల కారణాలను కూడా చెప్పుకొచ్చింది. వాస్తవానికి సన్నీ అనేది తన సోదరుడి పేరు అని చెప్పింది. అతని పేరు సందీప్ సింగ్ అని, తాము ఇంట్లో అతన్ని సన్నీ అని ముద్దుగా పిలుస్తామని అంది. తన తమ్ముడి పేరునే తన స్టేజీ నేమ్ గా ఎంచుకోవడం పట్ల తన తల్లికి నచ్చేది కాదని చెప్పింది. ‘‘అన్ని పేర్లు ఉండగా నువ్వు ఈ పేరే పెట్టుకోవాలా’’ అని తన తల్లి ప్రశ్నించిందని కూడా చెప్పింది సన్నీ. కానీ అప్పుడది తన మనుసులోకి వచ్చిందని, తర్వాత ఆ ఇంటర్వ్యూ సంస్థ వాళ్లు మరో పేరును కలిపి సన్నీ లియోన్ అని వేశారని అంది. ఆ మ్యాగజైన్ స్టోరీ వేసినపుడు తన వయసు కేవలం 19 ఏళ్లు అని అప్పటి నుంచీ ఆ పేరును అలాగే ఉంచేశానని తన పేరు వెనక ఉన్న రహస్యాన్ని చెప్పింది సన్నీ.


Also Read: వివాదంలో ‘హిరణ్యకశ్యప’ మూవీ - రానాపై గుణశేఖర్ గరం గరం, ఆ శాపనార్థాలు ఆయనకేనా?


Join Us on Telegram: https://t.me/abpdesamofficial