MercedesAMG CLE 53 Latest News: మెర్సిడెస్ లాంటి కాస్ట్లీ కార్లు ఇండియన్ రోడ్లపై నడపడం కష్టం కాస్త కష్టమైన భావన ఉంది. ముఖ్యంగా రోడ్ల కారణంగా వాటి మెయింటనెన్స్ కొంచెం కఠినమైనదనే అభిప్రాయం ఉంది. అయితే తాజాగా లాంఛ్ అయిన మెర్సిడెస్ ఏఎంజీ సీఎల్ఈ ఈ భావనకు చెక్ పెట్టేవిధంగా డిజైన్ చేశారు. మెర్సిడెస్-ఏఎంజీ CLE 53 ఏఎంజీ భారత్‌లో ఓ స్పోర్ట్స్ కార్ అయినా, ఇది వినియోగదారులకు రోజువారీ వాడకానికి అనువుగా ఉండే విధంగా డిజైన్ చేయబడి ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. వర్షంలో పాడు పడ్డ రోడ్లు లేదా భారీ స్పీడ్ బ్రేకర్లు ఉన్నా కూడా, స్పోర్ట్స్ కార్లకు సాధారణంగా ఎదురయ్యే స్క్రాపింగ్ సమస్యలు ఇందులో కనిపించవని పేర్కొంటున్నారు.. గ్రౌండ్ క్లియరెన్స్ సమస్యను అధిగమించడంతోపాటు 'కంఫర్ట్ మోడ్'లో శబ్దం తక్కువగా, సౌకర్యవంతంగా ఉంటుందని పేర్కొన్నారు. వినియోగదారులు ఆశించే స్పోర్ట్స్ కార్ పనితీరుతోపాటు.. మంచి డ్రైవింగ్ అనుభూతిని ఇస్తుందని పేర్కొంటున్నారు..
శక్తివంతమైన ఇంజిన్.. 3.0 లీటర్ ఇన్‌లైన్ 6 సిలిండర్ టర్బో పెట్రోల్ మైల్డ్ హైబ్రిడ్ ఇంజన్ తో 450 హెచ్‌పీ శక్తిని అందిస్తూ, ఈ కార్ డైలీ డ్రైవింగ్‌కి అనువుగా ఉంటుందని కంపెనీ పేర్కొంటోంది. ‘స్పోర్ట్ ప్లస్’ మోడ్‌లో ఐకానిక్ ఏఎంజీ ఎగ్జాస్ట్ శబ్దం , క్రాకల్స్ వస్తాయని తెలిపింది. 9-స్పీడ్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఇంజన్‌తో బాగా సింక్ అవుతుందని, AWD సిస్టమ్ వల్ల పవర్‌ను గ్రిప్ కోల్పోకుండా పటిష్ఠంగా వాడుకోవచ్చని గుర్తు చేస్తోంది. రియర్ వీల్ స్టీరింగ్, అడాప్టివ్ సస్పెన్షన్ వంటివి దీని పరిమాణాన్ని మర్చిపోయేలా డ్రైవింగ్ అనుభవాన్ని ఇస్తాయని నమ్మకంగా చెబుతోంది. ఇంటీరియర్ విషయానికి వస్తే, ఇది సాధారణ మెర్సిడెస్‌లా ఉండి, మంచి స్టోరేజ్, పెద్ద డోర్ పొకెట్లు, కుదురైన డ్రైవింగ్ పొజిషన్‌ను అందిస్తుందని కంపెనీ తెలిపింది.
సూపర్బ్ ఫీచర్లు..ఈ మోడల్లో అధునాతమైన ఫీచర్లు ఉన్నాయి. 11.9 అంగుళాల పోర్ట్రెయిట్ టచ్‌స్క్రీన్, కార్బన్ ఫైబర్ ట్రిమ్, AMG స్పెసిఫిక్ సెటింగ్‌లు, వేడి/వెంటిలేటెడ్ సీట్స్, 360 డిగ్రీ కెమెరా, బుర్మెస్టర్ ఆడియో వంటి ఫీచర్లు వినియోగదారులకు మంచి అనుభూతిని ఇస్తాయని తెలిపింది. స్టీరింగ్ టచ్ కంట్రోల్స్ వాళ్ల మెరుగైన ప్రయాణ సౌకర్యాన్ని అందిస్తుందని తెలుస్తోంది. ఈ మోడల్ ధర రూ.1.35 కోట్లుగా ఉండగా, ప్రస్తుతం ఈ సెగ్మెంట్‌లో దీన్ని పోటీ పడగలిగే ప్రత్యర్థి లేదని కంపెనీ పేర్కొంటోంది. స్పోర్ట్స్ కార్ రంగంలో ఈ మోడల్ మిగతా కంపెనీలకు గట్టి పోటీ ఇస్తుందని, వినియోగ దారుల నుంచి మంచి ఫీడ్ బ్యాక్ వస్తుందని తాజాగా ఈ కారును రివ్యూ చేసిన నిపుణుల వద్ద నుంచి సమాధానం వస్తోంది.